Movie News

ఆ రోజే అనుకున్నాను.. బన్నీతో నటించాలని.. నేడు ఇలా..!

పుష్ప ఇప్పుడు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న తెలుగు చిత్రాలలో ఒకటి. ఈ చిత్రంలో అల్లు అర్జున్ , రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు సుకుమార్. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది . ఆదివారం హైదరాబాద్‌లో చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది ఈ వేడుక కోసం రెండు రాష్ట్రాల నుంచి వేలాది మంది అభిమానులు వచ్చారు.

ఈ సందర్భంగా రాజమౌళి , కొరటాల శివ ముఖ్య అతిథులుగా విచ్చేశారు .ఈ చిత్రంలో రష్మిక మందన్న శ్రీవల్లి, అల్లు అర్జున్ పుష్ప రాజ్ గా కనిపించబోతున్నారు. వీళ్లద్దరి మధ్య రొమాంటిక్ ఎంతో ఆసక్తిని చూపుతుంది. ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రష్మికా మాట్లాడుతూ.. గీత గోవిందం ఆడియో వేడుకకు అల్లు అర్జున్ హాజరైనప్పుడు నేను అతనితో కలిసి పనిచేయాలని కోరుకున్నానని.. కానీ ఇంత త్వరగా శ్రీవల్లిగా బన్నీ సరసన నటిస్తానని అనుకోలేదు అని చెప్పింది.

ఇక్కడ ఈ అభిమానం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందని మురిసిపోయింది. బన్నీ స్పీచ్ కోసం మీరంతా ఎదురు చూస్తున్నారని అర్థం అయింది.. తొందరగా మాట్లాడి నేనే వెళ్లిపోతాను అంటూ నవ్వుకుంటూ మాట్లాడారు.. ఇక ఈ సినిమా కోసం దాదాపు 2 నెలలు ఎలాంటి రెస్ట్ లేకుండా వర్క్ చేశానని.. తన తల్లిదండ్రులను చూడటానికి కూడా టైం లేకుండా పోయిందని చెప్పింది.

అందుకే సుక్కు సార్ ను నన్ను దత్తత తీసుకోమని.. సంతకాలు కూడా పెట్టానని చమత్కరించారు. అందరిలాగానే తాను కూడా పుష్ప రిలీజ్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నానని అన్నారు. అల్లు అర్జున్ సార్ ఫ్యాన్స్ తో పాటు.. నా కోసం నా ఫ్యాన్స్ కూడా ఈ సినిమా కు వస్తారని.. ఇందులో తాను కనిపించనని.. కేవలం క్యరెక్టర్స్ మాత్రమే కనిపిస్తాయని చెప్పుకొచ్చారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago