Featured

ఫ్రభుదెవ: ‘ఇందు’తో పాటు ఎన్ని సినిమాలు చేసినా ప్రభుదేవా కెరీర్‌లో గొప్ప సినిమా ‘ప్రేమికుడు’.. అందుకు కారణాలు ఇవే !!

ప్రముఖ సీనియర్ కొరియోగ్రాఫర్ అయిన సుందరం మాస్టర్ కొడుకులలో ఒకరు కొరియోగ్రాఫర్, డైరెక్టర్ ప్రభుదేవా. తండ్రి మాదిరిగానే ప్రభుదేవా కూడా కొరియోగ్రాఫర్ గానే సౌత్ సినిమా ఇండస్ట్రీలో విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకున్నారు. ఇంకా చెప్పాలంటే ప్రభుదేవాని అందరూ ఇండియన్ మైఖేల్ జాక్సన్ అని పిలుచుకుంటారు. పాప్ సింగర్ కం డాన్సర్ మైఖేల్ జాక్సన్ ని కొన్ని విషయాలలో ప్రభుదేవా ఇన్స్పిరేషన్‌గా తీసుకున్నారు. కెరీర్ ప్రారంభంలో చాలా వరకు ప్రభుదేవా, మైఖేల్ జాక్సన్‌నే ఇమిటేట్ చేసేవారు.

ఇక ఆయన డాన్స్ మాస్టర్‌గా టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్‌లో ఎన్నో అద్భుతమైన సాంగ్స్ కంపోజ్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి నుంచి యంగ్ హీరోల వరకు చాలామందికి ఆయన డాన్స్ కొరియోగ్రఫీ అందించారు. ఇప్పటికే డాన్స్ మాస్టర్‌గా పలు అవార్డులను అందుకున్నారు. అయితే సాంగ్స్ కంపోజ్ చేస్తూనే జెంటిల్ మేన్ లాంటి సినిమాలలో స్పెషల్ అపీరియన్స్ ఇచ్చి అదరగొట్టాడు. జెంటిల్ మేన్ సినిమాలో చికు బుకు చికు బుకు రైలే ప్రభుదేవాకి ఎంతటి పేరు తెచ్చిందో అందరికీ తెలిసిందే.

ప్రభుదేవా తండ్రి సుందరం మాస్టర్ మాదిరిగా సాంగ్స్‌లో డాన్స్ తో సమానంగా హీరో, హీరోయిన్స్ ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ బాగా ఎలివేట్ అయ్యేలా క్లోజ్ షాట్స్ కంపోజ్ చేస్తారు. దానికి యాక్టింగ్ మీద గ్రిప్ ఉండాలి. అంటే ఒక దర్శకుడిగా కూడా ప్రభుదేవా సత్తా ఉన్నవాడు. అందుకే ఆయన సాంగ్స్ బాగా హిట్ సాధించాయి. అందుకే ప్రభుదేవాని హీరోగా పెట్టి సినిమాలు చేయాలనుకున్నారు దర్శక నిర్మాతలు. ఈ క్రమంలోనే ఇందు అనే సినిమా మొదలైంది. అలాగే క్రియేటివ్ జీనియస్ శంకర్ దర్శకత్వంలో కాదలన్ తెలుగులో ప్రేమికుడుగా వచ్చింది.  

అయితే ఇందు సినిమా ప్రేమికుడు కంటే ముందు రిలీజై ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరచింది. హీరోగా ప్రభుదేవా డెబ్యూ సినిమా ఫ్లాపయ్యే సరికి అటు కోలీవుడ్‌లో ఇటు టాలీవుడ్‌లో డాన్స్ మాస్టర్ హీరో అయితే ఇలాంటి సినిమానే తయారవుతుందని కామెంట్స్ చేశారు. చెప్పాలంటే సినీ విమర్శకులు కూడా ఇలాంటి కామెంట్స్ చేశారు. దాంతో ఇక ప్రభుదేవా హీరోగా పనికిరాడు, డాన్స్ కొరియోగ్రఫీ చేసుకుంటూ కంటిన్యూ కావాల్సిందే అని మాట్లాడుకున్నారు. అయితే ఇందు సినిమా 1994 ఏప్రిల్‌లో రిలీజైతే అదే ఏడాది సెప్టెంబర్‌లో కాదలన్ ( ప్రేమికుడు ) రిలీజైంది.

మొదటిరోజు మొదటి షో నుంచే ప్రేమికుడు సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకొని హిట్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా లవర్స్ ని ప్రేమికుడు ఎంతగానో ఆకట్టుకుంది. ఏ.ఆర్.రెహమాన్ అందించిన సంగీతం పెద్ద హిట్ అయింది. ఇందు సినిమాతో హీరోగా పనికిరాడని కామెంట్ చేసిన వారే మాట మార్చి ప్రభుదేవా సూపర్ హీరో అని పొగిడారు. నగ్మా హీరోయిన్‌గా నటించింది. కథ, కథనం తో పాటు ప్రేమికుడు సినిమాలోని ప్రతీ పాట ఓ సూపర్ విజువల్ ట్రీట్‌గా నిలిచింది. ముక్కాలా ముక్కాబుల, అందమైన ప్రేమరాణి, ఓ చెలియా నా ప్రియ సఖియా, ఊర్వశీ ఊర్వశీ, మండ పేట ..ఇలా అన్నీ సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి.

దాంతో ప్రేమికుడు బాక్సాఫీస్ వద్ద భారీ కమర్షియల్ హిట్ గా నిలిచింది. అప్పటి నుంచి ప్రభుదేవా హీరోగా ఎన్ని సినిమాలు చేసినా ముందు చెప్పుకునేది మాత్రం ప్రేమికుడు సినిమా గురించే. ఆ తర్వాత ఆయన కొన్ని సినిమాలలో మంచి సపోర్టింగ్ రోల్స్ చేశారు. ఇప్పుడు దర్శకుడిగా అటు బాలీవుడ్‌లో బిజీగా ఉంటూనే హీరోగా సినిమాలు చేస్తున్నారు. దర్శకుడిగా బిజీగా ఉన్నా, హీరోగా బిజీగా ఉన్నా తన కొరియోగ్రఫీ మాత్రం వదులుకోలేదు. ఖైదీ నంబర్ 150లో మెగాస్టార్‌కి ఒక సాంగ్ కంపోజ్ చేశారు. ఇక ధనుష్ – సాయి పల్లవి జంటగా నటించిన మారి 2 లోని ప్రభుదేవా కొరియోగ్రఫీ అందించిన రౌడీ బేబీ సాంగ్ సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది.  

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago