రెజీనా కసాండ్ర..టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మంచి క్రేజ్ సంపాదించుకుంది. 2012లో సుధీర్ బాబు నటించిన ఎస్ ఎం ఎస్ (శివ మనసులో శ్రుతి) సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టిన ఈమె వచ్చి రాగానే మంచి హిట్స్ అందుకుంది. అదే ఏడాది రొటీన్ లవ్ స్టోరీ సినిమాలో కూడా నటించి టాలీవుడ్ మేకర్స్ దృష్ఠిని ఆకట్టుకుంది. రెజీనా ని చూసిన అందరూ తెలుగులో యంగ్ హీరోలకి మంచి ఛాయిస్ అని భావించారు. ఈ క్రమంలోనే ఒకే ఏడాది నలుగురు యంగ్ హీరోలతో నటించే అవకాశం అందుకుంది.
2014లో కొత్త జంట, పిల్లా నువ్వు లేని జీవితం, రారా కృష్ణయ్య, పవర్ సినిమాలలో అవకాశాలు దక్కించుకుంది. కొత్త జంట సినిమాలో అల్లు శిరిష్ కి జంటగా, పిల్లా నువ్వు లేని జీవితం సినిమాలో మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ కి జంటగా, రారా కృష్ణయ్య సినిమాలో సందీప్ కిషన్ కి జంటగా, పవర్ సినిమాలో మాస్ మహారాజ రవితేజకి జంటగా నటించింది. వీటిలో రారా కృష్ణయ్య యావరేజ్ సినిమా కాగా, మిగతా మూడు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. దాంతో రెజీనా టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయింది.
ఇదే నేపథ్యంలో 2015లో మరోసారి సాయి ధరం తేజ్ తో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమా చేసింది. ఈ సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ఇందులో మెగాస్టార్ సాంగ్ గువ్వా గోరింకతో రీమిక్స్ చేయగా అందులో రెజీనా బాగా ఆకట్టుకుంది. అలాగే సౌఖ్యం సినిమాతో హిట్ అందుకుంది. ఆ తర్వాత నుంచి రెజిన్నా కెరీర్ డల్ అయింది. మంచు మనోజ్ తో చేసిన శౌర్య, నారా రోహిత్ తో చేసిన శంకర సినిమాలు ఈమెకి హిట్ ఇవ్వలేకపోయాయి. అలాగే నాని నిర్మాణంలో వచ్చిన అ.! సినిమాలో విభిన్నమైన పాత్ర పోషించి ఆకట్టుకుంది. కానీ సినిమా కమర్షియల్ హిట్ కాకపోవడంతో రెజీనాకి ఈ సినిమా ఉపయోగపడలేదు.
అయితే ఇదే సమయంలో బడా ఫ్యామీలికి చెందిన హీరోతో రెజీనా లవ్ లో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. ఇద్దరు కలిసి రెండు సినిమాలు చేశారు. ఆ సమయంలో ప్రేమలో పడినట్టు వార్తలు వచ్చాయి. కానీ మూడవ వ్యక్తి వల్ల ఆ యంగ్ హీరోతో రెజీనా లవ్ బ్రేక్ అయిందని ప్రచారం జరిగింది. దాంతోనే క్రమంగా సినిమాలకి గ్యాప్ వచ్చిందని చెప్పుకున్నారు. కారణం ఇదేనా లేక ఫ్లాప్స్ రావడంతో రెజీనాకి తెలుగులో అవకాశాలు రాలేదా అనేది మాత్రం సస్పెన్స్ గా ఉన్నప్పటికి తమిళంలో మాత్రం వరుసగా సినిమాలు చేస్తూ వస్తోంది. మధ్యలో నక్షత్రం లాంటి సినిమాలు చేసినా ఉపయోగం లేదు.
అయితే 7, ఎవరు సినిమాలు మళ్ళీ రెజీనాకి హిట్స్ ఇచ్చాయి. ప్రస్తుతం రెజీనా చేతిలో శాకిని ఢాకిని, ఆచార్య స్పెషల్ సాంగ్ తో పాటు తమిళంలో 6 సినిమాలు చేస్తోంది. ఈ సినిమాలు తెలుగులోనూ రాబోతున్నాయి. తమిళంలో చేస్తున్న శూర్పణగై తెలుగులో నేనే నా పేరుతో రాబోతోంది. ఇటీవలే ఈ సినిమా నుంచి రెజీనా లుక్ కూడా రిలీజ్ అయింది. ఇక మెగాస్టార్ తో కలిసి ఆచార్య లో చేసిన స్పెషల్ సాంగ్ ఆమెకి మంచి పేరు తీసుకు వస్తుందని చిత్రబృందం అంటోంది. ఈ పాటతో మెగాస్టార్ ప్రశంసలు అందుకుంది.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…