జంధ్యాల తర్వాత ఆయనను మరిపించే అతికొద్ది దర్శకుల్లో ఈవివి సత్యనారాయణ ఒకరు. “చెవిలో పువ్వు” సినిమాతో మొదలైన ఈవీవీ సత్యనారాయణ సినీ ప్రయాణం.. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా చిన్న పెద్ద అనే తేడా లేకుండా అనేక చిత్రాలను ఆయన రూపొందించారు. రాజేంద్ర ప్రసాద్, శ్రీకాంత్, జగపతిబాబు, నాగార్జున, వెంకటేష్, చిరంజీవి లాంటి హీరోలతో సూపర్, డూపర్ హిట్ సినిమాలను అందించారు.
1994లో ఈ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన హలో బ్రదర్, ఆమె, ఆలీబాబా అరడజను దొంగలు, అబ్బాయిగారు ఈ నాలుగు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సాధించాయి. అలా ఆయన దర్శకత్వంలో వచ్చిన ఆమె చిత్రం మధ్యతరగతి కుటుంబాల జీవితాలకు అద్దంపడుతోంది. 1994 సిరి చిత్రనిర్మాణం, ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో “ఆమె” చిత్రం విడుదల అయ్యింది. ఈ సినిమాలో శ్రీకాంత్, ఊహ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రంలో కోట శ్రీనివాసరావు క్యారెక్టర్ ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు. ఒకప్పుడు జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ఆహా నా పెళ్ళంట చిత్రంలో ఓ పిసినారి పాత్రలో కనిపించిన కోట శ్రీనివాసరావుని ఇప్పటికీ ప్రేక్షకులు మర్చిపోలేరు.
దాదాపు అలాంటి పిసినారి పాత్రనే ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ఆమె చిత్రంలో కోట శ్రీనివాసరావు చేయడం ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంది. అయితే ఈ సినిమాలో ఫ్యామిలీ సెంటిమెంట్ తో పాటు కామెడీని కూడా మిస్ అవకుండా ఈవివి సత్యనారాయణ సినిమా తీసిన విధానం బాగుంటుంది. సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జరిగే అనేక సంఘటనలను ప్రస్తావిస్తూ, పాత్రలో భావోద్వేగాలను కల్పిస్తూ సినిమా మొత్తం ఎక్కడ బోర్ కొట్టకుండా క్లైమాక్స్ వరకు తీసుకు వెళ్లారు.. అయితే కోట శ్రీనివాసరావు పాత్ర పిసినారిగా మాత్రమే కాకుండా, అజ్ఞానం, అవివేకంతో కూడిన విధంగా ఉంటుంది.
క్లైమాక్స్ లో కోట శ్రీనివాసరావు భార్యగా నటించిన సుధ అతని గుండెల పై కాలుపెట్టి.. స్త్రీ అబల కాదు సబల, అంతే కాదు ఆదిపరాశక్తి అని చెప్పే ఒక డైలాగ్ ఉంటుంది. ముందుగా కథా పరంగా బాగుంటుందని తీసినప్పటికీ… తర్వాత సినిమాల్లో ఆ దృశ్యాన్ని తీసేయడంతో విజయవాడ ఒక థియేటర్ లో ట్రిమ్ చేసిన క్లైమాక్స్ సీన్ ప్రదర్శిస్తేనే సినిమా నడుస్తుందని ప్రేక్షకులు గొడవ చేయడంతో ఆ దృశ్యాన్ని తిరిగి సినిమాలో యధా విధంగా కొనసాగించడం జరిగిందని నటి సుధ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఆమె, పెళ్లి సందడి వంటి చిత్రాలు హీరో శ్రీకాంత్ కు ఎంతగానో పేరు తీసుకు వచ్చాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…