టాలెంటెడ్ డైరెక్టర్ విక్రం కె కుమార్ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన సినిమా గ్యాంగ్ లీడర్. ఈ సినిమాతో టాలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయమైంది ప్రియాంక అరుళ్ మోహన్. ఫ్యామిలీది తమిళ బ్యాక్‌గ్రౌండ్ అయినా చూడగానే తెలుగమ్మాయిలా మనవాళ్ళకి కనెక్ట్ అయింది. డెబ్యూ సినిమా కన్నడలో చేసి ఆకట్టుకున్న ప్రియాంక తెలుగు డెబ్యూ మూవీతోనూ బాగానే ఆకట్టుకుంది. చాలా పద్దతిగా కనిపించి ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా దగ్గరయింది. అయితే తెలుగు డెబ్యూ సినిమా ప్రియాంకకి హిట్ ఇవ్వలేకపోయింది.
అయినా మరో సినిమాలో అవకాశం అందుకుంది. యంగ్ హీరో శర్వానంద్ సరసన శ్రీకారం సినిమాలో నటించిన ప్రియాంక ఇందులో కాస్త గ్లామర్‌గా కనిపించి ఆకట్టుకుంది. నాభి అందాలను బాగా ప్రదర్శించి ఆహా అనిపించింది. అయితే ఆమె బ్యాడ్‌లక్ తెలుగులో చేసిన రెండవ సినిమా కూడా ఫ్లాప్‌గా మిగిలింది. దాంతో సహజంగానే మనవాళ్ళు హీరోయిన్‌ను ఫ్లాప్ హీరోయిన్‌గా పరిగణిస్తారు. అదే ప్రియాంక అరుళ్ విషయంలోనూ జరిగింది. ఉప్పెన సినిమా బ్లాక్ బస్టర్ అందుకుంది కాబట్టి కృతి శెట్టికి వరుసగా అరడజను సినిమాలలో అవకాశాలు ఇచ్చారు.
ఇప్పుడు టాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉన్న యంగ్ అండ్ అప్‌కమింగ్ హీరోయిన్ అంటే కృతి శెట్టి మాత్రమే. ఆ తర్వాత రేస్‌లో రొమాంటిక్ బ్యూటీ కేతిక శర్మ ఉంది. రొమాంటిక్ సినిమా రిలీజ్ కాకుండానే సుధీర్ బాబు, వైష్ణవ్ తేజ్ సినిమాలలో అవకాశాలు అందుకున్న ఈ బ్యూటీ, ఇటీవల సినిమా రిలీజయ్యాక మరో రెండు మూడు ప్రాజెక్ట్స్‌లో అవకాశాలు వచ్చాయట. కాబట్టి కేతిక శర్మ కూడా టాలీవుడ్‌లో ఓ క్రేజీ హీరోయిన్. అలాగే పెళ్ళి సందడి హీరోయిన్‌కు మంచి అవకాశాలు దక్కుతున్నాయి.
కానీ గ్యాంగ్ లీడర్, శ్రీకారం సినిమాలతో నటిగా మంచి మార్కులు పడ్డా కూడా ప్రియాంకకు కొత్త సినిమా అవకాశం ఏదీ రాలేదు. అయితే అమ్మడు తమిళంలో మాత్రం దుమ్ము లేపుతోంది. టాలీవుడ్‌లో ఫ్లాప్ హీరోయిన్ అని ముద్ర పడినప్పటికీ తమిళంలో మాత్రం 100 కోట్లకు పైగా వసూళ్ళు రాబట్టిన సినిమాతో మంచి క్రేజీ హీరోయిన్‌గా మారింది. యంగ్ హీరో శివ కార్తికేయన్ హీరోగా, నిర్మాతగా వచ్చిన డాక్టర్ సినిమాతో తమిళంలో మంచి స్టార్ డం తెచ్చుకుంది ప్రియాంక. ఇటీవలే దర్శకుడు ఈ సినిమా 100 కోట్ల క్లబ్‌లో చేరిందని హీరో, హీరోయిన్స్‌తో పాటు టెక్నికల్ టీం కు థాంక్స్ చెప్పాడు.
ప్రస్తుతం ప్రియాంక అరుళ్ తమిళంలో మరో రెండు సినిమాలు చేస్తోంది. అందులో ఒకటి స్టార్ హీరో సూర్య సరసన నటించే సినిమా కాగా, మరొకటి శివ కార్తికేయన్ సరసన మళ్ళీ నటించే ఛాన్స్ అందుకుంది. ఈ రెండు సినిమాలు గనక తమిళంలో సూపర్ హిట్ అయితే ఇక ఆమెన్ కోలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరినట్టే అంటున్నారు. ఇక్కడ సత్తా చాటలేకపోయినా ఇకపై తమిళ ఇండస్ట్రీ మీద ఫోకస్ పెడితే చాలు..ప్రియాంక సెటిలైపోతుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…