Connect with us

Featured

16 ఏళ్ళకే 14 సినిమాలలో ఒకేసారి అవకాశం.. అలనాటి అగ్ర కథానాయిక కృష్ణకుమారి సాధించిన రికార్డ్ ఇప్పటికీ చెక్కు చెదరలేదు..

Published

on

ఇప్పుడు స్టార్ హీరోయిన్స్ కొందరు ఏడాదికి 4-5 సినిమాలకి డేట్స్ ఇస్తేనే ఇక మా వద్ద డేట్స్ లేవు. మీ సినిమాకి డేట్స్ ఇవ్వాలంటే ఓ సంవత్సరం ఆగాల్సిందే అంటూ కథలు చెప్తుంటారు. భాష ఏదైనా ఒకే సంవత్సరం నాలుగు నుంచి ఆరు సినిమాలు చేస్తే మహా గొప్పగా చెప్పుకోవచ్చు. హీరోయిన్స్ మాత్రమే కాదు హీరోలు కూడా కొంతమంది ఏడాదికి రెండు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలంటే నానా హయరానా పడుతున్నారు. పాన్ ఇండియన్ సినిమా అంటూ సినిమా కోసం కనీసం రెండేళ్ళ సమయం తీసుకుంటున్నారు. అయితే అప్పటి హీరోలు హీరోయిన్‌లు ఏకంగా సంవత్సరానికి 10 సినిమాలకి పైగానే నటించిన వారున్నారు.

మూడు షిఫ్టుల్లో మూడు సినిమాలలో నటించి 10 కి పైగా సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన నటీ నటులున్నారు. ఎన్.టి.ఆర్, ఏ.ఎన్.ఆర్, సూపర్ స్టార్ కృష్ణ, మెగాస్టార్ చిరంజీవి అప్పట్లో మూడు షిఫ్టుల్లో పనిచేసి పదుల కొద్ది తమ సినిమాలను రిలీజ్ చేశారు. వీరిలో ఎక్కువగా సూపర్ స్టార్ కృష్ణ యావరేజ్‌గా సంవత్సరానికి 90 నుంచి 100 సినిమాలు రిలీజ్ చేయడం గొప్ప విషయం. 10 ఏళ్ళపాటైతే ఇలా మూడు షిఫ్టుల్లో పని చేసి సినిమాలను వదిలారు. ఇదీ ఇప్పటికీ ఓ గొప్ప రికార్డ్‌గా నిలిచింది.అయితే అప్పట్లో హీరోలు మాత్రమే మూడు షిఫ్టుల్లో నటించడం కాదు హీరోయిన్స్ కూడా మూడు షిఫ్టుల్లో సినిమాలు చేసిన వారున్నారు.

అలాంటి వారిలో అందమైన హీరోయిన్, మంచి పర్ఫార్మర్ గా పేరు సంపాదించుకున్న కృష్ణకుమారి ఒకరు. ఆమె అనుకోకుండా సినిమాలలోకి వచ్చి స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగారు. కృష్ణకుమారి తల్లితో కలిసి స్వప్నసుందరి సినిమా చూసేందుకు  వెళ్ళిన సందర్భంలో అక్కడకి సౌందరరాజన్ గారి అమ్మాయి భూమాదేవి కూడా వచ్చారట. సినిమా హాల్లో కృష్ణకుమారిని చూసిన ఆవిడ ‘నవ్వితే నవరత్నాలు’ అనే సినిమా కోసం కథానాయికని వెతుకుతున్నారు. ఈ సినిమాకి మీరైతే బావుంటారని చెప్పారట. అలాగే ఆ తర్వాత రోజు దర్శక, నిర్మాతలు కృష్ణకుమారి ఇంటికి వచ్చి తల్లిదండ్రుల అనుమతి తీసుకొని ఇందులో హీరోయిన్‌గా ఎంచుకున్నారు.

అయితే కృష్ణకుమారి నటించిన మొదటి సినిమా విడుదల కాకుండానే ఆమె అందం, చలాకీతనం చూసి ఏకంగా 14 సినిమాలలో నటించే అవకాశం కల్పించారట. దీని కారణం మంత్రదండం అనే సినిమా. కృష్ణకుమారి మొదటి సినిమా ‘నవ్వితే నవరత్నాలు’ విడుదలకంటే ముందే మంత్రదండం విడుదలైంది. ఇందులో ఆమె నటన అద్భుతంగా ఉందని అందరూ చెప్పుకున్నారు. దాంతో కృష్ణకుమారి వరుసబెట్టి 14 ప్రాజెక్ట్స్‌లో అవకాశం అందుకున్నారు. ఇలా కెరీర్‌లో అద్భుతమైన సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగారు. 25 ఏళ్ళకి పైగా చిత్ర పరిశ్రమలో కొనసాగిన కృష్ణకుమారి 150 సినిమాలకి పైగా నటించారు.

1963లో ఒకే ఏడాదిలో ఏకంగా 16 సినిమాలలో హీరోయిన్‌గా నటించడం ఓ రికార్డ్. మూడు షిఫ్టుల్లో పనిచేసిన హీరోయిన్స్‌లో కృష్ణకుమారి ముందు వరుసలో ఉంటారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటించిన ఆమె మూడు జాతీయ పురస్కారాలు, రాష్ట్ర ప్రభుత్వ నంది పురస్కారాలు దక్కించుకున్నారు. కాంతారావుతో కలిసి 28 జానపద చిత్రాల్లో నటించడం విశేషం. ఇక బాలీవుడ్ లో కిశోర్ కుమార్ తో కలిసి ఒకే ఒక సినిమాలో హీరోయిన్‌గా నటించారు. హిందీ చిత్ర పరిశ్రమలో కృష్ణకుమారి రతి అనే పేరుతో పరిచయమయ్యారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో సొంతగా ఆమె డబ్బింగ్ చెప్పుకోవడం మరో విశేషం.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Teja Sajja: హనుమాన్ సక్సెస్ భారీగా రెమ్యూనరేషన్ పెంచిన హీరో తేజ.. ఎంతంటే?

Published

on

Teja Sajja:  టాలీవుడ్ ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలలో నటించి అనంతరం హీరోగా ఎంట్రీ ఇచ్చినటువంటి వారిలో నటుడు తేజ సజ్జ ఒకరు. ఈయన బాల నటుడిగా పలు సినిమాలలో నటించారు. ఇకపోతే ఇటీవల ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన హనుమాన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

ఈ సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో తేజ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. జనవరి 12వ తేదీ విడుదలైనటువంటి ఈ సినిమా దాదాపు 300 కోట్ల కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించింది. ఇలా స్టార్ హీరోల సినిమాలను సైతం వెనక్కి నెట్టి ఈ సినిమా కలెక్షన్స్ రాబట్టడంతో హీరోకి వరుస సినిమా అవకాశాలు వస్తున్నాయి.

తేజ సజ్జ ప్రస్తుతం తెలుగు మాత్రమే కాకుండా ఇతర భాష చిత్రాలలో కూడా నటించే అవకాశాలను అందుకున్నారని తెలుస్తుంది. ఇప్పటికే ఎంతో మంది నిర్మాతలు తనని కలిసి అడ్వాన్సులు కూడా ఇచ్చారని సమాచారం. ఇక ఒక సినిమా హిట్ అయింది అంటే తప్పకుండా సెలబ్రిటీలు రెమ్యూనరేషన్ పెంచుతూ ఉంటారు అలాంటిది ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో తేజ కూడా తన రెమ్యూనరేషన్ భారీగా పెంచారని తెలుస్తుంది.

Advertisement

నాలుగు కోట్లు పెంచిన తేజ..
హనుమన్ సినిమా కోసం కేవలం కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నటువంటి ఈయన ఇప్పుడు ఒక్కో సినిమాకు ఏకంగా ఐదు కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇలా ఒక హిట్ సినిమాతో ఈయన ఏకంగా నాలుగు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ పెంచారు ఇలా రెమ్యునరేషన్ పెంచినప్పటికి నిర్మాతలు వెనకడుగు వేయకుండా ఆయన అడిగినది మొత్తం చెల్లిస్తున్నారని తెలుస్తోంది.

Advertisement
Continue Reading

Featured

Upasana: ఆ టాలీవుడ్ హీరో అంటే ఉపాసనకు అంత కోపమా.. ఆ హీరో ఎవరంటే?

Published

on

Upasana: ఉపాసన పరిచయం అవసరం లేని పేరు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నటుడు రామ్ చరణ్ సతీమణిగా మెగా ఇంటికోడలుగా అందరికీ ఎంతో సుపరిచితమైనటువంటి ఈమె తన వృత్తిపరమైనటువంటి జీవితంలో ఎంతో సంతోషంగా బిజీగా గడుపుతున్నారు. ఈమె అపోలో హాస్పిటల్ వ్యవహారాలన్నింటిని చూసుకుంటూనే మరోవైపు సామాజిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.

ఇక ఉపాసన సినీ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి కుటుంబానికి కోడలుగా అడుగు పెట్టారు. ఈ క్రమంలోనే ఈమె గతంలో తన ఫేవరెట్ హీరోల గురించి మన సందర్భాలలో తెలిపారు. అయితే ఈమెకు టాలీవుడ్ ఇండస్ట్రీలో నచ్చని హీరో కూడా ఉన్నారట ఆయనని చూస్తే చాలా కోపం వస్తుందని కనీసం తనతో మాట్లాడటానికి కూడా ఉపాసన ఇష్టపడరంటూ ఒక వార్త వైరల్ అవుతుంది.

ఉపాసనకు ఇండస్ట్రీలో మరి ఏ హీరో అంటే నచ్చదు ఎందుకు ఆ హీరో పై ఆమెకు కోపం అనే విషయానికి వస్తే ఈమెకు అఖిల్ అక్కినేని అంటే ఏమాత్రం ఇష్టం లేదని తనని చూస్తేనే చాలా కోపం వస్తుందని తెలుస్తుంది. ఇలా అఖిల్ అంటే ఇష్టం లేకపోవడానికి కారణం లేదనే చెప్పాలి.

Advertisement

శ్రియ భూపాల్ తో బ్రేకప్..
అఖిల్ గతంలో శ్రియా భూపాల్ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని భావించారు. వీరిద్దరి నిశ్చితార్థం కూడా ఎంతో ఘనంగా జరిగింది. నిశ్చితార్థం తర్వాత వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకొని విడిపోయారు. ఇలా అఖిల్ ప్రేమించిన శ్రియ భూపాల్ ఎవరో కాదు సాక్షాత్తు ఉపాసన కజిన్ సిస్టర్ . ఇలా తన సిస్టర్ జీవితంతో ఆడుకున్నటువంటి అఖిల్ అంటే ఉపాసనకు పట్టరాని కోపం వస్తుందని తనతో మాట్లాడటానికి కూడా ఇష్ట పడరని తెలుస్తోంది.

Advertisement
Continue Reading

Featured

Poonam Kaur: టీడీపీ జనసేన సీట్లు ప్రకటన.. కుక్క ఫోటోని షేర్ చేస్తూ షాక్ ఇచ్చిన పూనమ్?

Published

on

Poonam Kaur: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఎప్పుడు కూడా చాలా ఆసక్తికరంగానే ఉంటాయి. వచ్చే ఎన్నికలలో ఎలాగైనా జగన్మోహన్ రెడ్డిని అధికారం నుంచి తప్పించడం కోసం ఇతర పార్టీలన్నీ కలిసి ఎన్నికల బరిలోకి దిగబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన పార్టీ కలిసి ఎన్నికల బరిలో దిగబోతున్నారు.

ఈ క్రమంలోనే తొలి జాబితా కింద టిడిపి జనసేన కూటమి అభ్యర్థుల జాబితాలను విడుదల చేశారు. ఇందులో మొత్తం 99 అభ్యర్థులను ప్రకటించగా 94 టిడిపి అభ్యర్థులు కాగా మిగిలిన 5 సీట్లను జనసేన పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తూ లిస్టు విడుదల చేశారు. ప్రస్తుతం ఈ విషయంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెతుతున్నాయి.

నాలుగు సీట్లు పొందడం కోసం ఒక పార్టీ పెట్టి తిరిగి ఆ పార్టీని టిడిపితో కలపడం దేనికి అంటూ పలువురు విషయంపై విమర్శలు చేస్తున్నటువంటి తరుణంలో నటి పూనమ్ కౌర్ కూడా పరోక్షంగా ఈ విషయంపై తనదైన శైలిలో సెటైర్స్ వేశారు. పవన్ కళ్యాణ్ కు ప్యాకేజ్ ఇవ్వటం వల్లే టీడీపీతో కుమ్మక్కయ్యారు అంటూ విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

జనసేనకు ఐదు…
ఈ క్రమంలోనే పూనమ్ సోషల్ మీడియా వేదికగా దివంగత నటి శ్రీదేవి కుక్కతో ఆడుకుంటూ ఉన్నటువంటి ఒక ఫోటోని షేర్ చేశారు. దీంతో ఒక్కసారిగా ఈ ఫోటో వైరల్ అవుతుంది. ఇది చూసినటువంటి వైసీపీ ఫ్యాన్స్ తెగ ట్రోల్ చేసేస్తున్నారు ఏం టైమింగ్ అక్క మీది అంటూ కొందరు కామెంట్లు చేయగా మరి కొందరు టైం చూసి కుక్క ఫోటో వదిలింది అంటూ ఈ ఫోటోలపై కామెంట్ లు చేస్తున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!