Featured

మేకోవర్ మార్చేస్తున్న హీరోలు.. కథ డిమాండ్ చేస్తే అలా నటించడానికి కూడా రెడీ..

సినిమా పెట్టుబడి అనేది..కథ మీద దర్శకుడి మీద కంటే హీరో మార్కెట్ మీదే ఇప్పుడు ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. గతంలో కథకు ఏం కావాలో అది చేసే వారు దర్శక నిర్మాతలు. ఆ తర్వాత ట్రెండ్ మారింది. హీరో ఎలాంటి కథ అయితే ఒప్పుకుంటాడో.. జనాలు, అభిమానులు ఎలాంటి కథల్లో అయితే చూడాలనుకుంటున్నారో అలాంటి కథలను దర్శక రచయితలు అల్లేస్తున్నారు. శత చిత్ర దర్శకుడు కోడి రామకృష అన్నట్టుగా సినిమాలో గ్రాఫిక్స్ ఉండాలి గానీ గ్రాఫిక్స్ కోసమే సినిమా చేయకూడదు. కానీ ఇప్పుడు అదే జరుగుతోంది.

ఒక సాధారణ కథకు కూడా అనవసరమైన గ్రాఫిక్స్ జోడించి సినిమా బడ్జెట్ పెంచేసి.. చివరికి అది ప్రేక్షకులను నచ్చక నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ రోడ్డున పడే పరిస్థితులు వస్తున్నాయి. రాజమౌళి ఓ నార్మల్ కథను హై టెక్నాలజీ, వీఎఫెక్స్ జోడించి హాలీవుడ్ సినిమాగా మార్చేస్తున్నారు. దానికోసం ఆయన పెట్టించే బడ్జెట్ ఎప్పటికప్పుడు ఔరా అనిపిస్తూనే ఉంది. ఇక క్రియేటివ్ జీనియస్ శంకర్ ఒక సాంగ్ కోసమే కొన్ని సార్లు 20 నుంచి 30 కోట్లు ఖర్చు చేయిస్తున్నారు. గ్రాండ్‌నెస్ ఉంటుంది కాని అది ఎంత సేపు.

ఓ 4 నిముషాల పాట కోసం అన్ని కోట్ల బడ్జెట్ అంటే ఏదైనా సినిమా రిజల్ట్ తేడా జరిగితే నష్ఠపోయేది నిర్మాతే. సుకుమార్ లాంటి వారు గతకొంతకాలంగా మట్టి వాసన అనిపించే కథలను తెర మీద ఆవిష్కరిస్తున్నారు. మంచి విజయాలను అందుకుంటున్నారు. స్టైలిష్ డైరెక్టర్‌గా పేరున్న సుకుమార్ నుంచి రంగస్థలం లాంటి కల్ట్ కంటెంట్ ఉన్న సినిమా వస్తుందని ఎవరూ ఊహించరు. పైగా హీరోకు చెవుడు. అది కూడా మెగా పవర్ స్టార్ రాం చరణ్ లాంటి స్టార్ అంటే అది ఎంతపెద్ద సాహసమో అర్థం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ కథను నమ్మి సుకుమార్, చరణ్, నిర్మాతలు రంగస్థలం సినిమా చేశారు.

ఈ సినిమా చూస్తున్నంతసేపు ఓ 30 – 40 ఏళ్ళ వెనక్కి తీసుకు వెళ్ళింది. ఇలాంటి కథలతో ప్రయోగం చేసినా బావుంటుంది. 30 ఎకరాలలో విలేజ్ సెట్ వేసి షూటింగ్ జరిపినా అది అంతగా ఎవరికీ తెలియలేదు. ఇప్పుడు రాబోతున్న పుష్ప కూడా ఇలాంటి ఓ విలేజ్ బ్యాక్‌డ్రాప్ కథనే. ఈ సినిమాలో అల్లు అర్జున్, రష్మిక మందన్నల గెటప్స్ చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామా అని ఆసక్తి విపరీతంగా పెరుగుతోంది. ఈ సినిమాను పాన్ ఇండియన్ స్థాయిలో 5 భాషలలో రిలీజ్ చేస్తున్నారు. ఇలాంటి కథలకు గ్రాఫిక్స్ మీద ఆధారపడి చేయాల్సిన అవసరం ఉండదు. కేవలం హీరో మేకోవర్.. డైరెక్టర్ మేకింగ్ మీద సినిమా అంచనాలు పెరుగుతాయి. అందుకే మన స్టార్ హీరోలు కష్టమైనా మేకోవర్ కోసం బాగా కష్టపడుతున్నారు.      

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

“ఇరాన్ అణు కార్యక్రమంపై ఒత్తిడి పెంచుతాం.. అవసరమైతే పరిమిత దాడి: ట్రంప్ హెచ్చరిక”

ఇరాన్ అణు కార్యక్రమం అంశంపై అమెరికా మరోసారి కఠిన స్వరాన్ని వినిపించింది. అమెరికా అధ్యక్షుడు Donald Trump తాజాగా చేసిన…

37 minutes ago

“ఒంటరిగా ఉన్నాననే కారణంగా టార్గెట్ చేస్తున్నారు.. కర్మ వదలదు: హీరోయిన్ మీనా భావోద్వేగ వ్యాఖ్యలు”

దక్షిణాదిలో ఒక కాలంలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన నటీమణుల్లో Meena ప్రత్యేక స్థానం సంపాదించారు. చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగుపెట్టి,…

46 minutes ago

“బట్టతలకు బై బై చెప్పే స్మార్ట్ క్యాప్!.. మందులు, సర్జరీ లేకుండానే జుట్టు పెరుగుదల?”

జుట్టు రాలడం ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న సమస్యగా మారింది. యువత నుంచి మధ్యవయసు వారిదాకా…

1 hour ago

“వీధి కుక్కల బెడద పెరుగుతోంది.. ఉమ్మడి మెదక్‌లో వరుస దాడులతో ప్రజల్లో భయం!”

ఉమ్మడి మెదక్ జిల్లాలో వీధి కుక్కల సమస్య రోజురోజుకీ తీవ్రమవుతోంది. చిన్నారులు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా వరుసగా…

1 hour ago

ఆపరేషన్ చేసి కడుపులో కత్తెర మరిచిపోయిన డాక్టర్లు ! ఐదేళ్లుగా నరకయాతన అనుభవిస్తున్న మహిళ !

ఆస్పత్రి అంటే రోగి ప్రాణాలు కాపాడే స్థలం. కానీ కొన్నిసార్లు అక్కడే జరిగిన నిర్లక్ష్యం బాధితులకు జీవితాంతం మానని గాయాలు…

1 hour ago

విశాఖ సాగరతీరంలో నావికాదళ శక్తి ప్రదర్శన.. బీటింగ్ సెర్మనీతో అబ్బురం!

విశాఖ సాగరతీరంలో ఆదివారం జరిగిన నావికాదళ ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. RK Beach వేదికగా నిర్వహించిన ‘ఆపరేషనల్ డెమో’…

2 hours ago