Harsha Sai: ప్రముఖ యూట్యూబర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న హర్ష సాయి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇంత చిన్న వయసులోనే ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న ఈయన యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ యూట్యూబ్ ఛానల్ ద్వారా వచ్చే సంపాదనను పేదవారికి పంచుతూ పేదవారి కళ్ళల్లో ఆనందం చూస్తున్నారు.

యూట్యూబ్ ద్వారా వచ్చే సంపాదనను తిరిగి కటిక పేదరికంలో ఉన్న వారి కోరికలు ఏంటి అని తెలుసుకొని వారికి సహాయం చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇలా యూట్యూబ్ వీడియోల ద్వారానే ఈయన తిరిగి సంపాదిస్తూ దానిని పేద ప్రజలకు పెడుతూ ఆ వీడియోల ద్వారా తిరిగి సంపాదిస్తున్నారు. అలాగే పేదరికంలో ఉంటూ ఉన్నత చదువులు చదవాలనే వారికి కూడా ఈయన ఆసరాగా నిలుస్తున్నారు.
ఇండియాలో పేదలు లేకుండా నిర్మూలన చేయాలన్న లక్ష్యంతో పని చేస్తున్న హర్ష సాయి పేద వారి కోసం లక్షల్లో ఖర్చు చేస్తున్నారు. ఇలా ఇంత చిన్న వయసులోనే సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ అయిన యూట్యూబ్‌లో హార్ష సాయికి 80 లక్షల 64 వేల మంది( 8.64 మిలియన్ల) ఫాలోవర్స్ ఉండగా….. ఇన్‌స్టాగ్రామ్‌లో 40 లక్షలకు (4మిలియన్ల) ఫాలోవర్స్.. ఉన్నారు. ఇక ఫేస్ బుక్ తో పాటు ఇతర సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ లో చూస్తే.. దాదాపు కోటిమంది హర్షసాయిని ఫాలో అవుతున్నారు.

Harsha Sai: మిత్రా శర్మ సినిమాలో హర్ష సాయి…
ఇలా ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి ఈయన రాజకీయాలలోకి రాబోతున్నారంటూ గతంలో వార్తలు వచ్చాయి.అయితే ప్రస్తుతం ఈ వార్తలు వినిపించకపోయినా ఈయన మాత్రం సినిమా ఇండస్ట్రీలోకి రాబోతున్నారంటూ మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బిగ్ బాస్ ఫేమ్ మిత్రా శర్మ ఓ కొత్త సినిమాతో అలరించడానికి సిద్దమైంది. అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో పాన్ ఇండియా లెవెల్ లో యూట్యూబర్ గా గుర్తింపు తెచ్చుకున్న హర్ష సాయి భాగం కాబోతున్నారని వార్తలు వస్తున్నాయి మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.