బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే షో జబర్దస్త్. మొదట జబర్దస్త్ గా మొదలైన ఈ షో.. ఎక్స్ ట్రా జబర్దస్త్ గా కూడా మొదలైంది. వారంలో రెండు రోజులు ప్రేక్షకులకు పండగ వాతావరణమే అని చెప్పొచ్చు. ఈ షోలకు వచ్చే రేటింగ్స్ ఎప్పుడూ టాప్ లో ఉంటాయి. అయితే జబర్దస్త్ లో రోజా జడ్జిగా మొదటి నుంచి చూస్తూనే ఉన్నాం.
మధ్యలో రోజా బిజీగా ఉండటంతో హీరోయిన్ ఇంద్రజ జడ్జిగా వ్యవహిరించిన విషయం తెలిసిందే. తర్వాత మళ్లీ రోజా జడ్జిగా వ్యవహరించారు. తాజాగా ఈ వారం మరోసారి రోజా జడ్జి స్థానంలో కనిపించలేదు. ఆమె స్థానంలో మరోసారి ఇంద్రజ కనిపించారు. దీని వెనుక కారణాలు ఏంటో తెలుసుకుందాం. రోజా ఆంధ్రప్రదేశ్ లోని నగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన విషయం తెలిసిందే.
అటు రాజకీయాలను చూసుకుంటూ.. ఇటు జబర్దస్త్ షోలను బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళ్తోంది. అయితే ఆమెపై అంతక ముందు విమర్శలు కూడా వచ్చాయి. ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఉంటూ.. ఇలాంటి షోలు చేస్తుండటంపై కొంతమది విమర్శలు చేశారు. దానికి రోజా కూడా సమాధానం చెప్పారు. ఎన్ని అడ్డంకులు వచ్చానా.. ఎన్ని కష్టాలు వచ్చినా.. తనకు లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ ను మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ చెప్పుకొచ్చింది.
బిజీ షెడ్యూల్ లో భాగంగా కొన్ని సందర్భాల్లో షోకి హాజరు కాకపోవచ్చు.. కానీ.. షోని మాత్రం వదిలిపెట్టనంటూ చెప్పింది. ప్రస్తుతం ఈమె రాజకీయంగా బిజీ ఉండటంతో కొన్ని షోల వరకు బ్రేక్ వచ్చిందని.. తర్వాత మళ్లీ జాయిన్ అవుతారనే వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె స్థానంలో ఇంద్రజ కొనసాగుతన్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…