శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు మొదటిసారిగా శ్రీకాంత్ అడ్డాలకు దర్శకుడిగా “కొత్త బంగారు లోకం”తో అవకాశాన్ని కల్పించాడు. ఆ తర్వాత “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు”. ఆ తర్వాత ముకుందా, బ్రహ్మోత్సవం చిత్రాలను శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన మిగతా చిత్రాలకు బ్రహ్మోత్సవం చిత్రానికి చాలా తేడా కనిపిస్తుంది.
తిరుమలేశుని ఆలయంలో నిత్యకళ్యాణం పచ్చతోరణంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. తిరుమలేశునికి తొలిసారిగా సృష్టికర్త బ్రహ్మ ఉత్సవాలు జరిపారని భవిష్య పురాణం చెబుతుంది. ఐతే తిరుమలేశుని బ్రహ్మోత్సవాలకు అంతటి ప్రాధాన్యత ఉంది. అలాంటి దైవత్వంలోని బ్రహ్మోత్సవం అనే మాటను తీసుకొని శ్రీకాంత్ అడ్డాల ఒక సినిమాను రూపొందించడం ప్రేక్షకుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.
2016, పొట్లూరి ప్రసాద్ నిర్మాణ సారధ్యంలో, శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో “బ్రహ్మోత్సవం” చిత్రం విడుదలైంది. ఇందులో హీరో, హీరోయిన్లుగా మహేష్ బాబు, సమంత, కాజల్, ప్రణీత నటించారు. ఇక కెమెరాలో పట్టనంత నటీనటులు ఈ సినిమాలో తళుక్కుమన్నారు. జయసుధ సత్యరాజ్, రేవతి, రావు రమేష్, ఈశ్వరీరావు, జయప్రకాష్ రెడ్డి, తులసి, షయాజీ షిండే, వెన్నెల కిషోర్, ముఖేష్ రుషి, కృష్ణభగవాన్ లాంటి తారాగణంతో వెండితెరపై సందడి చేశారు. కలర్ ఫుల్ సెట్లు భారీ హంగులతో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పొందింది.
అయితే ఈ చిత్ర పరాజయానికి కారణాలు:
1. భారీ తారాగణం,కుటుంబ నేపథ్యం కథ ఇవన్నీ కలగలిపి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం. అయితే పొట్లూరి ప్రసాద్, కేవలం ఈ సినిమాను చూసి శ్రీకాంత్ అడ్డాల చెప్పిన బ్రహ్మోత్సవం కథను గుడ్డిగా నమ్మడం.
2. శ్రీకాంత్ అడ్డాల, మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ లకు ఈ కథలో కొన్ని లైన్స్ మాత్రమే వారికి వివరించారు. బంధాలు బంధుత్వాలపై సినిమా కొనసాగుతుందని వారు దర్శకున్ని నమ్మారు.
3. అసలు బౌండెడ్ స్క్రిప్ట్ రాసుకోకుండా షూటింగ్ మొదలు పెట్టడం.
4. మొదటి సగం సినిమా వచ్చేంతవరకు, రెండవ సగంలో ఏం జరుగుతుందనే విషయం టీమ్ మొత్తానికి తెలియకపోవడం.
5. సెకండాఫ్ సినిమాను హడావిడిగా పరుచూరి బ్రదర్స్ చే తిరిగి రాయించుకోవడం.
6. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా పేరు బ్రహ్మోత్సవం పెట్టుకున్నప్పటికీ కథలో దమ్ము లేక సినిమా చతికిలపడింది.
7. స్టోరీ స్క్రిప్ట్ మీద పట్టు లేకపోవడంతో సినిమా కాస్త తెరిచి చూస్తే 4 గంటల నిడివి వచ్చిందట.
8. లెంతి సినిమాను రెండున్నర గంటలకు తీసుకురావడానికి చిత్రబృందం నానా ఇబ్బందులు పడ్డారు.
9. నాలుగు గంటల సినిమాను కత్తిరించడంతో సినిమాలో కంటిన్యుటీ మిస్ అయ్యింది.
10. సుదీర్ఘమైన సన్నివేశాలు ప్రేక్షకులకు బోర్ కొడుతుంటాయి.సినిమా ఎప్పుడు అయిపోతుందా అని సగటు ప్రేక్షకుడు వేచి చూడడం.
ఇలాంటి అనేక కారణాలు ఈ సినిమా పరాజయానికి కారణమయ్యాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…