Categories: FeaturedMovie News

గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్న ఆహుతి ప్రసాద్ కోట్లు ఎలా పోగొట్టున్నాడో తెలుసా..?

గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్న ఆహుతి ప్రసాద్ కోట్లు ఎలా పోగొట్టున్నాడో తెలిస్తే షాకవుతారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, మంచి కమెడియన్‌గా పాపులారిటీని సంపాదించుకొని 300 పైగా సూపర్ హిట్ సినిమాల్లో నటించారు ఆహుతి ప్రసాద్. సినిమా ఇండస్ట్రీ మీద ఆసక్తితో మధు ఫిల్మ్ ఇన్సిట్యూట్‌లో యాక్టింగ్ కోర్స్ నేర్చుకున్న ఆయన విక్రమ్ సినిమాతో నటుడిగా ఇండస్ట్రీకి   పరిచయమయ్యాడు. ఆ తర్వాత కొన్ని సినిమాలు సీరియల్స్‌లో నటించాడు. వీటితో రాని గుర్తింపు రాజశేఖర్ హీరోగా నటించిన ఆహుతి సినిమాతో వచ్చింది.

దాంతో అప్పటి నుంచి ఆహుతి ప్రసాద్‌గా సినిమా ఇండస్ట్రీలో పాపులర్ అయ్యాడు. ఆయనకు కెరీర్ ప్రారంభంలో ఎక్కువగా వచ్చింది పోలీస్, రాజకీయ నాయకుడి పాత్రలే. ఆ పాత్రలోనూ ఎక్కువగా నెగిటివ్ రోల్స్ చేసే అవకాశాలు దక్కాయి. వచ్చిన ప్రతీ పాత్రలో మంచి విలనిజాన్ని ప్రదర్శించి క్రేజ్ పెంచుకుంటూ వచ్చారు. నటుడిగా అవకాశాలు రాకముందు కొన్నాళ్ళు ఆయన యాక్టింగ్ నేర్చుకున్న మధు ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ నిర్వాహ బాధ్యతలు నిర్వహించారు. అంతేకాదు ప్రముఖ నిర్మాణ సంస్థ ఉషా కిరణ్ మూవీస్ నిర్మించిన మల్లె మొగ్గలు సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు.

ఇలా సినిమా ఇండస్ట్రీలో ఉంటూ అందివచ్చిన అవకాశాన్ని చేసుకుంటూ సినిమాలో నటుడిగా అవకాశం అందుకున్నారు. నటన పరంగా చేసిన పాత్రతో మెప్పిస్తూ దర్శక నిర్మాతల దృష్ఠిని బాగా ఆకట్టుకున్నారు. ఈ క్రమంలో ఏమాత్రం ఖాళీ లేకుండా సినిమాలు చేసే అవకాశాలు దక్కించుకున్నారు. అలా వచ్చిన అవకాశాలతోనే మంచి రెమ్యునరేషన్ అందుకున్నారు. ఇలా వచ్చిన అవకాశం పోలీస్ భార్య సినిమా. ఈ సినిమాలో ఆహుతి ప్రసాద్ నటనకు మంచి పేరొచ్చింది. అంతేకాదు ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో నిర్మాతగా మారాలని నిర్ణయించుకున్నారు.

అలా తెలుగులో సూపర్ హిట్ అయిన పోలీస్ భార్య సినిమా రైట్స్ కొని కన్నడలో నిర్మించారు. కన్నడలో కూడా పోలీస్ భార్య సినిమా సూపర్ హిట్ అయింది. దాంతో ఇదే క్రమంలో మరో రెండు సినిమాలను రైట్స్ కొని నిర్మించారు. కానీ ఆ సినిమాలు అట్టర్ ఫ్లాపవడంతో నిర్మాతగా తీవ్ర నష్టాలను చూశారు. ఆ సమయంలో ఆయనకు కొట్లలో నష్టం వాటిల్లింది. అప్పటి నుంచి నిర్మాణ రంగానికి దూరంగా ఉంటూ కేవలం నటన మీదే దృష్టిపెట్టారు. అలా ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించిన ఆహుతి ప్రసాద్ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వం వహించిన చందమామ సినిమాతో కమెడియన్‌గా మారాడు.

ఇది నిజంగా ఆహుతి ప్రసాద్‌కు అద్భుతమైన అవకాశం. కృష్ణవంశీ ఇలాంటి పాత్రను ఆహుతి ప్రసాద్‌తో చేయించాలనుకోవడం కూడా పెద్ద సాహసం. కృష్ణవంశీ డిజైన్ చేసుకున్న క్యారెక్టర్‌ను పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టారు ఆహుతి ప్రసాద్. ఇందులో ఆయన భాష – డైలాగ్స్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. ఈ సినిమా నుంచి విలన్ రోల్స్ పక్కన పెట్టి పూర్తి స్థాయి కమెడియన్ రోల్స్ చేసేందుకు ఆసక్తి చూపించి ఆ పాత్రల్లోనూ సక్సెస్ అయ్యారు. మాడ్యులేషన్ ఏదైనా తన బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టుగా పర్ఫార్మ్ చేసి మంచి సక్సెస్, పేరు తెచ్చుకున్నారు ఆహుతి ప్రసాద్. నిర్మాతగా గనక సినిమాలు చేయకపోయి ఉంటే మరిన్ని మంచి సినిమాలతో సక్సెస్ చూసేవారు. ఒకదశలో ఆయనను కుదిపేసింది సినిమా నిర్మాణమే. కానీ, త్వరగా అందులో నుంచి బయటడం మనోవేదనకు గురి కాకుండా నటన మీద ఆసక్తి పెట్టడం గొప్ప విషయం.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

6 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago