పుష్ప ఇప్పుడు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న తెలుగు చిత్రాలలో ఒకటి. ఈ చిత్రంలో అల్లు అర్జున్ , రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు సుకుమార్. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది . ఆదివారం హైదరాబాద్‌లో చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది ఈ వేడుక కోసం రెండు రాష్ట్రాల నుంచి వేలాది మంది అభిమానులు వచ్చారు.

ఈ సందర్భంగా రాజమౌళి , కొరటాల శివ ముఖ్య అతిథులుగా విచ్చేశారు .ఈ చిత్రంలో రష్మిక మందన్న శ్రీవల్లి, అల్లు అర్జున్ పుష్ప రాజ్ గా కనిపించబోతున్నారు. వీళ్లద్దరి మధ్య రొమాంటిక్ ఎంతో ఆసక్తిని చూపుతుంది. ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రష్మికా మాట్లాడుతూ.. గీత గోవిందం ఆడియో వేడుకకు అల్లు అర్జున్ హాజరైనప్పుడు నేను అతనితో కలిసి పనిచేయాలని కోరుకున్నానని.. కానీ ఇంత త్వరగా శ్రీవల్లిగా బన్నీ సరసన నటిస్తానని అనుకోలేదు అని చెప్పింది.
ఇక్కడ ఈ అభిమానం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందని మురిసిపోయింది. బన్నీ స్పీచ్ కోసం మీరంతా ఎదురు చూస్తున్నారని అర్థం అయింది.. తొందరగా మాట్లాడి నేనే వెళ్లిపోతాను అంటూ నవ్వుకుంటూ మాట్లాడారు.. ఇక ఈ సినిమా కోసం దాదాపు 2 నెలలు ఎలాంటి రెస్ట్ లేకుండా వర్క్ చేశానని.. తన తల్లిదండ్రులను చూడటానికి కూడా టైం లేకుండా పోయిందని చెప్పింది.
అందుకే సుక్కు సార్ ను నన్ను దత్తత తీసుకోమని.. సంతకాలు కూడా పెట్టానని చమత్కరించారు. అందరిలాగానే తాను కూడా పుష్ప రిలీజ్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నానని అన్నారు. అల్లు అర్జున్ సార్ ఫ్యాన్స్ తో పాటు.. నా కోసం నా ఫ్యాన్స్ కూడా ఈ సినిమా కు వస్తారని.. ఇందులో తాను కనిపించనని.. కేవలం క్యరెక్టర్స్ మాత్రమే కనిపిస్తాయని చెప్పుకొచ్చారు.

































