Categories: FeaturedMovie News

ఆ రోజుల్లో దుష్ట పాత్రలను అవలీలగా పోషించింది ఈ ముగ్గురిలో ఎవరు..?!

కథానాయకుడికి ప్రతికథా నాయకుడు లేనట్లయితే ఆ చిత్రాన్ని మనం ఊహించుకోలేం. పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలు ఏమైనా సినిమాల్లో వచ్చే అనేక మలుపులకు ప్రతి కథానాయకుడే కారణమవుతాడు. ఆ క్రమంలో కథానాయకుడి పై ఎక్కడలేని సానుభూతి ప్రతికథానాయకుడు తోనే వస్తుంది.

అప్పటి చిత్రాలలో దుష్ట పాత్రలను నాగభూషణం, సత్యనారాయణ, రావుగోపాల్ రావు వేసేవారు. ఆ క్రమంలో వారు కొన్ని సినిమాల్లో కీలకంగా మారి ఆ చిత్ర ఘన విజయంలో ప్రధాన పాత్ర పోషించేవారు. అయితే ఈ ముగ్గురిలో నాగభూషణం ముందుగా సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టారు.

1952 “పల్లెటూరు” అనే చిత్రంతో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టిన నాగభూషణం.. అనతికాలంలోనే ఆయన వేసిన దుష్ట పాత్రలు సినిమాలో అత్యంత ప్రధానంగా నిలిచేవి. మంచి మనుషులు, ఆదర్శ కుటుంబం, మోసగాళ్లకు మోసగాడు, అడవి రాముడు, జాతర లాంటి చిత్రాల్లో ఆయన వేసిన దుష్ట పాత్రలకు మంచి పేరు వచ్చింది.

1959 “సిపాయి కూతురు” అనే సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన సత్యనారాయణ అనేక చిత్రాల్లో నటించారు. ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, శోభన్ బాబు, కృష్ణ, కృష్ణంరాజు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లాంటి హీరోల చిత్రాల్లో విలన్ గా ఆయన వేసిన దుష్ట పాత్రలు సినిమా ఘన విజయానికి ఎంతగానో తోడ్పడ్డాయి. దేవుడు చేసిన మనుషులు, యమగోల, అడవి రాముడు, వేటగాడు, డ్రైవర్ రాముడు, కొండవీటి సింహం, మంచి దొంగ, లంకేశ్వరుడు లాంటి చిత్రాలు కైకాల సత్యనారాయణకు మంచి పేరు తీసుకొచ్చాయి.

1966 “భక్త పోతన” చిత్రం ద్వారా రావుగోపాలరావు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ కంటే ‌దుష్ట పాత్రల్లో ఎక్కువగా కనిపించారు. రావు గోపాల్ రావు కూడా ఎన్టీరామారావు, నాగేశ్వరరావు, శోభన్ బాబు, కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున ఇలాంటి అనేకమంది అగ్ర హీరోల చిత్రాల్లో నటించి ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. మన ఊరి పాండవులు, ఖైదీ, బొబ్బిలి బ్రహ్మన్న, దేవత, త్రిశూలం, అడవి దొంగ, యముడికి మొగుడు, గ్యాంగ్ లీడర్ లాంటి అనేక చిత్రాలు రావుగోపాలరావుకి మంచి పేరును తీసుకువచ్చాయి. రావు గోపాలరావు ధరించిన అనేక దుష్ట పాత్రల్లో “ముత్యాల ముగ్గు” చిత్రంలో రావుగోపాలరావు వేసిన దుష్ట పాత్ర అన్నిటికంటే భిన్నమైనదిగా పేర్కొనవచ్చు. అప్పట్లో నాగభూషణం, కైకాల సత్యనారాయణ, రావుగోపాల్ రావు ఈ ముగ్గురు దుష్ట పాత్రలు ధరించి ప్రేక్షకుల దృష్టిలో సమవుజ్జీలుగా నిలిచారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago