కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర సీనీ పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్ననటుడు. అతడి పూర్తి పేరు ఉపేంద్ర రావు. కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపి జిల్లా, కుందాపుర లోని జన్మించాడు. బెంగుళూరులో బికాం చదివిన ఇతడు కళాశాలలో ఉండగానే స్నేహితులతో కలిసి ఒక నాటక బృందాన్ని ఏర్పాటు చేసుకొని నాటక ప్రదర్శనలు చేసేవాడు.

అలా నటిస్తూనే డిగ్రీ చివరి సంవత్సరంలో తన దూరపు బంధువైన ప్రముఖ కన్నడ నటుడు కాశీనాధ్ దృష్టిలో పడ్డాడు. ఇది ఇతని నట జీవితంలో మేటి మైలురాయిగా నిలిచి ఆ తర్వాత అతని నట జీవితాన్ని కీలక మలుపు తిప్పింది. ఆ తర్వాత తెలుగులో కూడా ఓం, ఎ, కన్యాదానం, ఉపేంద్ర, రా.. సినిమాలు అతడికి బాగా పేరు తెచ్చాయి. ఆమధ్య అల్లు అర్జున్ సినిమా ‘సన్నాఫ్ సత్యమూర్తి’లో ఓ కీలక పాత్ర చేశాడు. 2003, డిసెంబరు 14 న ఇతను తన సహనటి, మిస్ కోల్‌కతాగా ఎన్నికైన ప్రియాంక త్రివేదిని వివాహం చేసుకున్నాడు.
ఇదిలా ఉండగా.. వీరిద్దరు కలిసి ‘రా’, ‘H2O’, ‘శ్రీమతి’ సినిమాలు కూడా కలిసి నటించారు. 2001 లో రా సినిమాల సందర్భంలో ఇద్దరికి పరిచయం ఏర్పడింది. వారిద్దరి పరిచయం ప్రేమగా మారింది. కానీ ఏనాడు అతడి ఇతర లవర్స్ లాగా బయటకు తీసుకెళ్లడం, పబ్ లు, పార్క్ లు లాంటివి చేయలేదట. కేవలం ఫోన్లలోనే గంటల తరబడి మాట్లాడుకునే వారట.
అయితే ఇలా మాట్లాడుతున్న తరుణంలో ఫోన్ బిల్లు ఎక్కవుగా రావడంతో.. వాళ్ల తల్లిదండ్రలు మందలించేవారిని ప్రియాంక చెప్పుకొచ్చింది. 2003 లో ‘H2O’ సినిమాలో చేస్తున్న సమయంలోనే వారిద్దరి వివాహం జరిగింది. పెళ్లి తర్వాత కూడా ప్రియాంక పలు సినిమాల్లో నటిస్తున్నారు. దీనికి ఉపేంద్ర ఎలాంటి అభ్యంతరం తెలపలేదట.































