Indraja : ట్రాన్స్ జెండర్ తో కలిసి లైవ్ అందుకే చేశా.. ట్రాన్స్ జెండర్ కష్టాలు చెబుతూ ఎమోషనల్ అయిన నటి ఇంద్రజ !

Indraja : ఒకప్పటి తెలుగు హీరోయిన్ ఇంద్రజ మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే సినిమాల్లో కంటే బుల్లితెర పై బాగా ఫేమస్ అయింది ఇంద్రజ. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ లలో జడ్జిగా మళ్ళీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఈ మధ్య శ్రీదేవి డ్రామా కంపెనీలో కనిపించడం లేదు ఇంద్రజ. శ్రీదేవి డ్రామా కంపెనీ లో ప్రతివారం ఒక కాన్సెప్ట్ తో ఎపిసోడ్ చేస్తారు. ఇక ఒకసారి ట్రాన్స్ జెండర్ల గురించి వాళ్లు ఎదుర్కొంటున్న వివక్ష గురించి ఎపిసోడ్ చేసి, ఆ ఎపిసోడ్ చివర్లో చదువు వల్ల ట్రాన్స్ జెండర్ల జీవితాలు మారుతాయి అనే ముగింపును ఇచ్చారు.

ట్రాన్స్ జెండర్స్ కు చదువు అవసరం…

ఇక ఇంద్రజ గారు ఆ ఎపిసోడ్ లో చదువుకోవాలనుకునే ట్రాన్స్ జెండర్లు ఎవరైనా ఉంటే నన్ను కాంటాక్ట్ అయితే సహాయం చేస్తానని చెప్పారు. ఇక కొన్నిరోజులకు ఒక ట్రాన్స్ జెండర్ ఇంద్రజ గారికి కాల్ చేసి బాగా మార్క్స్ వచ్చి ఒక ట్రాన్స్ జెండర్ కు మంచి కాలేజీ లో సీటు వచ్చిందని అయితే సహాయం కావాలని అడిగారట. ఇక ఇంద్రజ చేస్తానని హామీ ఇచ్చారు. కానీ ఆతరువాత అటు నుండి మళ్ళీ ఫోన్ రాలేదు, దీంతో ఇంద్రజ గారే మళ్ళీ కాల్ చేసినా స్పందించలేదు. చివరికి ఇంకో రోజు ఇంద్రజ గారే కాల్ చేయగా కాలేజీ లో చేర్చుకోమని ట్రాన్స్ జెండర్ అని చెప్పడం వల్ల అభ్యంతరం చెప్పారని చెప్పడంతో ఇంద్రజ గారు ఆశ్చర్యపోయారట. మన రాజ్యాంగం ప్రతి ఒక్కరికి సమానంగా చదువుకునే హక్కు ఇచ్చినపుడు అలా ట్రాన్స్ జెండర్ అనే నెపం తో ఎలా చేర్చుకోమని అంటారు, అక్కడ చదివే మిగతా విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుందని వారి తల్లిదండ్రులు కూడా అభ్యంతరం చెబుతారని ఆ కాలేజీ యాజమాన్యం చెప్పారట. దీంతో ఇంద్రజ గారు సోషల్ మీడియా వేదికగా లైవ్ పెట్టి యువత అభిప్రాయం తీసుకున్నారు.

చాలా మంది పాజిటివ్ గా స్పందించడం ఆనందంగా అనిపించిందని ఇంద్రజ గారు చెప్పారు. ఇక ట్రాన్స్ జెండర్లకు చేయూతనిచ్చి చదువుకొనిచ్చి ఉద్యోగాలను కల్పిస్తే వారి జీవితాలు మారిపోతాయాని, వారిని చిన్నచూపు చూసే ధోరణి మారాలని, సెక్స్ వర్కర్లు అనే ముద్ర తీసేయాలని చెప్పారు. తనలాగే ట్రాన్స్ జెండర్ల కోసం ఎవరైనా సహాయం చేయడానికి ముందుకు వస్తే వారితో కలిసి పనిచేయడానికి సిద్ధమని తెలిపారు.