యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేరళకు చెందిన ఈమె మాతృ భాష తెలుగు కానప్పటికీ.. తెలుగులో అనర్గళంగా మాట్లాడగలదు. ఆమె తెలుగు భాషను ఎంతో చక్కగా మాట్లాడడమే కాదు యాంకరింగ్ చేస్తూ కూడా ఈ రంగంలో మంచి స్థానానికి చేరుకున్నారు. ఆమె యాంకరింగ్ స్పూర్తితో ఎంతో మంది యాంకర్స్ తయారు అయ్యారు.
ఆమె ప్రతీ ఒక్క కార్యక్రమాన్ని చక్కటి చిరునవ్వు, సమయస్ఫూర్తితో యాంకరింగ్ రంగంలో రాణిస్తుంది. తెలుగు, మలయాళంలతో పాటు హిందీ, ఆంగ్ల భాషలలోను ఆమె మాట్లాడగలదు. పంచావతారం, స్టార్ మహిళ, భలే ఛాన్సులే వంటి కార్యక్రమాలకు యాంకరింగ్ చేసి మంచి గుర్తింపును పొందింది సుమ. టీవీ షోలనే కాకుండా ఆమె పలు చలన చిత్రాలకు సంబంధించి ఆడియో ఫంక్షన్లకు వ్యాఖ్యతా వ్యవహరించి ఎంతో పేరు తెచ్చుకుంది.
అయితే ఇటీవల ఆమె యూట్యూబ్ చానల్ కూడా ప్రారంభించి అందులో మంచి కంటెంట్ తో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నారు. ఇదంతా బాగానే ఉన్నా.. ఆమె 1999లో తన తోటి నటుడు రాజీవ్ కనకాలను ప్రేమించి పెళ్ళి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఆమెకు ఇద్దరు పిల్లలు రోషన్, కార్తికేయ. అయితే ఇటీవల ఆమె ఫ్యామిలీతో మాల్దీవ్స్ లో వెకేషన్ కు వెళ్లారు.
అక్కడ ఆమెతో పాటు తమ ఫ్యామిలీతో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఫొటోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఆ ఫొటోలకు నెటిజన్లు ‘ఎంజాయ్ యు ఆర్ వెకేషన్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…