తమిళంలో ఎంజీఆర్ పేరు చెబితే ఎంతటి ప్రభంజనమో కొత్తగా చెప్పే అవసరం లేదు. ఆయన సినిమాలు జాతీయస్థాయిలో ఎంతటి పేరు తెచ్చాయో ప్రత్యేకించి చర్చించవలసిన అవసరం లేదు. మామూలు పేద కుటుంబములో జన్మించి సినిమాల్లోకి అడుగు పెట్టిన ఎంజీఆర్ ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఆయన సినిమా రంగంలో అప్రతిహతంగా ఉన్నత శిఖరాలను అధిరోహించారు. ఆయన నటించిన చిత్రాల్లో కూడా పేదవారి కష్టాలను ఎత్తిచూపుతూ సినిమాలు తీసేవారు.
1971 వీరప్పన్ నిర్మాణం, కృష్ణన్ దర్శకత్వంలో “రిక్షాకారన్” చిత్రం విడుదలైంది. ఈ చిత్రంలో ఎం.జి.రామచంద్రన్, పద్మిని, మంజుల హీరో, హీరోయిన్లుగా నటించారు. రిక్షా కార్మికుడి చుట్టూ తిరిగే కథతో వచ్చిన రిక్షాకారన్ బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా నిలిచింది. సినిమా సక్సెస్ కావడంతో హీరో ఎం.జి రామచంద్రన్ రిక్షాకార్మికులు అందరికీ ‘రైన్ కోట్ ‘ఇవ్వడం జరిగింది. తమిళంలో రిక్షా కార్మికుడు పై తీసిన మొదటి చిత్రంగా ఎంజీఆర్ నటించిన ‘రిక్షాకారణన్’ పేర్కొనవచ్చు. తెలుగులో దాదాపు 70 పైచిలుకు చిత్రాలకు ప్రొడక్షన్ మేనేజర్ గా పనిచేసిన సత్యనారాయణరాజు, కృష్ణతో సినిమా రూపొందించాలనుకున్నారు.
ఆ క్రమంలో కృష్ణ అంగీకారంతో తమిళంలో ఎంజీఆర్ నటించిన రిక్షాకారన్ చిత్రాన్ని తెలుగులో నిర్మించాలని ప్రయత్నించారు. ఆ సినిమాకి సంబంధించిన రచన బాధ్యతను త్రిపురనేని మహారధి కుమారుడు త్రిపురనేని చిట్టికి ఇవ్వడం జరిగింది. 1989లో అధికారంలో ఉన్న ఆనాటి తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు పై వ్యంగ్య చిత్రంగా ఈ చిత్రాన్ని రూపొందించాలనుకున్నారు. అలా ఆ రచయిత అందించిన కథను తీసుకొని హీరో కృష్ణ “రిక్షావాలా” చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. కృష్ణ స్వయంగా రాజకీయాల్లోకి దిగడంతో ఈ సినిమా కాస్త ప్రజల్లో ఆసక్తి నెలకొంది.
1989 సత్యనారాయణరాజు నిర్మాణం, కృష్ణ దర్శకత్వంలో రిక్షావాలా చిత్రం విడుదలైంది. ఈ సినిమాలో కృష్ణ, రాధ హీరో, హీరోయిన్లుగా నటించారు. ఇది సూపర్ స్టార్ కృష్ణకు 274 వ చిత్రం. ఈ సినిమాలో అందరిచే ‘అన్నా’ అని పిలిపించుకునే కళింగపట్నం భుజంగరాయుడు పాత్రలో ప్రముఖ నటుడు రంగనాథ్ నటించారు. 1989 నవంబర్ లో రిక్షావాలా చిత్రాన్ని విడుదల చేద్దామనుకున్నారు. కానీ హీరో కృష్ణ ఏలూరు నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో దిగుతుండడంతో సినిమా విడుదలను డిసెంబర్ కు వాయిదా వేశారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొని తిరిగి వచ్చి సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకొని డిసెంబర్ లో రిక్షావాలా చిత్రాన్ని విడుదల చేశారు.
కృష్ణ ఎన్నికల్లో విజయం సాధించడంతో పాటు సినిమా కూడా విజయవంతమవడం గమనార్హం. ఎన్టీ రామారావు హయాంలో నా పిలుపే ప్రభంజనం, గండికోట రహస్యం, మండలాధీశుడు, సాహసమే నా ఊపిరి, కలియుగ విశ్వామిత్ర లాంటి చిత్రాలు.. ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా విసిరిన రాజకీయ వ్యంగ్యాస్త్రాలుగా పేర్కొనవచ్చు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…