సాధారణంగా ప్రపంచంలోని దేశాల పేర్లు వాటి రాజధానులు కరెన్సీలు చెప్పమంటే టక టక ఒక నాలుగైదు దేశాల పేర్లను చెబుతాము. మహా అయితే ఓ పదో 20 దేశాల పేర్లును గుర్తు పెట్టుకుంటారు. కానీ దుబాయ్ లో నివసించే 10 సంవత్సరాల భారతీయ చిన్నారి ఏకంగా 195 దేశాల పేర్లు, వాటి రాజధానులు, కరెన్సీలను గడగడ చెబుతూ అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.
తల్లిదండ్రులతో పాటు దుబాయ్ లో నివసిస్తున్న పదేళ్ల చిన్నారి సారా చిపాకు సంబంధించిన ఒక కార్యక్రమం మే 2వ తేదీ సోషల్ మీడియాలో ప్రసారం అయింది. ఈ కార్యక్రమంలో భాగంగా సారా ఏమాత్రం గుక్క తిప్పకుండా 195 దేశాలు, వాటి రాజధానులు కరెన్సీ పేర్లను చెబుతూ అందరినీ ఎంతో ఆశ్చర్యానికి గురి చేసింది.
ఇప్పటివరకు ప్రపంచంలోని దేశాల పేర్లు రాజధానులు చెప్పిన వారి సంఖ్య చాలానే ఉంది. కానీ రాజధాని లతోపాటు కరెన్సీ పేర్లను చెప్పడం చాలా అరుదు. అయితే పదేళ్ల సారా ఈ విధంగా రాజధానులు కరెన్సీ లను చెప్పడంతో ప్రపంచ స్థాయి రికార్డును సొంతం చేసుకుంది. ఈ ప్రసారం చూసిన పలువురు చిన్నారి సారాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
నిజానికి సారా సొంత గ్రామం రాజస్థాన్ లోని బిల్వారా ప్రాంతం . అయితే తమ తల్లిదండ్రులు దుబాయ్ లో నివసించడంతో తల్లిదండ్రులతో పాటు సారా కూడా దుబాయ్ లోనే ఉన్నారు. ప్రస్తుతం ప్రపంచ స్థాయి రికార్డు సాధించిన ఈ చిన్నారి సారకు సంబంధించినటువంటి ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతో మంది భారతీయులు ప్రశంశలను అందుకుంటోంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…