Featured

వీడు ఇడియట్, దేశ ముదురు, పోకిరి అంటున్నారు.. కిరణ్ అబ్బవరం మరో మాస్ మహారాజా అవుతాడా..?

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మాస్ మహారాజ రవితేజ స్టైల్ ఇంకెవరీకీ రాదని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దర్శకత్వ శాఖలో పనిచేసిన రవితేజ నీకోసం సినిమాతో హీరోగా మారాడు. స్వయం కృషితో ఎదిగి ఈ రోజు తనకంటూ ఓ ప్రత్యేకమైన మార్కెట్‌ని సంపాదించుకున్నాడు. టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి తర్వాత మళ్ళీ ఆ స్థాయి ఇన్స్పైరింగ్ హీరో అంటే రవితేజనే చెప్పాలి. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో ఎదగొచ్చు..ఏలొచ్చు అని చిరంజీవి తర్వాత నిరూపించిన హీరో.

ఇక ఆయన సినిమాలు మాస్ ఆడియన్స్ కి మాంచి కిక్ ఇస్తుంటాయి. అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ కి రవితేజ సినిమాలు బాగా నచ్చుతుంటాయి. ఎంత మాస్ సినిమా చేసిన అందులో కథా బలం, ఫ్యామిలీ ఎమోషన్స్ తప్పకుండా ఉండేలాగే మాస్ మహారాజ కథలను ఎంచుకుంటున్నాడు. రవితేజ మాదిరిగా మాస్ ఇమేజ్ కోసం ట్రై చేసిన టాలీవుడ్ హీరోలు చాలా మందే ఉన్నారు. కానీ ఆయన రేంజ్ కి రీచ్ అవలేక మధ్యలోనే ఆగిపోయారు. కానీ ఇన్నాళ్ళకి రవితేజ ఆటిట్యూడ్ కి కాస్త అటు ఇటూగా, పూరి జగన్నాథ్ టైటిల్స్ కి తగ్గ మ్యానరిజంతో ఓ యంగ్ హీరో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చాడు.

ఆ హీరోనే కిరణ్ అబ్బవరం. ఈ హీరో నటించిన ఎస్ ఆర్ కళ్యాణ మండపం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వాస్తవంగా ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కరోనా వేవ్స్ వల్ల ఆగిపోయింది. అయితే సాంగ్స్ పరంగా బాగా పబ్లిసిటీ వచ్చింది. సినిమా రిలీజ్ కి ముందే టీవీలో, యూట్యూబ్ లో రెండు పాటలకి బాగా ప్రేక్షకాధరణ లభించింది. ఆ సాంగ్స్‌లో కిరణ్ అబ్బవరం పర్ఫార్మెన్స్ చూసిన కొంతమంది రవితేజతో కంపేర్ చేశారు. హీరోయిన్‌తో ఉన్న సీన్స్ చాలా వరకు రవితేజ ఎలా చేస్తాడో అలా చేయడానికే ట్రై చేశాడు. ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటించిన ఎస్ ఆర్ కళ్యాణ మండపం అన్నీ వర్గాల ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

హీరోగా మంచి హిట్ అందుకున్నాడు కిరణ్ అబ్బవరం. ఈ సినిమా రిలీజ్ తర్వాత పలువురు సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. అంతేకాదు ఎస్ ఆర్ కళ్యాణ మండపం రిలీజ్ కి ముందు మూడు సినిమాలు కమిటైన ఈ మాస్ హీరో ఎస్ ఆర్ కళ్యాణ మండపం రిలీజ్ తర్వాత మరో మూడు సినిమాలను ఒప్పుకున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న యంగ్ హీరోలలో సత్య దేవ్ తర్వాత ఆ రేంజ్ దూకుడుగా సినిమాలు చేస్తుంది అంటే కిరణ్ అబ్బవరం, సంతోష్ శోభన్. టాలీవుడ్‌లో ఇప్పుడు ఈ ముగ్గురు వరుస ప్రాజెక్ట్స్‌లో బిజీగా ఉన్నారు.

ముఖ్యంగా కిరణ్ అబ్బవరం ఇప్పుడు కమిటయిన సినిమాలన్ని మాస్ కథలే. రవితేజ నటించిన ఇడియట్, అల్లు అర్జున్ నటించిన దేశ ముదురు, మహేష్ బాబు నటించిన పోకిరి లాంటి సినిమాలు చేయాలని ఈ హీరో ప్లాన్ చేసుకుంటున్నాడు. మొదటి సినిమా సక్సెస్ తో వరుసగా ప్రాజెక్ట్స్ అయితే కమిటయ్యాడు. కానీ ఆ ప్రాజెక్ట్స్ లో కనీసం ఓ మూడు నాలుగు సినిమాలైనా భారీ హిట్ సాధిస్తే ఖచ్చితంగా టాలీవుడ్‌లో మరో మాస్ హిరోగా క్రేజ్ సంపాదించుకోవడం గ్యారెంటీ అనే టాక్ వినిపిస్తోంది. చూడాలి మరి కిరణ్ అబ్బవరం ఎంతకాలం హీరోగా నిలబడతాడో.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago