Featured

Imandi Ramarao : గాడ్ ఫాదర్ పై చిరు ఆశలు గల్లంతు… నష్టాలలో గాడ్ ఫాదర్… లాస్ ఎంతంటే : ఇమంది రామారావు

Imandi Ramarao : ఆకలితో ఉన్న వ్యక్తికి బిర్యానీ దొరికినట్లు ఆచార్య తో నిరాశలో ఉన్న మెగా అభిమానులకు గాడ్ ఫాదర్ బిర్యానీలా దొరికిందని చెప్పొచ్చు. మెగాస్టార్ ని మాస్ హీరోగా ఎలివేట్ చేసి డైరెక్టర్ సక్సెస్ అయినట్లే. చిరుతో పాటు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తెలుగులో ఈ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఇక లూసిఫర్ సినిమా తెలుగులో కూడా డబ్ అవడం వల్ల ఆల్రెడీ సినిమా కథ ఏంటి అనేది అందరికీ తెలుసు, అయితే సినిమాలో చిరుని ఎలా చూపించాడు, మన తెలుగు నేటివిటీకి తగ్గట్టు కథను డైరెక్టర్ మలిచాడా, ప్రేక్షకులకు నచ్చిందా అన్నదే పాయింట్ ఈ విషయంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. మెగాఫ్యాన్స్ కి సినిమా పండగ అనే చెప్పాలి. అంతా బాగున్నా సినిమాకు వసూళ్లు లేవు నష్టాల్లో ఉంది అంటూ విశ్లేషించారు ఇమంది రామారావు గారు.

చిరంజీవి ఆశలన్నీ అడియాసలు అయ్యాయి…

ఇమంది గారు మాట్లాడుతూ సినిమా కథను కొత్తగా చూపించే ప్రయత్నం డైరెక్టర్ చేయలేదు. కేవలం కథనం కొత్తగా ఉండటం వల్ల కొన్ని వర్గాల ఆడియన్స్ కి సినిమా నచ్చింది కానీ సినిమాలో పెద్దగా కొత్తదనం ఏమి లేదు అంటూ చెప్పారు. సినిమాలో చిరుకి హీరోయిన్ లేకపోవడం, సినిమా మొత్తం సమాజానికి ఏదో చేసేవాడిలా కాకుండా కేవలం తన కుటుంబంలో అమ్మాయి ముఖ్యంగా నయనతార క్యారెక్టర్ చెల్లెలు అపార్థం చేసుకుంది దాన్ని చెరిపేయాలి అన్నట్లుగానే సినిమా మొత్తం సాగుతుంది. చివరికి ఆమెను ముఖ్యమంత్రిని చేస్తాడు ఇందులో పెద్దగా ప్లస్ అయిన అంశాలు కనిపించలేదు.

అందుకే సినిమా అంతగా ఆడలేదు ఇప్పటికీ 30 కోట్ల నష్టాలు సినిమాకు వచ్చాయనే వార్తలు వినిపిస్తున్నాయి. సినిమా కథను ఎలా తీయాలనుకున్నారో అలానే తీసుంటే సరిపోయుండేది కానీ చాలా మార్పులు చేశారు. ఇక డైరెక్టర్ సినిమా ప్రతి ఫ్రేమ్ లోనూ జనాలు ఉండేలా చూసుకున్నారు తన డైరెక్షన్ తో ఆకట్టుకున్నా వసూళ్లు మాత్రం రాబట్టలేక పోయాడు అంటూ ఇమంది గారు అభిప్రాయపడ్డారు. ఆచార్య సినిమా తరువాత గాడ్ ఫాదర్ మీద చిరు ఎన్నో ఆశలు పెట్టుకున్నా నిరాశ పరిచాయి అంటూ చెప్పారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago