Categories: FeaturedMovie News

ఉపేంద్ర‌-ప్రియాంక ల‌వ్ స్టోరీ.. సినిమాల్లో మాదిరిగానే వెరైటీయే..

కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర సీనీ పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్ననటుడు. అతడి పూర్తి పేరు ఉపేంద్ర రావు. కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపి జిల్లా, కుందాపుర లోని జన్మించాడు. బెంగుళూరులో బికాం చదివిన ఇతడు కళాశాలలో ఉండగానే స్నేహితులతో కలిసి ఒక నాటక బృందాన్ని ఏర్పాటు చేసుకొని నాటక ప్రదర్శనలు చేసేవాడు.

అలా నటిస్తూనే డిగ్రీ చివరి సంవత్సరంలో తన దూరపు బంధువైన ప్రముఖ కన్నడ నటుడు కాశీనాధ్ దృష్టిలో పడ్డాడు. ఇది ఇతని నట జీవితంలో మేటి మైలురాయిగా నిలిచి ఆ తర్వాత అతని నట జీవితాన్ని కీలక మలుపు తిప్పింది. ఆ తర్వాత తెలుగులో కూడా ఓం, ఎ, క‌న్యాదానం, ఉపేంద్ర‌, రా.. సినిమాలు అత‌డికి బాగా పేరు తెచ్చాయి. ఆమ‌ధ్య అల్లు అర్జున్ సినిమా ‘స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి’లో ఓ కీల‌క పాత్ర చేశాడు. 2003, డిసెంబరు 14 న ఇతను తన సహనటి, మిస్ కోల్‌కతాగా ఎన్నికైన ప్రియాంక త్రివేదిని వివాహం చేసుకున్నాడు.

ఇదిలా ఉండగా.. వీరిద్దరు కలిసి ‘రా’, ‘H2O’, ‘శ్రీ‌మ‌తి’ సినిమాలు కూడా క‌లిసి నటించారు. 2001 లో రా సినిమాల సందర్భంలో ఇద్దరికి పరిచయం ఏర్పడింది. వారిద్దరి పరిచయం ప్రేమగా మారింది. కానీ ఏనాడు అతడి ఇతర లవర్స్ లాగా బయటకు తీసుకెళ్లడం, పబ్ లు, పార్క్ లు లాంటివి చేయలేదట. కేవలం ఫోన్లలోనే గంటల తరబడి మాట్లాడుకునే వారట.

అయితే ఇలా మాట్లాడుతున్న తరుణంలో ఫోన్ బిల్లు ఎక్కవుగా రావడంతో.. వాళ్ల తల్లిదండ్రలు మందలించేవారిని ప్రియాంక చెప్పుకొచ్చింది. 2003 లో ‘H2O’ సినిమాలో చేస్తున్న సమయంలోనే వారిద్దరి వివాహం జరిగింది. పెళ్లి తర్వాత కూడా ప్రియాంక పలు సినిమాల్లో నటిస్తున్నారు. దీనికి ఉపేంద్ర ఎలాంటి అభ్యంతరం తెలపలేదట.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago