Divyavani: ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం ఉండగానే ఇప్పటికే ఏపీ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇప్పటికే అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరికొకరు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉండగా టీడీపీలో పార్టీలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా భగ్గుమంటున్నాయి. తాజాగా టీడీపీ పార్టీలో ఎంతో కీలకంగా వ్యవహరించిన నటి దివ్యవాణి ఈ పార్టీ నుంచి బయటకు వచ్చారు.
ఈ విధంగా ఈమె పార్టీని వదిలి బయటకు రావడమే కాకుండా టీడీపీ నేతలపై పలు ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు.ఈ క్రమంలోనే దివ్యవాణి మరొక టీడీపీ మహిళా నేతతో మాట్లాడిన ఫోన్ కాల్ సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే మరొక టీడీపీ మహిళా నేత దివ్యవాణికి ఫోన్ చేసి ఎందుకు మీరు పార్టీ నుంచి బయటకు వెళ్లారు అని ప్రశ్నించారు.
పెద్దాయన (చంద్రబాబు) తో కలిసి మీటింగ్ పెట్టిన తర్వాత నిర్ణయం తీసుకోవాల్సింది. ఈసారి గవర్నమెంట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తొందరపడి నిర్ణయం తీసుకున్నావేమో అంటూ అవతలి మహిళ దివ్యవాణితో మాట్లాడారు. ఈ సందర్భంగా దివ్యవాణి సమాధానం చెబుతూ మీకు తెలిసినదే కదా నాకు పదవి ముఖ్యం కాదు.పార్టీ కోసం గత మూడున్నర సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడ్డాను అయితే అక్కడ తనకు ఏమాత్రం గౌరవం లేదని దివ్యవాణి తెలిపారు.
పదవుల కోసం కుక్కల మాదిరి అందరి చుట్టూ తిరగాలి అంటే నేను చేయలేను ఒక లిమిట్ వరకు పనులు చేస్తున్నాం అంటూ ఈమె తెలిపారు. నన్ను పార్టీలో ఎవరో టార్గెట్ చేశారు అంటూ ఈమె పలు విషయాలను వెల్లడించారు. నేను రాజకీయాల కోసం బ్రతకడం లేదు. మేము పబ్లిక్ ఫిగర్స్ వంద మందికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది అంటూ దివ్యవాణి తెలిపారు.
ఇకపోతే అవతల మహిళ మాట్లాడుతూ నా పదవి నీకు ఇస్తే తీసుకుంటావా అని ప్రశ్నించగా…అశోక్ బాబు, అచ్చెన్నాయుడు,జనార్థన్ ప్రస్తుతం రాజకీయం అంతా వీళ్ల చుట్టే ఉందన్నారు. వారి చెప్పినట్లే చేయాలి లేదంటే పదవులు ఎవరికి ఇవ్వరు. దివ్యవాణికి అంగన్వాడి పదవి బాధ్యతలు ఇవ్వాలన్నారు అంటూ మహిళా నేత చెప్పగా.. ఆమెపర్సనల్ పని చేయదు కదా అన్నారు అంటూ మహిళా నేత చెప్పగా దివ్యవాణి అంగన్వాడి పదవి ఇస్తే ఇలా బాడ్ పనులు చేయాలా అంటూ ప్రశ్నించారు. కష్టపడిన వాళ్ళకు పార్టీలో విలువ లేదని ఈ సందర్భంగా దివ్యవాణి అవతలి మహిళా నేతతో మాట్లాడిన ఈ సంభాషణ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…