Mahesh Vitta: నేనే రాజు నేనే మంత్రి సినిమాతో ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు నటుడు మహేష్ విట్టా. కమెడియన్ గా ఈ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఇతను వరుస అవకాశాలను దక్కించుకున్నారు.ఇకపోతే గతంలో బిగ్ బాస్ సీజన్ త్రీ ద్వారా కంటెస్టెంట్ గా వెళ్ళిన తర్వాత మరింత పాపులారిటీ పొందిన మహేష్ విట్టా బిగ్ బాస్ నాన్ స్టాప్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇదిలా ఉండగా ఈ కార్యక్రమానికి వెళ్లేముందు ఈయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇక బిగ్ బాస్ నాన్ స్టాప్ కార్యక్రమంలో ఎలాగైనా కప్పు తానే గెలుస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు.ఇకపోతే తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ తాను గత నాలుగు సంవత్సరాల నుంచి ఒక అమ్మాయితో రిలేషన్ లో ఉన్న విషయాన్ని బయటపెట్టారు.
తాను నాలుగు సంవత్సరాల నుంచి ఒక అమ్మాయితో రిలేషన్ లో ఉన్నానని అతను తన సిస్టర్ ఫ్రెండ్ అనే విషయాన్ని మహేష్ వెల్లడించారు. ఆ అమ్మాయిని చూడగానే అచ్చమ్మ అమ్మ పోలికలతో ఉండటం వల్ల ఏ మాత్రం ఆలోచించకుండా తనకు ప్రపోస్ చేశానని అయితే ఆ అమ్మాయి తనని రిజెక్ట్ చేసిందని తెలిపారు.ఇలా ప్రపోజ్ చేసిన తర్వాత రిజెక్ట్ చేసి తిరిగి నన్ను యాక్సెప్ట్ చేయడానికి రెండు సంవత్సరాల సమయం పట్టిందని మహేష్ నటించారు.
ప్రస్తుతం ఆ అమ్మాయి ఐటి జాబ్ చేస్తోందని,ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో మా పెళ్ళి జరగవచ్చు అంటూ మహేష్ విట్టా తన రిలేషన్ గురించి వెల్లడించారు. అయితే ఆ అమ్మాయి పేరు ఏమిటి? తన వివరాలను మాత్రం మహేష్ వెల్లడించలేదు. ఏది ఏమైన తనని రిజెక్ట్ చేసిన అమ్మాయిని చివరికి మహేష్ విట్ట పెళ్లి చేసుకోబోతున్నారని తెలియడంతో ఎంతో మంది ఈయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…