Movie News

Harsha Sai: సినిమా ఇండస్ట్రీలోకి యూట్యూబర్ హర్ష సాయి.. రచ్చ మాములుగా ఉండదుగా!

Harsha Sai: ప్రముఖ యూట్యూబర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న హర్ష సాయి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇంత చిన్న వయసులోనే ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న ఈయన యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ యూట్యూబ్ ఛానల్ ద్వారా వచ్చే సంపాదనను పేదవారికి పంచుతూ పేదవారి కళ్ళల్లో ఆనందం చూస్తున్నారు.

యూట్యూబ్ ద్వారా వచ్చే సంపాదనను తిరిగి కటిక పేదరికంలో ఉన్న వారి కోరికలు ఏంటి అని తెలుసుకొని వారికి సహాయం చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇలా యూట్యూబ్ వీడియోల ద్వారానే ఈయన తిరిగి సంపాదిస్తూ దానిని పేద ప్రజలకు పెడుతూ ఆ వీడియోల ద్వారా తిరిగి సంపాదిస్తున్నారు. అలాగే పేదరికంలో ఉంటూ ఉన్నత చదువులు చదవాలనే వారికి కూడా ఈయన ఆసరాగా నిలుస్తున్నారు.

ఇండియాలో పేదలు లేకుండా నిర్మూలన చేయాలన్న లక్ష్యంతో పని చేస్తున్న హర్ష సాయి పేద వారి కోసం లక్షల్లో ఖర్చు చేస్తున్నారు. ఇలా ఇంత చిన్న వయసులోనే సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ అయిన యూట్యూబ్‌లో హార్ష సాయికి 80 లక్షల 64 వేల మంది( 8.64 మిలియన్ల) ఫాలోవర్స్ ఉండగా….. ఇన్‌స్టాగ్రామ్‌లో 40 లక్షలకు (4మిలియన్ల) ఫాలోవర్స్.. ఉన్నారు. ఇక ఫేస్ బుక్ తో పాటు ఇతర సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ లో చూస్తే.. దాదాపు కోటిమంది హర్షసాయిని ఫాలో అవుతున్నారు.

Harsha Sai: మిత్రా శర్మ సినిమాలో హర్ష సాయి…


ఇలా ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి ఈయన రాజకీయాలలోకి రాబోతున్నారంటూ గతంలో వార్తలు వచ్చాయి.అయితే ప్రస్తుతం ఈ వార్తలు వినిపించకపోయినా ఈయన మాత్రం సినిమా ఇండస్ట్రీలోకి రాబోతున్నారంటూ మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బిగ్ బాస్ ఫేమ్ మిత్రా శర్మ ఓ కొత్త సినిమాతో అలరించడానికి సిద్దమైంది. అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో పాన్ ఇండియా లెవెల్ లో యూట్యూబర్ గా గుర్తింపు తెచ్చుకున్న హర్ష సాయి భాగం కాబోతున్నారని వార్తలు వస్తున్నాయి మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago