Featured

వామ్మో !! తండ్రిలాగా తయారవుతున్న ప్రభుదేవా.. ఎన్నో ప్రేమలు, మరెన్నో పెళ్లిళ్లు!!

ప్రభుదేవా గురించి తెలియని వారు ఎవరు ఉండరు. ఒక నటుడిగా, దర్శకుడిగా, కొరియోగ్రాఫర్ గా, డాన్సర్ గా అందరికి సుపరిచితుడే. ఇన్ని టాలెంట్లు ఒక మనిషిలో ఉండడం చాలా అరుదు. అందుకేనేమో ప్రభుదేవను ఇండియన్ మైఖేల్ జాక్సన్ గా అందరూ ఆరాధిస్తారు. కానీ ప్రభుదేవా మాత్రం ఆడవాళ్ళని ఆరాధిస్తూ ఉంటాడు. ఏంటి ప్రభుదేవా గురించి ఇలా మాట్లాడుతున్నారు ఏంటి? అని అనుకుంటున్నారా.. అసలు ఎందుకు ఇలా అనవలిసి వచ్చిందో అన్న విషయాన్నీ తెలుసుకోవాలంటే ఈ కధనాన్ని పూర్తిగా చదవండి.

అసలు ప్రభుదేవా తండ్రి ఎవరో తెలిస్తే షాక్ అవుతారు. ప్రభుదేవా తండ్రి మరెవరో కాదు ప్రముఖ డాన్సర్ సుందరం మాస్టారు. అయితే సుందరం మాష్టారుకి ప్రభు దేవాతో పాటుగా మరో ఇద్దరు కుమారులు కూడా కలరు. అంటే సుందరం మాష్టారు ముగ్గురు బిడ్డలకు తండ్రి అన్నమాట. ప్రభుదేవా ఆయనకు పెద్ద కొడుకు. అయితే అప్పట్లో సుందరం మాస్టారు సినిమాల్లో బిజీ అయ్యాక భార్య పిల్లలను ఈరోజు పట్టించుకోలేదు. కట్టుకున్న భార్య ను చెన్నై లో కాపురం ఉంచి, అయన మాత్రం తమిళ్, కన్నడ, హిందీ అంటూ పలు భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉండేవాడు. ఈ నేపద్యంలోనే ఆయన తన తోటి డ్యాన్సర్ తో ప్రేమలో పడ్డాడు.

తనకు పెళ్లి అయింది, భార్య ఉంది అన్నా విషయాన్నీ మరిచిపోయి వేరే అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఆమె మరెవరో కాదు ప్రముఖ లేడీ డాన్సర్ అయిన తార మాస్టర్. అయితే తార మాష్టార్ గురించి కూడా అందరికి బాగానే తెలుసు. అన్ని భాషల్లో కొరియోగ్రాఫేర్ గా చేసారు. ఆ తర్వాత కొన్ని డ్యాన్స్ షోస్ కి జడ్జిగా కూడా వ్యవరించారు. అంతేకాదు వీరి ఇద్దరి ప్రేమకు ప్రతిరూపంగా ఒక కొడుకు కూడా పుట్టాడు. అయితే అప్పట్లో వీరి రహస్య పెళ్లి తంతు తమిళనాట చర్యనీయాంశం అయ్యింది. మరి ఎందుకో తెలియదు గాని ఒకానొక సందర్భంలో తార మాస్టర్ సుందరం మాస్టర్ పై కేసు కూడా పెట్టారు. అప్పట్లో ఈ న్యూస్ పెద్ద దుమారాన్ని కూడా లేపింది. అయితే పెద్దకొడుకు ప్రభుదేవా కూడా తండ్రి బాటలోనే నడిచాడని చెప్పవచ్చు. తండ్రి సుందరం మాస్టర్ లాగాన కొడుకు ప్రభుదేవా సైతం తన తోటి డ్యాన్సర్ అయిన రామలతను ప్రేమించి 1995 లో పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తరువాత ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు కూడా పుట్టారు. ముగ్గురు పిల్లలు పుట్టాక కూడా భార్యతో కాకుండా, నయనతారతో ప్రేమాయణం నడిపాడు. నయన్ తో ప్రేమలో పడిన విషయం అందరికి తెలియడంతో ఇద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తడంతో భార్యతో విడాకులు తీసుకున్నాడు.

అయితే ప్రభుదేవా ముగ్గురు పిల్లలు ఇప్పుడు బాగానే ఎదిగారు . భార్యకు విడాకులు ఇచ్చిన తరువాత నయనతారని పెళ్లి చేసుకున్నాడా అంటే అదీలేదు. కొన్నాళ్ళ పాటు నయన్ తో ప్రేమ జీవితం గడిపాడు. ఒకానొక సమయంలో వీరు ఇద్దరు పెళ్లి చేసుకుంటారని వార్తలు కూడా వచ్చాయి. చివరికి పెళ్లి చేసుకోవడం కోసం క్రిస్టియన్ నుండి హిందూ మతం కూడా మార్చుకుంది నయన్. తీరా ఇద్దరు ఒక అండర్ స్టాండింగ్ కు వచ్చి విడిపోయారు. తండ్రీకొడుకులు ఇద్దరు కూడా తమతో జీవితాన్ని పంచుకుని, వారికి వారసుల్ని ఇచ్చిన భాగస్వామిని పెద్దగా ప్రేమించింది లేదు. ఇక ప్రభుదేవా సైతం అప్పుడు ఇప్పుడు ప్రేమ, పెళ్లి వంటి కొన్ని విషయాలతో వార్తల్లో ఎక్కుతూనే వచ్చాడు. అయితే గత కొంత కాలంగా తమ దగ్గరి బంధువుల్లో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడని వార్తలు వచ్చాయి. కానీ ప్రభుదేవా గత సెప్టెంబర్లోనే రహస్యంగా మీడియా కంటికి చిక్కకుండా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని ముంబైలో కాపురం కూడా పెట్టాడు. అయితే ఇప్పుడు పెళ్లి చేసుకున్న అమ్మాయిని కూడా ప్రేమించే పెళ్లిచేసుకున్నాడట.

ఇంతకీ అసలు విషయం ఏంటంటే ఆ మధ్య ప్రభుదేవా విపరీతమైన నడుము నొప్పితో బాధపడుతున్నప్పుడు ఒక ఫిజియోథెరఫిస్ట్ అవసరం వచ్చిందట. ఆలా ఒక లేడీ డాక్టర్ ని నియమించుకున్నాడట. అయితే ఈ క్రమంలోనే ఆమె రోజు ప్రభుదేవా కి ఫిజియో థెరపీ చేయడానికి వాళ్ళింటికి వచ్చేది. ఇదే అదను చూసుకుని ప్రభుదేవాకి దగ్గర అయ్యిందట. ఆ సమయంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన ప్రేమ పెళ్ళికి దారి తీసింది. వీరి పెళ్లి సైతం ముంబైలోనే జరిగినట్టు తెలుస్తుంది. వీరి వ్యవహారం మీడియా వాళ్ళకి తెలిసే లోపే పెళ్లి చేసుకుని, సైలెంట్ గా కాపురం పెట్టేసాడు. ఇదండీ అసలు సంగతి. అందుకనే ఈ కధనం మొదట్లో ప్రభుదేవా ఆడవాళ్ళని ఎంతగానో ఆరాధిస్తాడు అని అన్నది. అయితే ఒకరి తర్వాత ఒకరిని ప్రేమిస్తూ వారితో జీవితం పంచుకుంటూ కాలం గడుపుతూ వచ్చాడు. మరి ఈ కాపురం అయినా కలకాలం ఉండాలని ఆశిద్దాం. ఇక పోతే ప్రభుదేవా వ్యక్తిగత జీవితం ఎలా ఉన్న గాని, ప్రొఫెషనల్ గా మాత్రం వరస అవకాశాలతో దూసుకుపోతున్నాడు… !!

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఉచిత బ్యాంక్ కోచింగ్ ప్రారంభం

తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…

9 hours ago

ప్రభాస్, రవితేజతో హిట్స్.. కానీ కెరీర్‌ను వదిలేసిన హీరోయిన్

టాలీవుడ్‌లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…

9 hours ago

నాగార్జున నమ్మకం లేకపోతే ఆర్జీవీ కెరీర్ ముగిసేది: జేడీ

టాలీవుడ్‌లో క్లాసిక్‌గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…

9 hours ago

బాల్య వివాహం ఆపాలని వెళ్లి.. తప్పు బాలికను తీసుకెళ్లిన అధికారులు

తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…

9 hours ago

‘టాక్సిక్’లో కొత్త కోణం.. దర్శకురాలిపై యశ్ ప్రశంసలు

కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…

9 hours ago

కేసీఆర్‌కు సవాల్.. కవిత కొత్త పార్టీ ప్రకటన

తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్‌కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…

9 hours ago