Rajamouli: రాజమౌళిపై విమర్శల జల్లు.. జక్కన్న ఎంటి ఇలా చేస్తున్నాడంటూ..!

Rajamouli: రాజమౌళిపై విమర్శల జల్లు.. జక్కన్న ఎంటి ఇలా చేస్తున్నాడంటూ..!

Rajamouli: దేశవ్యాప్తంగా ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్న సినిమా ట్రిపుల్ ఆర్. కోవిడ్ కారణాల వల్ల మళ్లీ వాయిదా పడింది. దీంతో సినిమాపై ఎన్నో ఆశలు పట్టుకున్న అభిమానులు నిరాశకు లోనయ్యారు. సినిమాను వాయిదా వేస్తున్నట్లు ఇటీవల చిత్ర యూనిట్ అఫీషియల్ గా ప్రకటించింది.

Rajamouli: రాజమౌళిపై విమర్శల జల్లు.. జక్కన్న ఎంటి ఇలా చేస్తున్నాడంటూ..!
Rajamouli: రాజమౌళిపై విమర్శల జల్లు.. జక్కన్న ఎంటి ఇలా చేస్తున్నాడంటూ..!

దీంతో అభిమానులు రాజమౌళితో పాటు చిత్ర యూనిట్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నాలుగు సార్లు ట్రిపుల్ ఆర్ వాయిదా పడటంతో ఫ్యాన్స్ ఊరుకోవడం లేదు. సోషల్ మీడియా వేదికగా ట్రిపుల్ ఆర్ సినిమాపై తెగ ట్రోలింగ్స్, మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. 

Rajamouli: రాజమౌళిపై విమర్శల జల్లు.. జక్కన్న ఎంటి ఇలా చేస్తున్నాడంటూ..!

ఇదిలా ఉంటే ఇండస్ట్రీ పెద్దలు కూడా రాజమౌళిపై గుర్రుగా ఉన్నారు. రాజమౌళి ఎంతసేపు తన సినిమా, కలెక్షన్లు, లాభాల గురించి ఆలోచిస్తున్నారు తప్పితే ఇండస్ట్రీ మంచి కోసం, ఇతర ఇండస్ట్రీ వ్యక్తుల కోసం ఆలోచించడం లేదని ఫైర్ అవుతున్నట్లు సమాచారం. రామ్ చరణ్ తేజ్, ఎన్టీఆర్ లీడ్ క్యారెక్టర్లలో అలియాభట్, ఒలివియా మోరిస్ వీరికి జోడీగా నటిస్తున్న ట్రిపుల్ ఆర్ ను దాదాపు రూ. 450 కోట్లతో నిర్మించారు ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య.

మరోవైపు బాలీవుడ్ స్టార్ అజమ్ దేవ్ గన్ కీలక పాత్రలో నటిస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా 14 భాషల్లో విడుదల చేద్దాం అని ముందుగా అనుకున్నప్పటికీ.. కరోనా మరోసారి దెబ్బ తీసింది. కరోనా కారణంగా పలు రాష్ట్రాల్లో థియేటర్లు మూతపడ్డాయి. కొన్ని రాష్ట్రాల్లో కేవలం 50 శాతం ఆక్యుపెన్సీతో నడపాల్సిన పరిస్థితి దీంతోొ సినిమాను మరోసారి వాయిదా వేశారు.

సమ్మర్ సీజన్ లో విడుదల చేద్దాం అని..

ఇప్పటికే ట్రిపుల్ ఆర్ సినిమా కోసం పవన్ భీమ్లానాయక్ విడుదల పోస్ట్ పోన్ అయింది. శివరాత్రి కానుకగా విడుదల చేద్దాం అని అనుకుంటున్నారు భీమ్లా నాయక్ టీం. అయితే ప్రస్తుతం వాయిదా పడిన ఆర్ ఆర్ఆర్ సినిమాను సమ్మర్ సీజన్ లో విడుదల చేద్దాం అని అనుకుంటున్నారు. అయితే సమ్మర్ లో రాజమౌళి సినిమా వస్తే మళ్లీ మూవీల షెడ్యూల్ మొత్తం డిస్ట్రబ్ అవుతుందని సినీ ఇండస్ట్రీ అనుకుంటుంది. ఆర్ ఆర్ఆర్ దెబ్బకు పలు మూవీలు వెనక్కి వెళ్లాల్సి వస్తుండటంతో ట్రిపుల్ ఆర్ టీం పై.. మొత్తం సినిమా ఇండస్ట్రీ కొంత అసహనంతో కనిపిస్తుంది. అయితే నార్త్ మాట ఎలా ఉన్నా.. తెలుగు, తమిళం భాషల్లో సంక్రాంతికి విడుదల అవుతుందనుకున్న ఫ్యాన్స్ కు మాత్రం నిరాశే ఎదురైంది. నార్త్ డిస్ట్రిబ్యూటర్లు సినిమా వాయిదా వేసుకోండని చెప్పడంతోనే మూవీ యూనిట్ తలొగ్గిందనే మాటలు కూడా వినిపిస్తున్నాయి.