Featured

యాచకురాలిగా నడిరోడ్డుపై రచ్చ చేసిన జబర్దస్త్ కామెడీ స్టార్స్..!

బుల్లితెరపై పలు ఛానల్స్ లో పండుగ సమయాలలో ప్రత్యేక కార్యక్రమాలు చేయడం ఎప్పటినుంచో ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలోనే వచ్చే నెలలో వినాయకచవితి పండుగ వస్తున్న సందర్భంగా ఈటీవీ “ఊరిలో వినాయకుడు” అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రసారం చేస్తోంది. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో నిర్వాహకులు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జబర్దస్త్ జడ్జి రోజా, ఇంద్రజ పాల్గొని ఎంతో సందడి చేశారు.

ఈ విధమైనటువంటి ప్రత్యేక కార్యక్రమాల్లో నటీనటులకు టాస్క్ లు ఇవ్వడం సర్వసాధారణమే. ఈ క్రమంలోనే జబర్దస్త్ బ్యూటీ వర్షకి ఈ కార్యక్రమంలో భాగంగా ఆటో రాంప్రసాద్ ఒక టాస్క్ ఇచ్చారు. ఇందులో భాగంగా వారు బయటకు వెళ్లి ఒక అబ్బాయికి ప్రపోజ్ చేయాలి. కానీ ఆమెను ఎవరు గుర్తు పట్టకూడదు అనే కండిషన్ పెడతాడు.

ఈ టాస్క్ లో భాగంగా వర్ష పిచ్చిదాని వేషంలో రోడ్డు పైకి వెళుతుంది. ఆమె రోడ్డుపై వెళ్తున్న కుర్రాళ్ళకు ప్రపోస్ చేయగా,ఆ ప్రపోజల్ ను చెడకొడుతూ ఉంటాడు ఇమ్మానియేల్ ఈ విధంగా వీరిద్దరూ రోడ్డుపై యాచకులుగా జనాల దగ్గరికి వెళ్తే వారు భయపడుతూ పరుగులు పెడుతుంటారు. ఈ సంఘటనలు చూసి రోజా ఇంద్రజ ఎంతో నవ్వుకుంటారు.

ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఈ ప్రమోషన్ మీడియాలో వైరల్ గా మారింది. జబర్దస్త్ కార్యక్రమంలో ఎంతో అందంగా ఉన్న వర్ష ఈ విధంగా యాచకురాలుగా మారడంతో ఆమె ఎవరు గుర్తు పట్టలేకపోయారు. ఈ విధంగా ఆటో రాంప్రసాద్ ఇచ్చిన టాస్క్ లో వర్ష విజయవంతంగా పూర్తి చేసింది. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago