Featured

అర్జున్ రెడ్డి సినిమాను మించిన బోల్డ్ అటెంప్ట్.. ఈ చిత్రంలో భానుచందర్ ఏకంగా నగ్నంగా ‌నటించారు.!!

సినీ పరిశ్రమలో కొన్ని పాత్రలు చేయాలంటే నవరసాలు పండించే నటనా వైదుష్యం ఉండాలి. లేదా సమాజంలో జరిగే అంశాలపైన వ్యక్తులపైన అవగాహన ఉండాలి. అలా వెండితెరపై పాత్ర ఏదైనా అవలీలగా నటించే సామర్థ్యం వస్తుంది. వీటితోపాటు ఇంకొన్ని పాత్రలు చేయాలంటే నటన ఒక్కటే కాదు అంతకు మించిన మానసిక ధైర్యం, దమ్ము ఉండాలి. ఇది ఒక బోల్డ్ అటెంప్ట్. బాలుమహేంద్ర చెప్పిన కథ, ముఖ్యంగా అశ్లీలతకు అవకాశం లేకుండా సహజత్వానికి అద్దం పట్టే బాలు మహేంద్ర దర్శకత్వం నచ్చి భానుచందర్ నిరీక్షణ సినిమా చేయడానికి ఒప్పుకున్నారు.

అదేవిధంగా బాలు మహేంద్ర కూడా భానుచందర్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఎలాంటి అసభ్యతకు అవకాశం లేకుండా నిరీక్షణ చిత్రాన్ని తీసి ఘన విజయాన్ని అందించాడు. మాసినగడ్డం, చిరిగిపోయిన దుస్తులతో జైలు నుంచి విడుదలైన ఓ యువకుడు… ఓ పాఠశాల నుంచి ఎక్స్ కరెక్షన్ వెళ్తున్న బస్సు ఆగడంతో అందులో ఎక్కి స్తబ్దుగా ఓ సీటులో కూర్చుంటాడు. అలా నిశ్శబ్దంగా కూర్చున్న భానుచందర్ ని అదే బస్సులో ఉన్న ఫాదర్ ఆయన ఎవరని ‌ఆరాతీయగా.. తాను ఇప్పుడే జైలు నుంచి వస్తున్నానని.. గతంలో నేను ఓ అటవీశాఖ అధికారినని, ప్రభుత్వ బదిలీ రీత్యా తాను విశాఖపట్నం అరుణగిరికి బదిలీ అయ్యానని చెప్తాడు.

(భానుచందర్) గిరిజన తండాకు వచ్చి గిరిజన మహిళతో చనువుగా ఉంటాడు… కొన్నిరోజులకు ఆ ఇద్దరూ పీకల్లోతు ప్రేమలోకి పడిపోతారు. వారిద్దరి పెళ్లికి తన స్నేహితుడైన మూర్తిని కలిసి పెళ్లి విషయం చెప్పాలని భానుచందర్ స్నేహితుని దగ్గరకు వెళతాడు. ఆ క్రమంలో.. చెయ్యని నేరానికి పోలీస్ చేతుల్లో చిక్కుకొని జైలుకు వెళితే అతని రాకకోసం ఎదురు చూసే పాత్రలో అర్చన నటన అందరి చేత శెభాష్ అనిపించుకుంది. పోలీస్ లతో.. మీరు అనుకునే వ్యక్తిని నేను కాదని మీరు నన్ను తప్పుగా అరెస్టు చేశారని భానుచందర్ చెప్పినా వినకుండా జైలుకి పంపిస్తారు. అక్కడ మురళీకృష్ణ(భానుచందర్) అత్యంత క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కోవడమే కాకుండా జైలు అధికారులచే.. నానా హింసలు అనుభవిస్తాడు.

ఈ చిత్రంలో ఓ సన్నివేశంలో జైలర్ మేకల్లాగ అలా నిలబడతారే ఏంట్రా… బట్టలు విప్పి అలా నిలబడండి అనడంతో ఖైదీలు బట్టలు విప్పి నిల్చుంటారు. దర్శకుడు బాలు మహేంద్ర నిజజీవితంలో ఇలానే ఉంటుంది. మీరు ఈ సన్నివేశంలో నటిస్తారా అనడంతో భానుచందర్ అందుకు అంగీకరించారు. అప్పుడు నగ్నంగా నిల్చున్న భానుచందర్ ని కెమెరాను ఆయనకు వెనుకనుంచి బాలుమహేంద్ర చిత్రీకరించడం జరిగింది. జాకెట్ వేసుకోకుండా అర్చన అర్థ నగ్నంగా నటిస్తే, ఒంటిపై నూలు పోగులేకుండా భానుచందర్ నటించారు. నటనకు ఆస్కారం ఉంటూ.. ఇలాంటి నిజ జీవితానికి దగ్గరగా ఉండే బోల్డు అటెంప్ట్ పాత్రలు ఆ రోజుల్లో భానుచందర్ చేయడం నిజంగా ఆయనను మెచ్చుకోకుండా ఉండలేం. ఈ సినీమాలో అర్చన నటనకు నంది అవార్డు, భానుచందర్ నటనకి ఫిలింఫేర్ అవార్డులు రావడం జరిగింది.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago