Featured

రాజశేఖర్ కూతుళ్ళు బాగానే పేరు తెచ్చుకుంటున్నారు.. సపోర్ట్ చేస్తే స్టార్ హీరోయిన్సే..

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో రాజశేఖర్ – జీవిత గురించి అందరికీ తెలిసిందే. ఇద్దరు సినిమా ఇండస్ట్రీలో ఉన్నవారే. హీరోయిన్స్‌గా ఎన్నో సినిమాలు చేసి స్టార్స్‌గా వెలిగిన వారు. రాజశేఖర్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత హీరోయిన్‌గా సినిమాలు మానేసిన జీవిత భర్త రాజశేఖర్ సినిమాలకి సంబంధించిన వ్యవహారాలను చూసుకుంటూ ఆయన వెంటనే ఉంటున్నారు. ఆ తర్వాత సొంత నిర్మాణ సంస్థను స్థాపించి జీవిత – రాజశేఖర్ తమ నిర్మాణంలో సినిమాలు నిర్మిస్తున్నారు.

ఇక జీవిత దర్శకురాలిగానూ సినిమాలు చేశారు. శేషు సినిమాకు ఆమె దర్శకత్వం వహించారు. ఇలా సినిమా తప్ప మరో ఆలోచన వీరికి లేదు. వీరే కాదు ఇప్పుడు వీరి కూతుళ్ళు ఇద్దరు హీరోయిన్స్‌గా ఎంట్రీ ఇచ్చారు. రాజశేఖర్ పిల్లలు హీరోయిన్స్‌గా వస్తున్నారనగానే పాజిటివ్‌గా స్పందించినవారున్నారు. అంతకంటే ఎక్కువగా నెగిటివ్ కామెంట్స్ చేసిన వారూ ఉన్నారు. ఇది సహజం..ఒక ఫ్యామిలీ నుంచి వారి పిల్లలు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుంటే వచ్చే కామెంట్స్ చాలా రకాలుగా ఉంటాయి.  

అలాంటి కామెంట్స్ పట్టించుకుంటే ఇండస్ట్రీలో ఎదగడం చాలా కష్టం. అదే జీవిత – రాజశేఖర్ ఫ్యామిలీ కూడా చేసింది. ఎవరెన్ని మాట్లాడుకున్నా పిల్లలిద్దరికీ ఉన్న అభిరుచిని అర్థం చేసుకొని హీరోయిన్‌గా నటిస్తామంటే ఎంకరేజ్ చేశారు. శివాత్మిక డెబ్యూ సినిమా రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ డెబ్యూ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమానే దొరసాని. ఈ సినిమాతో శివాత్మిక ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. అంతేకాదు అందరి నుంచి మంచి ప్రశంసలను దక్కించుకుంది.

ఈ సినిమా ఏకంగా క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో నటించే అవకాశం అందుకుంది. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మనందం లాంటి అగ్ర నటీ నటులు నటిస్తున్న సినిమా రంగ మార్తాండ. ఈ సినిమాలో శివాత్మిక ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా సూపర్ హిట్ అయితే శివాత్మిక ఇక సెటిల్ అయినట్టే. ఇక ఈ క్రమంలోనే శివాని కూడా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఆమె నటించిన అద్భుతం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ తెచ్చుకుంది.

ఈ సినిమాతో శివాని టాలీవుడ్ ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. ఇంతక ముందు మూడు నాలుగు ప్రాజెక్ట్స్ మొదలవ్వాల్సి ఉండగా మధ్యలోనే అవి ఆగిపోయాయి. దాంతో శివాని ఒక దశలో డిప్రషన్‌లోకి వెళ్ళింది. ఇన్ని స్ట్రగుల్స్ తర్వాత ఇప్పుడు అద్భుతం సినిమాతో హిట్ అందుకుంది. చాలామంది శివాని – శివాత్మిక పర్ఫార్మెన్స్‌ను మెచ్చుకుంటున్నారు. నిజంగా వీరికి అవకాశాలు వస్తే ఖచ్చితంగా స్టార్ హీరోయిన్స్ అవుతారని అభిప్రాయపడుతున్నారు. చూడాలి మరి ఈ ఇద్దరు టాలీవుడ్‌లో ఏ మేరకు సక్సెస్ అవుతారో.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago