భారతదేశాన్ని కరోనా సెకండ్ వేవ్ తీవ్ర భయానికి గురి చేస్తోంది. సెకండ్ వేవ్ వైరస్ విస్తృతంగా వ్యాపించడంతో రోజుకు 3 లక్షల సంఖ్యలో పాజిటివ్ కేసులు నిర్ధారణ అవుతున్నాయి. అయితే కరోనా కేసులు ఈ విధంగా పెరగడానికి కారణమైన ఆ డేంజరస్ వేరియంట్ బి.1.617 మూలాలపై ఇప్పుడు పరిశోధనలు జరుగుతున్నాయి. ఇంతటి భయంకరమైన వేరియంట్ మహారాష్ట్రలోని అమరావతిలో పుట్టిందని పలు థియరీలు చెబుతున్నాయి.
ఈ వేరియంట్ అమరావతిలో పుట్టడం వల్ల అమరావతిలోని చుట్టుపక్కల ప్రాంతాలలో ఫిబ్రవరి నెలలోనే అధిక పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఈ థియరీ భావిస్తోంది. ఇండియాలో ఏర్పడిన ఈ వేరియంట్ ఇతర దేశాలయినా బ్రిటన్, సౌతాఫ్రికా, బ్రెజిల్ వేరియంట్లకు పూర్తి భిన్నంగా ఉందని డాక్టర్ నితిన్ షిండే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వేరియంట్ పై ఇప్పటివరకు పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయని ఇప్పుడే దీనిపై ఒక అవగాహనకు రాలేమని షిండే తెలిపారు.
ఈ బి.1.617 వేరియంట్‌నే డబుల్ మ్యుటెంట్‌గా పిలుస్తున్నారు. ఇందులో గమనించాల్సిన మ్యుటేషన్లు ఇ484క్యూ, ఎల్425ఆర్ ఈ మ్యుటెంట్ లు వైరస్ వేగంగా వ్యాపించడానికి దోహదపడుతున్నాయని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సీనియర్ డాక్టర్ అపర్ణ ముఖర్జీ తెలియజేశారు. ఈ సెకండ్ వేవ్ ప్రారంభం కావడానికి ముందే ఈ వేరియంట్ కనుగొన్నారని, ఈ సెకండ్ వేవ్ స్థాయిలో విజృంభించడానికి కారణం ఈ
మ్యుటెంట్ ప్రధాన కారణమని చెప్పలేమని ఆమె తెలిపారు.
గతంలో కంటే ప్రస్తుతం వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందడం వల్లే రోజురోజుకు ఈ స్థాయిలో కేసులు పెరుగుతున్నాయని నిపుణులు భావిస్తున్నారు. అయితే ఇంత భయంకరమైన వేరియంట్ పై కూడా భారత బయోటెక్ కి చెందిన కొవాగ్జిన్ ఎంతో సమర్ధవంతంగా పని చేయడంతో అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…