Categories: FeaturedMovie News

భానుమతి లాంటి లెజండరీ నటీమణితో నటించే అదృష్ఠం దొరకడం ఆ హీరోలకే దక్కింది.

కొందరు లెజండరీ నటీ నటులతో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం కోసం స్టార్ హీరో, హీరోయిన్స్ ఎంతో ఆతృతగా ఏళ్ళ తరబడి ఎదురుచూస్తుంటారు. కానీ ఆ అదృష్ఠం అందరికీ దక్కదు. ఇప్పుడున్న చాలామంది నటీ నటులు మెగాస్టార్ చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకోవాలని చాలా తాపత్రయ పడుతున్నారు. వారే కాదు యువ దర్శకులు ఇతర టెక్నీషియన్స్ చాలా ఏళ్ళుగా ఎదురు చూస్తూనే ఉన్నారు. అందుకు తగ్గట్టుగానే చాలావరకు చిరు వారి చిరు కోరికను తీర్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇప్పటికే ఆయన ఫ్లాప్ దర్శకుడిగా ముద్రపడిన మెహర్ రమేశ్‌కు గొప్ప అవకాశం ఇచ్చారు. బాబీ లాంటి యంగ్ డైరెక్టర్‌కు అవకాశం ఇచ్చి ఎంకరేజ్ చేస్తున్నారు. దీంతో మారుతి లాంటి మరికొంతమంది చిరును డైరెక్ట్ చేయాలని కథలు సిద్దం చేసుకొని ఎదురుచూస్తున్నారు. ఇక నటీ నటుల విషయానికొస్తే కీర్తి సురేశ్ లాంటి యంగ్ హీరోయిన్‌కు సినిమాలో అవకాశం ఇచ్చారు. బిగ్ బాస్ బ్యూటీ దివికి చిరు చిన్న ఛాన్స్ ఇచ్చి సర్‌ప్రైజ్ చేశారు. అలాగే సత్యదేవ్ లాంటి టాలెంటెడ్ నటుడుకి ఆయన అవకాశం ఇచ్చి భుజం తట్టారు.

అయితే భానుమతి రామకృష్ణ లాంటి అగ్ర నటీమణి సినిమాలో అవకాశం అంటే ఎవరికైనా జీవితంలో ఓ పెద్ద కల నిజమైనట్టే. నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా, రచయితగా  గొప్పతనాన్ని చాటుకున్న భానుమతి గారు అంత సులభంగా ఎవరి సినిమాను చేసేందుకు ఒప్పుకోరు. ఆవిడకి కథ బాగా నచ్చాలి. అందులో ఆవిడ పోషించే పాత్ర చాలా హుందాతనంతో ఉండాలి. అయినా ఒప్పుకుంటారనే నమ్మకం లేదు. అలా ఒప్పించడానికి పట్టుపట్టిన దర్శకులే కోడి రామకృష్ణ, రాజశేఖర్, ఏ.ఎం.రత్నం లాంటి వారు.

బాలకృష్ణ హీరోగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో మంగమ్మగారి మనవడు సినిమా వచ్చింది. ఈ సినిమాలో బాలయ్య బామ్మగారి పాత్రలో భానుమతి గారు నటించారు. ఈ సినిమాలో ఆమె పాత్ర ముందు నచ్చలేదు. దర్శకుడితో ససేమిరా అన్నారు. కొన్ని సీన్స్, డైలాగ్స్ కూడా అభ్యంతరం చెప్పారు. కానీ మీ పాత్రకు ఇలాంటి రెస్పాన్స్ వస్తుందని షూటింగ్ సమయంలో ఓ చిన్న సీన్ తీసి ఉదాహరణ చూపించడంతో భానుమతి గారు ఒప్పుకున్నారు. అలా వచ్చిన మంగమ్మగారి మనవడు సినిమా పెద్ద హిట్ సాధించింది.

ఇక రాజేంద్రప్రసాద్ హీరోగా నటించిన బామ్మమాట బంగారు బాట సినిమాలోనూ బామ్మ పాత్రలో అద్భుతంగా నటించారు భానుమతి. ఆవిడ పాత్రే సినిమాకు హైలెట్‌గా నిలుస్తుంది. గౌతమి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో సీనియర్ నటులు నూతన్ ప్రసాద్ భానుమతి భర్త పాత్రను పోషించారు. రాజశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా  షూటింగ్  సమయంలోనే ఆయనకు యాక్సిడెంట్ జరిగి రెండు కాళ్ళు పోయాయి. ఏదేమైనా అప్పట్లో ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. ఇక కెరీర్ ప్రారంభంలో ఫ్లాపులొచ్చిన జగపతి బాబు భానుమతి గారితో నటించే అవకాశం అందుకున్నారు.    

పెద్దరికం సినిమాలో జగపతి బాబు – సుకన్య జంటగా నటించారు. ప్రముఖ నిర్మాత ఏ.ఎం.రత్నం ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇందులో చాలా హుందాతనమైన పాత్రలో భానుమతి గారు నటించారు. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ సాధించిందో అందరికీ తెలిసిందే. ఇలా చాలా అరుదుగా భానుమతి గారు నటించగా బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన సినిమాలలో ఆవిడతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు బాలకృష్ణ, రాజేంద్రప్రసాద్, జగపతి బాబు నటించే గొప్ప అవకాశాన్ని అందుకున్నారు.  

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

5 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago