Tollywood star Heroine: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆమె స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది.ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే అద్భుతమైన విజయాలను అందుకొని గోల్డెన్ లెగ్ జాబితాలో ఉన్న హీరోయిన్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతోంది. అయితే ఈమె స్టార్డమ్ నిర్మాతలకు తలనొప్పిగా మారిపోయింది.
ప్రస్తుత కాలంలో హీరోయిన్లకు ఏమాత్రం క్రేజ్ ఏర్పడిన కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఏ మాత్రం క్రేజ్ లేని హీరోల సరసన నటించడం కోసం మరికొంత పారితోషికం డిమాండ్ చేస్తున్నారు. ఇలా కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఇండస్ట్రీలో చలామణిలో ఉన్న ఓ హీరోయిన్ నిర్మాతలకు చుక్కలు చూపిస్తుంది.
ఈమె ఏదైనా సినిమాలో నటించాలంటే తనకు అన్ని సౌకర్యాలు ఉండాలని తనకి మాత్రమే కాకుండా తనతో వచ్చే స్టాప్ కూడా ఖర్చులన్నీ నిర్మాతలే భరించాలని డిమాండ్ చేస్తుంది. తన అసిస్టెంట్ లకు,తనతో పాటు ఉండే స్టాప్ ఖర్చులను కూడా నిర్మాతే భరించాలని చెప్పడంతో నిర్మాతలకు ఈమె ఎంతో భారంగా మారిపోయింది.
తాజాగా ఓ సినిమా షూటింగ్ నిమిత్తం నిర్మాతలు ఈ హీరోయిన్ కోసం ఒక ఫైవ్ స్టార్ హోటల్ కేటాయించారు. అయితే తన స్టాఫ్ కి కూడా అన్ని సౌకర్యాలు ఉండేలా చూడాలని చెప్పడంతో ఏకంగా తన స్టాప్ కోసం వసతి సౌకర్యాలను ఏర్పాటు చేయడం కోసం నిర్మాతలు ఏకంగా 15 లక్షల రూపాయలను ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఇక తన సినిమా కోసం తానే డబ్బింగ్ చెబుతుందని,తాను డబ్బింగ్ చెప్పేలా ఉంటేనే సినిమా చేస్తానని కరాఖండిగా చెప్పేస్తుంది. ఇలా ఒక రోజులో పూర్తి చేయాల్సిన డబ్బింగ్ నాలుగు రోజుల వరకు సాగ తీస్తుందని ఈమెను భరించడం తమకు తలనొప్పిగా మారిందని నిర్మాతలు హీరోయిన్ ప్రవర్తన గురించి తలలు పట్టుకుంటున్నారని చెప్పాలి. ఇక ఈ హీరోయిన్ నటించిన సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…