ఆయన పాటలు వాణిజ్య అంశాలకు దూరం, ఆయన గేయాలు ప్రణయ, పరిణయాలకు బహుదూరం, ఆయన క్లబ్బు, గబ్బు గీతాలకు వ్యతిరేకం. సమాజములో కుళ్ళును కూకటివేళ్ళతో పెకిలించే పాటలు ఆయన సొంతం. పేదల ఇక్కట్లు వారి అగచాట్లు ఆయన పాటల్లో ప్రతిబింబిస్తాయి. అలసిన శ్రామికున్ని, సొలసిన కర్షకున్ని ఆయన కలంతో కదుపుతాడు. హలముతో పొలము దున్నే కర్శకున్ని హర్షిస్తూ.. రాసిన పాటలకు ప్రేక్షకులు హర్షధ్వానాల తెలియజేయడం తప్ప మరొకటి ఉండదు. ఆయన పాటలు పేదల కష్టాలకు, కన్నీళ్లకు అద్దం పడతాయి. వారి సమస్యలతో పోరాడతాయి, అన్యాయాన్ని అరికడుతూ.. అభ్యుదయం వైపు అడుగులు వేస్తూ ప్రజల్ని మేలుకొలుపుతాయి.
మెదక్ జిల్లా,తుఫ్రాన్ లో జన్మించిన గద్దర్. హైదరాబాద్ లో ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేశారు. 1969 తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఆయన బావ వ్యాప్తికోసం బుర్రకథ ఎంచుకొని ఊరూరా తిరిగి ప్రజల్లో చైతన్యం నింపారు. అలాగే జనాభా నియంత్రణ కోసం, కుటుంబ నియంత్రణ అనే అంశాన్ని తన బుర్ర కథల ద్వారా ఊరూరా తిరుగుతూ ప్రచారం చేశారు. 1975లో బ్యాంకు రిక్రూట్మెంట్ ఎగ్జామ్ రాసి, క్లర్క్ ఉద్యోగంలో చేరాడు. “మా భూమి” చిత్రంలో “బండెనక బండి కట్టి” అనే పాటను పాడి నర్తించాడు.
ఆ తర్వాత 1984లో బ్యాంకు ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఆయన రాసిన పాటల్లో “అమ్మ తెలంగాణమా” అనే పాట బహుళ జనాదరణ పొందింది. ఆయన ఆ మధ్య కాలంలో “జై బోలో తెలంగాణ” అనే సినిమాలో పాటలు రాస్తూ మళ్లీ వెండితెరను పలకరించాడు. ఈ సినిమాలో “పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న తెలంగాణమా..” అనే పాట ప్రజల్ని చైతన్యపరిచిందనడంలో సందేహం లేదు.
1995, దాసరి ఫిల్మ్ యూనివర్సిటీ నిర్మాణం, దాసరి నారాయణరావు దర్శకత్వంలో ఒరేయ్..రిక్షా చిత్రం విడుదల అయ్యింది. ఈ సినిమాలో ఆర్.నారాయణ మూర్తి, రవళి హీరో, హీరోయిన్లుగా నటించారు. అన్నా చెల్లెలు అనుబంధం తో వచ్చిన ఈ సినిమా ఘన విజయం సాధించింది. ఈ చిత్ర విజయంలో సంగీత, సాహిత్యాలది ప్రధాన పాత్ర గా పేర్కొనవచ్చు.
వందేమాతరం శ్రీనివాస్ అందించిన సంగీతానికి గద్దర్ తన సాహిత్యాన్ని జోడించారు. అలా ఆయన కలం నుండి జాలువారిన “నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా..తోబుట్టు రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మ”.. అనే పాట ప్రజాదరణ పొందింది. అయితే ఈ చిత్రంలోని ఈ పాటకి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి నంది అవార్డు ప్రకటించింది. రచయిత గద్దర్ నంది అవార్డు ను సున్నితంగా తిరస్కరించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…