Featured

వీళ్లు రాసే కథకు స్టార్ హోటల్స్ అవసరమా అంటున్న దర్శకుడు మారుతి.!!

Published

on

మామూలుగా జనం మధ్య తిరిగే సాధారణ వ్యక్తులు వారి దశ తిరిగి రాత్రికి రాత్రే స్టార్స్ అయిన వారు ఎంతోమంది సినీ పరిశ్రమలో తారసపడతారు. ఇంతకు ముందున్న వారి ఆర్థిక పరిస్థితి ఇప్పుడు వారు అనుభవిస్తున్న హోదాకి ఏ మాత్రం సంబంధం ఉండదు. అందం, ఆకర్షణతో కొంతమంది సినీ ఇండస్ట్రీలో పైకి వస్తే తెలివి, నైపుణ్యంతో మరికొంతమంది స్టార్ స్టేటస్ ను అనుభవిస్తున్నారు. అలా ఏ దశనుంచి ఏ దశకు వెళ్లిన తమ మూలాలను ఎప్పుడు మరువకూడదు.

అలాంటి ఇ డౌన్ టు ఎర్త్ ఉన్న దర్శకుడు నిర్మాత, రచయిత, దాసరి మారుతి. మచిలీపట్నంలో అతి సాధారణ కుటుంబంలో జన్మించాడు. తండ్రి తోపుడు బండి మీద అరటిపళ్ళు అమ్మేవాడు. మారుతి కష్టాల కడలిలో ఎలాగో అలాగా వెహికల్స్ కి స్టిక్కరింగ్ చేసుకుంటూ తన డిగ్రీ కాస్త పూర్తి చేశాడు.
ఏదో సాధించాలన్న ఆశయంతో హైదరాబాదులో ఉన్న తన అక్క బావ వాళ్ళ ఇంటికి వచ్చేసాడు.అలా నిజాం పేట నుండి జె.ఎన్.టి.యు అక్కడి నుండి జూబ్లీహిల్స్ లో టూడి యానిమేషన్ కోర్సు నేర్చుకోవడానికి వెళ్ళేవాడు. అలా నేర్చుకుంటున్న సమయంలో బన్నీ వాసుతో పరిచయం ఏర్పడి ఆర్య సినిమా కి మొట్టమొదటగా డిస్ట్రిబ్యూటర్ గా చేశాడు.

ప్రేమిస్తే,ఏ ఫిల్మ్ బై అరవింద్ లాంటి సినిమాలకి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించాడు.ఆ తర్వాత సొంతంగా కొన్ని యాడ్స్ కూడా చేయడం జరిగింది. ఆ క్రమంలో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ చెప్పిన విధంగా పైడి కెమెరాతో ఈ రోజుల్లో అనే సినిమాలు తీయడం జరిగింది. లో బడ్జెట్ లో తీసిన ఈ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. తర్వాత బస్టాప్, ప్రేమ కథ చిత్రం, భలే భలే మగాడివోయ్, కొత్తజంట, బాబు బంగారం, మహానుభావుడు, ప్రతి రోజు పండగే సినిమాలు రూపొందించాడు.


ఒక ఇంటర్వ్యూలో కథలు ఎలా రాస్తారు అన్న ప్రశ్నకు సమాధానంగా.. ఆస్ట్రేలియా, దుబాయ్ లాంటి స్టార్ హోటల్లో సెవెంత్ ఫ్లోర్ లో నుంచి ఫ్రూట్స్ తింటు వ్యూ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నప్పుడు కొత్తగా ఏ కథ పుట్టదు. అలాంటప్పుడు ఆ దర్శకుడు తన మొదటి కథ ఎక్కడో ఊర్లో ఉండి కథ రాసుకుంటాడు.కానీ నిర్మాతను కావాలనే అలాంటి లొకేషన్లో కథ పుడుతుందని చెప్పడం ఈ రోజుల్లో కామన్ అయిపోయిందని దర్శకుడు మారుతి చెప్పుకొచ్చారు.

Advertisement

Trending

Exit mobile version