Categories: FeaturedMovie News

ఎస్పీ బాలు ఏ సినిమా లోని పాట పాడలేనని భయపడి పరుగులు తీశారో మీకు తెలుసా.?!

ఈ గాన గంధర్వుడు లేకపోతే భారత సినీ పరిశ్రమలేదు అన్నంతగా ఆయన పాటలు భారతీయ సినీ ప్రేక్షకుల మీద ఉందనడం ఏ మాత్రం అతిశయోక్తి కాదు. దాదాపు 15 భాషల్లో తన గొంతుతో అనేక పాటలు పాడి శ్రోతల అభిమానాన్ని చూరగొన్నారు. నాలుగు భాషల్లో పాడినందుకు జాతీయ స్థాయి పురస్కారాలను అందుకున్న ఏకైక గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం.

శాస్త్రీయ సంగీతం నేర్చుకోకపోయినా శాస్త్రీయ సంగీత రసజ్ఞులను మెప్పించిన మహా గాయకుడు. సినీ రంగంలో నెంబర్ వన్ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం. నెంబర్ వన్ ఏమిటి 1 నుంచి 10 వరకు అన్ని స్థానాల్లో ఎస్పీ బాలునే ఉంటారు. బహుముఖ గాయకుడు ఒక్క ఎస్పీ బాలు అనడంలో సందేహం లేదు. ఎందుకంటే సంగీత దర్శకుడు,నటుడు,నిర్మాత,డబ్బింగ్ ఆర్టిస్ట్ ,కొత్త గాయకులను వెలికితీసే పాడుతా తీయగా హోస్ట్ గా ఇలా ఎన్నో రకాలుగా సినీ కళామతల్లి ఒడిలో ఒదిగిపోయాడు.

ఒక సందర్భంలో డాక్టర్ సి.నారాయణరెడ్డి మాట్లాడుతూ సరాగ హృదయుడు, సరస హృదయుడు, సహృదయుడు స్థితప్రజ్ఞుడు, అద్వితీయుడు అని ఆ మహానుభావుడు కొనియాడడం వెనుక ఎస్పీ.బాలు గానగంధర్వ పటిమ ఎలాంటిదో మనకు అర్థమవుతుంది. మరో సందర్భంలో వేటూరి పాటలకు ఆటలు నేర్పి స్వరాలతో సరసాలాడే సంగీత సాగరం.. అని సంబోధించారు.

నటి గాయని భానుమతి నెల్లూరులో లలిత కళ సమితికి అధ్యక్షురాలుగా కొనసాగుతూ ఉండేది. అదే లలిత కళా సమితి లో ఎస్పీ బాలు పాటలు పాడుతూ ఉండేవారు. ఒకసారి నెల్లూరులో సభకు భానుమతి హాజరు కావవడం జరిగింది. అప్పుడు బాణమతి పరిచయమయ్యారు. అలా మద్రాసులో సాలూరి రాజేశ్వరరావు భానుమతి లను ఒకే చోట ఎస్.పి.బాలు కలిశారు. ఆయన పాట విన్న ఆ ఇద్దరు చూద్దాం అని చెప్పారు.

అలా అవకాశాలు రాక రెండే జతల బట్టలతో సైకిల్ మీద తిరుగుతూ అవకాశాల కోసం ప్రయత్నం చేసేవాడు. ఎస్పీ బాలు ను చూసిన కోదండపాణి ఎవరో ఎందుకు తన దగ్గర అసిస్టెంట్ గా పెట్టుకుంటానని ఎస్పీ. బాలు ని తన దగ్గర ని చేర్చుకున్నాడు. పాటలు పాడడమా.. చదువు కొనసాగించడమా.. అనే సందిగ్ధంలో ఉన్న బాలసుబ్రమణ్యంకి ఇలా అవకాశం వచ్చింది.
పద్మనాభం నిర్మాతగా 1966లో శ్రీ శ్రీ మర్యాద రామన్న సినిమాకి ఎస్.పి.కోదండపాణి సంగీత దర్శకుడిగా ఎన్నుకున్నారు. ఆ సినిమాలో పీబి.శ్రీనివాస్, ఈలపాట రఘురామయ్య, సుశీలతో పాటుగా 4వ చరణం పాడడానికి అవకాశం వచ్చింది. ఆ పాట రికార్డింగ్ 1966 డిసెంబర్ 15న 12 గంటలకు..కానీ సినిమా పాట పాడడానికి స్టూడియోకి వెళితే ఎస్పీ. బాలును ఎవరో అనుకోని వాచ్ మెన్ లోపలికి రానివ్వలేదు.ఎలాగో లోపలికి వెళ్లి ఆ సినిమాలోని ఒక పాట నాలుగో చరణాన్ని ఎస్పీ బాలు చాలా మధురంగా ఆలపించారు.

అలా అలవోకగా ఆయా నటులకు గొంతులకు సరిపోయే విధంగా పాటలు పాడుతూ 1980 సంవత్సరం వచ్చేసరికి సిరిసిరిమువ్వ తర్వాత మరో సంగీతపరమైన చిత్రం శంకరాభరణం తీయడానికి కళాతపస్వి కె.విశ్వనాథ్ ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఆ సినిమాకి కె.వి.మహదేవన్ ను సంగీత దర్శకుడిగా ఎన్నుకున్నారు. శాస్త్రీయ సంగీతం ఆధారంగా కొనసాగే సినిమాలో శంకరా నాదశరీరాపరా వేద విహారా హరా..జీవేశ్వరా.. అనే పాట పాడడానికి కె.వి మహదేవన్ బాలుచే పాడించాలనుకున్నారు.

అప్పుడు ఎస్పీ బాలు శాస్త్రీయ సంగీతమా అంటూ భయపడి పరుగులు తీశారు.అలా పరుగులు తీసిన ఎస్పీ బాలును కె.వి.మహదేవన్ అసిస్టెంట్ పుగలేంది తీసుకువచ్చి బాలుచే శంకరా నాదశరీరాపరా.. అనే పాట పాడించడం జరిగింది. ఇప్పటికీ ఒళ్ళు జలదరించే ఆ అద్భుతమైన పాట ప్రేక్షకుల గుండెల్లో మారుమోగుతూనే ఉంటుంది.

telugudesk

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago