ఇప్పుడు స్టార్ హీరోయిన్స్ కొందరు ఏడాదికి 4-5 సినిమాలకి డేట్స్ ఇస్తేనే ఇక మా వద్ద డేట్స్ లేవు. మీ సినిమాకి డేట్స్ ఇవ్వాలంటే ఓ సంవత్సరం ఆగాల్సిందే అంటూ కథలు చెప్తుంటారు. భాష ఏదైనా ఒకే సంవత్సరం నాలుగు నుంచి ఆరు సినిమాలు చేస్తే మహా గొప్పగా చెప్పుకోవచ్చు. హీరోయిన్స్ మాత్రమే కాదు హీరోలు కూడా కొంతమంది ఏడాదికి రెండు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలంటే నానా హయరానా పడుతున్నారు. పాన్ ఇండియన్ సినిమా అంటూ సినిమా కోసం కనీసం రెండేళ్ళ సమయం తీసుకుంటున్నారు. అయితే అప్పటి హీరోలు హీరోయిన్‌లు ఏకంగా సంవత్సరానికి 10 సినిమాలకి పైగానే నటించిన వారున్నారు.
మూడు షిఫ్టుల్లో మూడు సినిమాలలో నటించి 10 కి పైగా సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన నటీ నటులున్నారు. ఎన్.టి.ఆర్, ఏ.ఎన్.ఆర్, సూపర్ స్టార్ కృష్ణ, మెగాస్టార్ చిరంజీవి అప్పట్లో మూడు షిఫ్టుల్లో పనిచేసి పదుల కొద్ది తమ సినిమాలను రిలీజ్ చేశారు. వీరిలో ఎక్కువగా సూపర్ స్టార్ కృష్ణ యావరేజ్‌గా సంవత్సరానికి 90 నుంచి 100 సినిమాలు రిలీజ్ చేయడం గొప్ప విషయం. 10 ఏళ్ళపాటైతే ఇలా మూడు షిఫ్టుల్లో పని చేసి సినిమాలను వదిలారు. ఇదీ ఇప్పటికీ ఓ గొప్ప రికార్డ్‌గా నిలిచింది.అయితే అప్పట్లో హీరోలు మాత్రమే మూడు షిఫ్టుల్లో నటించడం కాదు హీరోయిన్స్ కూడా మూడు షిఫ్టుల్లో సినిమాలు చేసిన వారున్నారు.
అలాంటి వారిలో అందమైన హీరోయిన్, మంచి పర్ఫార్మర్ గా పేరు సంపాదించుకున్న కృష్ణకుమారి ఒకరు. ఆమె అనుకోకుండా సినిమాలలోకి వచ్చి స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగారు. కృష్ణకుమారి తల్లితో కలిసి స్వప్నసుందరి సినిమా చూసేందుకు వెళ్ళిన సందర్భంలో అక్కడకి సౌందరరాజన్ గారి అమ్మాయి భూమాదేవి కూడా వచ్చారట. సినిమా హాల్లో కృష్ణకుమారిని చూసిన ఆవిడ ‘నవ్వితే నవరత్నాలు’ అనే సినిమా కోసం కథానాయికని వెతుకుతున్నారు. ఈ సినిమాకి మీరైతే బావుంటారని చెప్పారట. అలాగే ఆ తర్వాత రోజు దర్శక, నిర్మాతలు కృష్ణకుమారి ఇంటికి వచ్చి తల్లిదండ్రుల అనుమతి తీసుకొని ఇందులో హీరోయిన్‌గా ఎంచుకున్నారు.
అయితే కృష్ణకుమారి నటించిన మొదటి సినిమా విడుదల కాకుండానే ఆమె అందం, చలాకీతనం చూసి ఏకంగా 14 సినిమాలలో నటించే అవకాశం కల్పించారట. దీని కారణం మంత్రదండం అనే సినిమా. కృష్ణకుమారి మొదటి సినిమా ‘నవ్వితే నవరత్నాలు’ విడుదలకంటే ముందే మంత్రదండం విడుదలైంది. ఇందులో ఆమె నటన అద్భుతంగా ఉందని అందరూ చెప్పుకున్నారు. దాంతో కృష్ణకుమారి వరుసబెట్టి 14 ప్రాజెక్ట్స్‌లో అవకాశం అందుకున్నారు. ఇలా కెరీర్‌లో అద్భుతమైన సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగారు. 25 ఏళ్ళకి పైగా చిత్ర పరిశ్రమలో కొనసాగిన కృష్ణకుమారి 150 సినిమాలకి పైగా నటించారు.
1963లో ఒకే ఏడాదిలో ఏకంగా 16 సినిమాలలో హీరోయిన్‌గా నటించడం ఓ రికార్డ్. మూడు షిఫ్టుల్లో పనిచేసిన హీరోయిన్స్‌లో కృష్ణకుమారి ముందు వరుసలో ఉంటారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటించిన ఆమె మూడు జాతీయ పురస్కారాలు, రాష్ట్ర ప్రభుత్వ నంది పురస్కారాలు దక్కించుకున్నారు. కాంతారావుతో కలిసి 28 జానపద చిత్రాల్లో నటించడం విశేషం. ఇక బాలీవుడ్ లో కిశోర్ కుమార్ తో కలిసి ఒకే ఒక సినిమాలో హీరోయిన్‌గా నటించారు. హిందీ చిత్ర పరిశ్రమలో కృష్ణకుమారి రతి అనే పేరుతో పరిచయమయ్యారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో సొంతగా ఆమె డబ్బింగ్ చెప్పుకోవడం మరో విశేషం.
తమిళనాడు రాజకీయాల్లో సినీ కుటుంబాలకు సంబంధించిన సంఘటనలు తరచూ చర్చకు దారి తీస్తుంటాయి. తాజాగా ప్రముఖ నటుడు సత్యరాజ్ కుటుంబంలో…
మలయాళ చిత్ర పరిశ్రమలో తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి సంయుక్త మీనన్ పెళ్లి వార్తలు మరోసారి సోషల్…
నేటి జీవనశైలిలో మార్పులు, అసమయ ఆహారం కారణంగా జీర్ణ సమస్యలు చాలా మందిలో కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సహజ ఆహారాలకు…
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది రోజూ ఉపయోగిస్తున్న మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో త్వరలో కొత్త ప్రీమియం సేవలు అందుబాటులోకి రావచ్చని సమాచారం.…
ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ మన జీవనశైలిలో విడదీయలేని భాగంగా మారిపోయింది. అయితే దానిని ఎలా వాడుతున్నామన్నది ఆరోగ్యంపై ప్రభావం…
వేసవి కాలంలో ఎండ తీవ్రత పెరిగినకొద్దీ చర్మ సమస్యలు కూడా ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా ముఖం, మెడ, చేతులపై టానింగ్ రావడం…