Featured

కాజల్ తాపత్రయం.. చెల్లికి పెళ్ళైయ్యాక కూడా అవకాశాల కోసం ఇంతగానా..?

చందమామ కాజల్ అగర్వాల్ తన చెల్లికోసం ఇప్పుడు తెగ తాపత్రయపడుతోందట. కాజల్ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి 15 ఏళ్ళు దాటిపోయినా అదే గ్లామర్ తో ఆకట్టుకుంటుంది. తరగని అందం కాజల్ సొంతం కావడంతో ఆమెకి వస్తున్నవన్నీ క్రేజీ ఆఫర్సే. సీనియర్ హీరోల సినిమా అంటే దర్శక, నిర్మాతలు ముందు కాజల్ పేరునే పరిశీలిస్తున్నారు. సీనియర్ దర్శకుల దగ్గర నుంచి యంగ్ టాలెంట్ వరకు కథ నచ్చితే ఎవరికైనా గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ఆమె కెరీర్ లో మగధీర లాంటి ఇండస్ట్రీ హిట్స్ ఎన్నో ఉన్నాయి. హైయ్యెస్ట్ రెమ్యునరేషన్ కోసం ఎప్పుడు డిమాండ్ చేయలేదంటే అది కాజల్ మాత్రమే.

నిర్మాతలకి చుక్కలు చూపిస్తోంది. రెమ్యునరేషన్ పరంగా మేకర్స్ కి అందని ద్రాక్షపండులా ఉంది..కాజల్ డిమాండ్ చూసి నిర్మాతలు భయపడుతున్నారు..కాజల్ కి చాలా హెడ్ వెయిట్ అందుకే ఆ హీరో వద్దన్నాడు…ఇలాంటి మాటలు ఇప్పటి వరకు అటు తెలుగు గానీ ఇటు తమిళ, హిందీ ఇండస్ట్రీలలో గానీ వినిపించలేదు. అంతేకాదు అందరికీ కాజల్ మీద చాలా మంచి అభిప్రాయం ఉంది. ఒకరకంగా చెప్పాలంటే అనుష్క శెట్టి తర్వాత ఆ స్థాయి పాజిటివ్ టాక్ ఉంది కాజల్ మీదే అని చెప్పాలి. ఇక ఆమె నిర్మాతల హీరోయిన్. బడ్జెట్ ను బట్టి రెమ్యునరేషన్ తీసుకుంటుంది. ఇచ్చిన డేట్స్ ఏ రోజూ క్యాన్సిల్ చేసిన దాఖలాలు లేవు.

అందుకే కాజల్ ఇన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ చేయగలుగుతోంది. గత ఏడాది తన స్నేహితుడు గౌతం కిచ్లుని పెళ్ళి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆమె పెళ్ళి చేసుకోక ముందు కమిటయిన సినిమాలతో పాటు పెళ్ళి తర్వాత కూడా నాగార్జున లాంటి అగ్ర హీరోల సినిమాలను అంగీకరిస్తోంది. అయితే ఇటీవల కాజల్ .. నా భర్త ఎప్పుడు సినిమాలకి గుడ్ బై చెప్పమంటే అప్పుడు చెప్పేస్తా అంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసి హాట్ టాపిక్ అయింది. దాంతో పెళ్లి తర్వాత కాజల్ సినిమాలకి దూరం కాదనుకున్న వాళ్ళు..ఇక ఎప్పుడైనా బై బై చెప్పేస్తుందని ఫిక్సైపోయారు.

అయితే ఇప్పుడు కాజల్ తన చెల్లి నిషా అగర్వాల్ రీ ఎంట్రీ కోసం చాలా తాపత్రయపడుతుందట. ఏమైంది ఈ వేళ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయిన నిషా అగర్వాల్ చాలా తక్కువ సినిమాలు చేసి పెళ్లి చేసుకొని సినిమాలకి గుడ్ బై చెప్పేసింది. మళ్ళీ ఇంత కాలానికి సినిమాలలో రీ ఎంట్రీ ఇవ్వాలని చూస్తోందట. ఆ మేరకు కాజల్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్టు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. పెళ్ళైన వారిని అంత త్వరగా హీరోయిన్ పాత్రలకి తీసుకోవాలంటే మేకర్స్ ఆలోచిస్తారు. అంతగా ఆసక్తి చూపించరు. మరి చెల్లి నిషా అగర్వాల్ రీ ఎంట్రీ కోసం కాజల్ చేసే ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.  

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago