Featured

Imandi Ramarao : మా అసోసియేషన్ ప్రెసిడెంట్ గా గెలిచాక ఫోజులు కొడుతున్నాడు, మీకు చేత కాక ఆ స్టార్ హీరో మీద పడి ఏడుస్తారా : ఇమంది రామారావు

Imandi Ramarao : మా అసోసియేషన్ ఎన్నికలు జరిగి ఏడాది అయిపోయింది. సాధారణ సర్వత్రిక ఎన్నికలను తలపించేలా ఈసారి మా ఎలక్షన్స్ జరిగాయి. మా అసోసియేషన్ బిల్డింగ్ తన సొంత డబ్బుతో కట్టిస్తానని, నేను లోకల్ అంటూ ఇండస్ట్రీ లో చిన్న ఆర్టిస్తులకు హామీలు ఇచ్చిన విష్ణు ఆ హామీల వల్లే ప్రకాష్ రాజ్ ప్యానెల్ మీద విజయం సాధించాడు. అయితే మా అధ్యక్షుడు అయి ఏడాది గడిచిపోయింది. ఈ ఏడాదిలో ఏం పనులు చేసాడు హామీలను ఎంతవరకు నిలబెట్టుకున్నాడు అన్న విషయాల మీద మీటింగ్ ఏర్పాటు చేసి విష్ణు మాట్లాడారు. ఇక విష్ణు మాటల మీద ఆయన హామీల మీద సీనియర్ జర్నలిస్ట్ ఇమంది గారు ఆయన విశ్లేషణ చెప్పారు.

ఒక్క హామీ అయినా తీరిందా.. ఆ స్టార్ హీరో మీద పడి ఏడవడం తప్ప…

విష్ణు మా అసోసియేషన్ భవనం సొంత డబ్బుతో కడతానని హామీ ఇవ్వడం వల్లే గెలిచాడు. కానీ ఇంతవరకు ఏడాది గడిచినా ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. మిగిలిన హామీలను చేస్తున్నాను మా బిల్డింగ్ కోసం రెండు ఆప్షన్స్ ను సభ్యుల ముందు పెట్టాను అంటూ ఒకటి ఫిల్మ్ నగర్ లో ఉన్న ఒక భవనం మా బిల్డింగ్ కోసం తీసుకోవడం. లేదా ఇపుడున్న పాత ఫిల్మ్ అసోసియేషన్ బిల్డింగ్ ను పడగొట్టి నిర్మించడం. మొదటి దానికి ఒక ఏడాది లో అయిపోతుంది. రెండో ఆప్షన్ అయితే ఒక నాలుగేళ్ళైనా సమయం పడుతుంది అంటూ చెప్పారు. ఇక ఈ విషయాల మీద మాట్లాడుతూ ఇమంది గారు విష్ణు హామీల విషయంలో ఒక్కటైనా జరిగిందా, ఉన్న పాత భవనం పడగొట్టి మళ్ళీ కట్టడమేమిటి, ఇపుడున్న భవనం లో వ్యాపార సముదయాలు కళ్యాణ మండపం అన్నీ ఉన్నాయి మంచి ప్రణాళికతో అప్పట్లో కట్టారు.

దాన్ని కూల్చి మళ్ళీ కొత్తది కట్టడం ఏమిటి అంటూ ప్రశ్నించారు. ఇలాగే కాలయాపన చేసి చివరికి ఇండస్ట్రీలో కొంతమంది నేను చేసే మంచి పనులను ఓర్వలేక పనులను జరగనివ్వలేదు అంటూ చెబుతారు. ఆ వ్యక్తి ఎవరని మాత్రం చెప్పరు. ఇప్పుడు కూడా మా గెలుపును ఓర్వలేక మా మీద సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేయిస్తున్నాడు ఆ బడా హీరో అంటూ మాట్లాడుతారు కానీ ఆ హీరో ఎవరో చెప్పరు. చిరంజీవి గారికి మోహన్ బాబు గారికి ఎపుడూ కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది అంటూ ఇమంది గారు విష్ణు గురించి అభిప్రాయపడ్డారు.

Bhargavi

Recent Posts

కూరలో ఉప్పు ఎక్కువైందా? ఇక టెన్షన్ అవసరం లేదు.. ఈ సింపుల్ చిట్కాలతో రుచి మళ్లీ సెట్!

వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…

1 day ago

కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చుంటున్నారా? వెన్నెముకకు ముప్పు తెస్తున్న కొత్త జీవనశైలి ఇదే!

ఒకప్పుడు వెన్నునొప్పి, మెడ నొప్పి, వెన్నెముక సమస్యలు అంటే 50 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపించేవి. వయసు పెరగడం,…

1 day ago

మధుమేహం, గుండె జబ్బులు లేకుండా పిల్లలు పుడతారా? శాస్త్రవేత్తల కొత్త ప్రయోగం ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది!

వైద్య శాస్త్రం రోజురోజుకూ కొత్త మైలురాళ్లు చేరుకుంటోంది. ఒకప్పుడు నయం చేయలేని వ్యాధులకు మందులు కనుగొన్న శాస్త్రవేత్తలు ఇప్పుడు వ్యాధులు…

1 day ago

కరివేపాకుతో బరువు తగ్గొచ్చా? రోజూ ఇలా తీసుకుంటే ఆరోగ్యానికి ఎన్నో లాభాలు!

ఈ రోజుల్లో చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. పని ఒత్తిడి,…

1 day ago

83 ఏళ్ల వయసులోనూ అదే కసి.. ఒక సీన్ కోసం నిద్ర మానేసిన అమితాబ్ బచ్చన్!

సినిమా అంటే అంకితభావం. పాత్ర అంటే బాధ్యత. ప్రేక్షకుల ముందు కనిపించే ప్రతి సన్నివేశం పరిపూర్ణంగా ఉండాలనే తపన. ఇవన్నీ…

1 day ago

పీరియడ్స్ సమయంలో యోగా చేయొచ్చా? అపోహలు పక్కన పెట్టండి.. నిపుణులు చెబుతున్న నిజాలు ఇవే!

నేటి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన కొద్దీ యోగా చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. శారీరక ఆరోగ్యంతో పాటు…

1 day ago