Imandi Ramarao : ప్రభాస్ కేవలం టాలీవుడ్ హీరో కాదు ఇపుడు పాన్ ఇండియా సూపర్ స్టార్. బాహుబలితో ప్రభాస్ కి ఉన్న క్రేజ్ తో ఫాలోయింగ్ కూడా అలానే పెరిగింది. ఇక ఆయన లేటెస్ట్ సినిమా అప్ డేట్స్ కోసం అభిమానులు పరితపిస్తున్నారు. బాహుబలి తరువాత ప్రభాస్ నటించిన సాహో, రాధే శ్యామ్ రెండు సినిమాలు డిజాస్టర్ గా నిలవడంతో అసలే నిరాశలో ఉన్న అభిమానులకు ‘ఆదిపురుష్’ సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం ప్రభాస్ మూడు పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్నాడు. ఆ మూడు సినిమాలు ఆదిపురుష్, ప్రాజెక్ట్ కే, సలార్. ఇందులో సలార్ కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వస్తుంటే ప్రాజెక్ట్ కే మహా నటి డైరెక్టర్ నాగ అశ్విన్ డైరెక్షన్ లో వస్తోంది. ఇక ఆదిపురుష్ ఓం రౌత్ డైరెక్షన్ లో వస్తోంది.

ఆదిపురుష్ టీజర్ పై ప్రభాస్ ఆగ్రహం…
ఎంతో కాలం నుండి ఆదిపురుష్ టీజర్ కోసం వెయిట్ చేస్తున్న అభిమానులకు నిరాశే మిగిలింది. ట్రైలర్ చూసిన అభిమానులు డైరెక్టర్ ను బాగా ట్రోల్ చేస్తున్నారు. ఒక కార్టూన్ సినిమాలో కూడా ఇంతకంటే గొప్పగానే విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ ఉంటాయి. ఇది అంతకన్నా చీప్ గా ఉంది అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రభాస్ కూడా ఈ విషయంలో డైరెక్టర్ మీద గుర్రుగా ఉన్నాడంటూ వినిపిస్తోంది. అయితే ఈ విషయాల మీద సీనియర్ జర్నలిస్ట్ ఇమంది గారు మాట్లాడుతూ ప్రభాస్ తన సినిమా స్క్రిప్ట్ మీద తన బాడీ మేక్ ఓవర్ మీద దృష్టి పెట్టక పోతే కష్టం అంటూ చెప్పారు.

కావాలనే బాలీవుడ్ వాళ్ళు ఇలా ప్రభాస్ సినిమా తీయిస్తున్నారని, రామాయణంను వక్రీకరిస్తున్నారన్న కామెంట్స్ కు స్పందిస్తూ అలాంటిదేమీ లేదు కానీ డైరెక్టర్ ఇపుడున్న టెక్నాలజీ ఉపయోగించి ఇప్పటి తరానికి రామాయణం కొత్తగా చెప్పాలనుకున్నాడు. కానీ మూలాలు మర్చిపోయాడు చూపించడంలో ఫెయిల్ అయ్యాడు అందుకే రావనుడి పాత్ర, రాముడి పాత్ర విషయంలో ఇంత ట్రోల్ ఎదురకొంటున్నాడు అంటూ చెప్పారు. తప్పులను సరిచేసుకుని ప్రభాస్ తన సినిమాల మీద దృష్టి పెడితే ఇంకా తన కెరీర్ కి జరగాల్సిన నష్టం తగ్గుతుందని అభిప్రాయపడ్డారు.






























