Jabardasth Pavithra:బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్య క్రమం కొన్ని సంవత్సరాల నుంచి ప్రసారం అవుతూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. అయితే ఈ కార్యక్రమం మొదట్లో కేవలం మగవారు మాత్రమే స్కిట్ లలో పాల్గొనేవారు. ఈ విధంగా జబర్దస్త్ కార్యక్రమం మొదట్లో కొన్ని విమర్శలను ఎదుర్కొన్న ప్రస్తుతం ఎంతో మంది ఈ కార్యక్రమానికి అభిమానులుగా మారిపోయారు.
ఇక ఈ కార్యక్రమం మొదట్లో లేడీ గెటప్స్ లో ఆడవాళ్లు కాకుండా మగవాళ్లే నటించారు. స్కిట్ లలో భాగంగా ఆడవారిపై సెటైర్లు వేయడం కొన్నిసార్లు వారిని కొట్టాల్సిన పరిస్థితులు ఏర్పడటం వల్ల లేనిపోని సమస్యలు వస్తాయని భావించి ఆడవారికి బదులు మగవారే లేడీ గెటప్ లో నటించేవారు.
అయితే రాను రాను జబర్దస్త్ కార్యక్రమంలో లేడీ కమెడియన్స్ తమదైన శైలిలో ఎంట్రి ఇచ్చి అద్భుతమైన కామెడీ ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.ఇలా ఇప్పటికే ఎంతోమంది లేడి కమెడియన్స్ ఈ కార్యక్రమం ద్వారా గుర్తింపు తెచ్చుకున్నారు. వీరిలో కమెడియన్ పవిత్ర కూడా ఒకరు.
పవిత్ర చూడటానికి పొట్టిగా ఉండటం వల్ల చాలా మంది ఈమె హైట్ పై స్కిట్ లు చేసేవారు ముఖ్యంగా రాఘవ టీమ్ లో భాగంగా నాగితో పవిత్ర చేసిన కామెడీ భలే పేలింది. ఈ ఒక్క స్కిట్ మాత్రమే కాదు.ఈ విధంగా ఈమె జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకోవడంతో అసలు ఈమె ఎవరు ఈమె బ్యాక్ గ్రౌండ్ ఏంటని పెద్ద ఎత్తున ఈమె కోసం వెతకడం మొదలు పెట్టారు. అయితే ఈమె టిక్ టాక్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుని పలు ఈటీవీ సీరియల్స్ లో నటించింది.అయితే సీరియల్స్లో ఈమెకు ఎలాంటి గుర్తింపు రాకపోవడంతో మెల్లిగా జబర్దస్త్ కార్యక్రమం వైపు అడుగులు వేస్తూ జబర్దస్త్ ద్వారా ఎంతో గుర్తింపు సంపాదించుకున్న అనంతరం తిరిగి ఈ టీవీలో ప్రసారమయ్యే సీరియల్స్ లో అవకాశం దక్కించుకుంది.ఇలా ఒక వైపు సీరియల్స్ మరోవైపు జబర్దస్త్ ద్వారా ఈమె పెద్ద ఎత్తున అభిమానులను సంపాదించుకుందని చెప్పవచ్చు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…