కొందరు లెజండరీ నటీ నటులతో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం కోసం స్టార్ హీరో, హీరోయిన్స్ ఎంతో ఆతృతగా ఏళ్ళ తరబడి ఎదురుచూస్తుంటారు. కానీ ఆ అదృష్ఠం అందరికీ దక్కదు. ఇప్పుడున్న చాలామంది నటీ నటులు మెగాస్టార్ చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకోవాలని చాలా తాపత్రయ పడుతున్నారు. వారే కాదు యువ దర్శకులు ఇతర టెక్నీషియన్స్ చాలా ఏళ్ళుగా ఎదురు చూస్తూనే ఉన్నారు. అందుకు తగ్గట్టుగానే చాలావరకు చిరు వారి చిరు కోరికను తీర్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇప్పటికే ఆయన ఫ్లాప్ దర్శకుడిగా ముద్రపడిన మెహర్ రమేశ్‌కు గొప్ప అవకాశం ఇచ్చారు. బాబీ లాంటి యంగ్ డైరెక్టర్‌కు అవకాశం ఇచ్చి ఎంకరేజ్ చేస్తున్నారు. దీంతో మారుతి లాంటి మరికొంతమంది చిరును డైరెక్ట్ చేయాలని కథలు సిద్దం చేసుకొని ఎదురుచూస్తున్నారు. ఇక నటీ నటుల విషయానికొస్తే కీర్తి సురేశ్ లాంటి యంగ్ హీరోయిన్‌కు సినిమాలో అవకాశం ఇచ్చారు. బిగ్ బాస్ బ్యూటీ దివికి చిరు చిన్న ఛాన్స్ ఇచ్చి సర్‌ప్రైజ్ చేశారు. అలాగే సత్యదేవ్ లాంటి టాలెంటెడ్ నటుడుకి ఆయన అవకాశం ఇచ్చి భుజం తట్టారు.

అయితే భానుమతి రామకృష్ణ లాంటి అగ్ర నటీమణి సినిమాలో అవకాశం అంటే ఎవరికైనా జీవితంలో ఓ పెద్ద కల నిజమైనట్టే. నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా, రచయితగా గొప్పతనాన్ని చాటుకున్న భానుమతి గారు అంత సులభంగా ఎవరి సినిమాను చేసేందుకు ఒప్పుకోరు. ఆవిడకి కథ బాగా నచ్చాలి. అందులో ఆవిడ పోషించే పాత్ర చాలా హుందాతనంతో ఉండాలి. అయినా ఒప్పుకుంటారనే నమ్మకం లేదు. అలా ఒప్పించడానికి పట్టుపట్టిన దర్శకులే కోడి రామకృష్ణ, రాజశేఖర్, ఏ.ఎం.రత్నం లాంటి వారు.

బాలకృష్ణ హీరోగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో మంగమ్మగారి మనవడు సినిమా వచ్చింది. ఈ సినిమాలో బాలయ్య బామ్మగారి పాత్రలో భానుమతి గారు నటించారు. ఈ సినిమాలో ఆమె పాత్ర ముందు నచ్చలేదు. దర్శకుడితో ససేమిరా అన్నారు. కొన్ని సీన్స్, డైలాగ్స్ కూడా అభ్యంతరం చెప్పారు. కానీ మీ పాత్రకు ఇలాంటి రెస్పాన్స్ వస్తుందని షూటింగ్ సమయంలో ఓ చిన్న సీన్ తీసి ఉదాహరణ చూపించడంతో భానుమతి గారు ఒప్పుకున్నారు. అలా వచ్చిన మంగమ్మగారి మనవడు సినిమా పెద్ద హిట్ సాధించింది.

ఇక రాజేంద్రప్రసాద్ హీరోగా నటించిన బామ్మమాట బంగారు బాట సినిమాలోనూ బామ్మ పాత్రలో అద్భుతంగా నటించారు భానుమతి. ఆవిడ పాత్రే సినిమాకు హైలెట్‌గా నిలుస్తుంది. గౌతమి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో సీనియర్ నటులు నూతన్ ప్రసాద్ భానుమతి భర్త పాత్రను పోషించారు. రాజశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఆయనకు యాక్సిడెంట్ జరిగి రెండు కాళ్ళు పోయాయి. ఏదేమైనా అప్పట్లో ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. ఇక కెరీర్ ప్రారంభంలో ఫ్లాపులొచ్చిన జగపతి బాబు భానుమతి గారితో నటించే అవకాశం అందుకున్నారు.

పెద్దరికం సినిమాలో జగపతి బాబు – సుకన్య జంటగా నటించారు. ప్రముఖ నిర్మాత ఏ.ఎం.రత్నం ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇందులో చాలా హుందాతనమైన పాత్రలో భానుమతి గారు నటించారు. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ సాధించిందో అందరికీ తెలిసిందే. ఇలా చాలా అరుదుగా భానుమతి గారు నటించగా బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన సినిమాలలో ఆవిడతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు బాలకృష్ణ, రాజేంద్రప్రసాద్, జగపతి బాబు నటించే గొప్ప అవకాశాన్ని అందుకున్నారు.































