సాధారణంగా కొన్ని సార్లు మన ప్రమేయం లేకుండా కొన్ని పనులు జరుగుతూ ఉంటాయి. అయితే ఇలాంటి ప్రమాదాలు ఎన్నో దారుణాలకు కారణమవుతాయి. తాజాగా అనుకోకుండా భార్య మద్యం గ్లాసు కింద పడడంతో దీంతో ఆగ్రహం చెందిన భర్త.. మహిళ పట్ల ఎంతో దారుణంగా ప్రవర్తించిన ఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
ఉత్తరప్రదేశ్‌లోని ఖేరి జిల్లాలో నిఘాసాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాయ్‌పూర్ దులాహి గ్రామంలో చోటుచేసుకుంది. ఈ గ్రామంలో గీతా దేవి, రమేష్ కుమార్ నిషాద్ దంపతులు నివాసం ఉంటున్నారు. బుధవారం రాత్రి నిషాద్ మద్యం తాగే గ్లాస్ అనుకోకుండా గీత కింద పడేసింది. దీంతో ఆగ్రహం చెందిన నిషాద్ తన భార్యతో గొడవకు దిగాడు.
అప్పటి గొడవ సద్దుమణిగిన అర్ధరాత్రి ఈ విషయం గురించి మరోసారి తీవ్రంగా గొడవ పడ్డారు. వీరి ఇద్దరి మధ్య మాటా మాటా పెరగడంతో నిషాద్ గీత తలపై కర్రతో బలంగా కొట్టాడు. దీంతో గీత గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి చూసే సమయానికి గీతా రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతుంది. ఈ విషయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్న సమయంలో తన భర్త పరారీలో ఉండగా గీత మృతి చెంది కనిపించింది.అతనిపై 302 సెక్షన్ హత్య నేరం కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశాం. అదేవిధంగా గీతను చంపడానికి ఉపయోగించిన కర్రను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…