భారతదేశాన్ని కరోనా సెకండ్ వేవ్ తీవ్ర భయానికి గురి చేస్తోంది. సెకండ్ వేవ్ వైరస్ విస్తృతంగా వ్యాపించడంతో రోజుకు 3 లక్షల సంఖ్యలో పాజిటివ్ కేసులు నిర్ధారణ అవుతున్నాయి. అయితే కరోనా కేసులు ఈ విధంగా పెరగడానికి కారణమైన ఆ డేంజరస్ వేరియంట్ బి.1.617 మూలాల‌పై ఇప్పుడు ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతున్నాయి. ఇంతటి భయంకరమైన వేరియంట్ మహారాష్ట్రలోని అమరావతిలో పుట్టిందని పలు థియరీలు చెబుతున్నాయి.

ఈ వేరియంట్ అమరావతిలో పుట్టడం వల్ల అమరావతిలోని చుట్టుపక్కల ప్రాంతాలలో ఫిబ్రవరి నెలలోనే అధిక పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఈ థియరీ భావిస్తోంది. ఇండియాలో ఏర్పడిన ఈ వేరియంట్ ఇతర దేశాలయినా బ్రిట‌న్‌, సౌతాఫ్రికా, బ్రెజిల్ వేరియంట్ల‌కు పూర్తి భిన్నంగా ఉందని డాక్టర్ నితిన్ షిండే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వేరియంట్ పై ఇప్పటివరకు పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయని ఇప్పుడే దీనిపై ఒక అవగాహనకు రాలేమని షిండే తెలిపారు.

ఈ బి.1.617 వేరియంట్‌నే డ‌బుల్ మ్యుటెంట్‌గా పిలుస్తున్నారు. ఇందులో గ‌మ‌నించాల్సిన మ్యుటేష‌న్లు ఇ484క్యూ, ఎల్‌425ఆర్ ఈ మ్యుటెంట్‌ లు వైరస్ వేగంగా వ్యాపించడానికి దోహదపడుతున్నాయని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సీనియర్ డాక్టర్ అపర్ణ ముఖర్జీ తెలియజేశారు. ఈ సెకండ్ వేవ్ ప్రారంభం కావడానికి ముందే ఈ వేరియంట్ కనుగొన్నారని, ఈ సెకండ్ వేవ్ స్థాయిలో విజృంభించడానికి కారణం ఈ
మ్యుటెంట్‌ ప్రధాన కారణమని చెప్పలేమని ఆమె తెలిపారు.

గతంలో కంటే ప్రస్తుతం వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందడం వల్లే రోజురోజుకు ఈ స్థాయిలో కేసులు పెరుగుతున్నాయని నిపుణులు భావిస్తున్నారు. అయితే ఇంత భయంకరమైన వేరియంట్ పై కూడా భారత బయోటెక్ కి చెందిన కొవాగ్జిన్ ఎంతో సమర్ధవంతంగా పని చేయడంతో అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here