Featured

Imandi Ramarao : ఆసియా నుండి ఒకేఒక్కడు ఎన్టీఆర్ కి ఆస్కార్ అవార్డు వస్తుందా… మీడియా ప్రచారంలో నిజమెంత..!

Imandi Ramarao : త్రిబుల్ ఆర్ సినిమా మార్చ్ 27 న విడుదలైనప్పటి నుండి అటు వసూళ్ల పరంగా బాగా దూసుకుపోయింది. ఇక ఎన్టీఆర్, రామ్ చరణ్ నటన వారి కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. ఇద్దరూ పోటీ పడి నటించారు. ఇక మనం ఇండియా లోనే కాకుండా అమెరికా వంటి వెస్ట్రన్ దేశాలలో కూడా త్రిబుల్ ఆర్ సినిమా బాగా నచ్చింది. హాలీవుడ్ రైటర్స్, క్రిటిక్స్, అలాగే దర్శకులు సినిమాను ప్రశంసించడం మన తెలుగు సినిమాకు ఇచ్చిన గౌరవం. ఇక ఇపుడు మరో వార్త గత కొద్ది రోజులుగా బాగా ట్రెండ్ అవుతోంది. అదే ఆస్కార్ నామినేషన్స్. సినిమా ఈ సారి ఖచ్చితంగా ఏదో ఒక విభాగంలో ఆస్కార్ కి వెళ్తుందని అందరికీ నమ్మకం ఉంది. అయితే ఇప్పుడు మరో వార్త అందరినీ ఆనందంలో మునిగితేలేలా చేస్తోంది. అదే త్రిబుల్ ఆర్ సినిమా నుండి కొమరం భీమ్ పాత్రలో నటించిన ఎన్టీఆర్ కు ఆస్కార్ నామినేషన్స్ లో చోటు దక్కింది అనే వార్త.

ఆసియా నుండి ఒక్కడే…

ఇక ఇంగ్లిష్ మ్యాగ్ జైన్ వెరైటీ పత్రిక తన కథనంలో ఆస్కార్ కి నామినేట్ అయ్యే అవకాశం ఉన్న నటుల లిస్టులో ఎన్టీఆర్ పేరును చేర్చింది. ఆసియా నుండి ఎన్టీఆర్ పేరు ఒక్కటే ఉండటంతో అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ విషయం మీద ఇమంది రామారావు మాట్లాడారు. ఆస్కార్ కి నామినేషన్ వెళ్లే అర్హత ఉన్న వారి లిస్ట్ లో ఎన్టీఆర్ పేరు ఉండటం అందరికీ గర్వకారణం అంటూ చెప్పారు. ఈ క్రెడిట్ ఒక్క ఎన్టీఆర్ కో లేక రాజమౌళి కో రాదు, కలసి కష్టపడిన చిత్ర బృందానికి చెందుతుంది.

ఇక అలాగే ఎన్టీఆర్ నామినేట్ అయ్యాడంటే రామ్ చరణ్ ను తక్కువ చూడాలని కాదు అంటూ చెప్పారు. ఇక ఆస్కార్ అవార్డు వచ్చినా రాకపోయినా ఎన్టీఆర్ రామ్ చరణ్ నటన అటు ఇండియా ప్రేక్షకులకే కాదు పాశ్చాత్య దేశాల వారికి బాగా నచ్చింది. ఇక ఈ సినిమా ఆల్రెడీ మన తెలుగు ఖ్యాతిని హాలీవుడ్ ముందు పెట్టింది, ఇక ఆస్కార్ వస్తే మరో కీర్తిని సాధించడమే. ఇతర భాషలలో నటులకు ఎంతవరకు ఆస్కార్ ఇస్తారో చూడాలి, ఇంతవరకు ఆస్కార్ కి నామినేట్ అవ్వడమే కానీ మన వాళ్ళు గెలిచింది లేదు కాబట్టి గెలిస్తే అది మంచి పరిణామం అంటూ చెప్పారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago