Featured

ఈ హీరో హీరోయిన్ల మధ్య తిట్ల వర్షం కట్ చేస్తే నిర్మాతకు కాసుల వర్షం.!!

‌1970 అర్ధ భాగంలో సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన మోహన్ బాబు, స్వర్గం నరకం శివరంజని, డ్రైవర్ రాముడు, సర్దార్ పాపారాయుడు, కొండవీటి సింహం ప్రేమాభిషేకం, దేవత, వారసుడొచ్చాడు మంచి దొంగ, కొండవీటి దొంగ లాంటి చిత్రాల్లో విలన్ గా నటించిన అప్పటికీ.. 1990 ప్రాంతానికి వచ్చేసరికి అల్లుడుగారు సినిమా తో హీరోగా మంచి గుర్తింపు పొందారు. ఇక అక్కడి నుండి అసెంబ్లీ రౌడీ, బ్రహ్మ, రౌడీ గారి పెళ్ళాం, పెదరాయుడు లాంటి విజయవంతమైన చిత్రాల్లో హీరోగా నటించారు.

ఇన్ని సూపర్ హిట్ చిత్రాల్లో నటించినప్పటికీ అల్లుడుగారు సినిమా మోహన్ బాబు సినీ కెరీర్ లో ఒక ప్రత్యేకమైన చిత్రంగా పేర్కొనవచ్చు. ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా హంగు ఆర్భాటాలు పెట్టకుండా సింపుల్ గా రాఘవేంద్ర రావు గారి దర్శకత్వంలో అల్లుడుగారు సినిమా1990 జూలై 14 విడుదలై ఘన విజయాన్ని సాధించింది.

అయితే సినిమా విషయానికి వస్తే కిరాయి మొగుడు గా శోభన ఇంట్లో ప్రవేశించిన మోహన్ బాబు “అసలే నాది లైఫ్ అండ్ డెత్ సమస్య” అంటూ ప్రతిసారి చంద్రమోహన్ వద్ద డబ్బులు లాగుతూ.. రాత్రి అయ్యిందంటే శోభన తో అస్తమానం గొడవ పడడం సినిమాకి ఒక హైలైట్ గా చెప్పుకోవచ్చు. సత్యానంద్ రాసిన సంభాషణలు కడుపుబ్బా నవ్విస్తాయి.

అచ్చోసిన ఆంబోతుల అరుస్తున్నావ్.. కాదు నువ్వే పిచ్చి పట్టిన గజ్జి కుక్కల అరుస్తున్నావ్.. తొండ గుడ్డు ముఖం.. తేలు కొండి మూతి.. కుళ్లిపోయిన అరటి పండు తొక్క.. కంపుకొట్టే చెత్తకుప్ప.. ఏ హే బూజు దులిపే చీపురు కట్ట.. ఏహే ఏరి పారేసిన ఎంగిలాకు…. ఆపు నీ డమ్మ..డొక్కు..డయ్యాల..డాలి డుండుల..కింజల..పింజల..గింజ.!! ఇది అడవి భాషలో అతిపెద్ద నీచమైన తిట్టు. అని మోహన్ బాబు అనడంతో శోభన తెల్లమొహం వేస్తుంది. వీరి మధ్య తరచు వచ్చే ఈ తిట్లపురాణం ప్రేక్షకులు ఎంతగానో ఎంజాయ్ చేశారు. అలా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది.

telugudesk

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago