ప్రస్తుతం పాకిస్థాన్ ప్రధానిగా ఉన్న ఇమ్మాన్ ఖాన్ ప్రపంచానికి పరిచయం అయింది క్రికెట్ తోనే. ఖాన్ తన 16 వ ఏట లాహోర్లో ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ప్రవేశం చేశాడు. అతడు మీడియం ఫేస్ బౌలర్ గా ఎన్నో వికేట్లను సాధించారు. ఆ తర్వాత అతడు పాకిస్థాన్ కు ప్రధానిగా 2018 ఆగస్టు 17 న ఖాన్ 176 ఓట్లు సాధించి పాకిస్తానుకు 22 వ ప్రధాని అయ్యాడు.
2018 ఆగస్టు 18 న ప్రమాణ స్వీకారం చేశాడు. ఇవన్ని ఇలా ఉండగా.. పాకిస్తాన్ క్రికెట్‌లో ఇమ్రాన్ హవా నడుస్తున్న కాలంలో ఇటు బాలీవుడ్ లో జీనత్ ఓ రేంజిలో దూసుకుపోతోంది. ఓ రోజు క్రికెట్ మ్యాచ్ లో భాగంగా పాకిస్థాన్ క్రికెట్ టీం ఇండియాకు వచ్చారు. అక్కడ ఇమ్రాన్ ఖాన్ జీనత్ ను చూసి ముఖం తిప్పుకోలేకపోయారట. జీనత్ కూడా అంతే ఇమ్రాన్ ఖాన్ ను చూస్తూ ఉండిపోయింది. ఆ రోజు ఇద్దరి చూపులు, చిరునవ్వులు తర్వాత స్నేహంగా మారాయి.
ఇక వారిద్దరి మధ్య వార్తలు, న్యూస్ ఛానల్ లో ప్రసారాలు ఒకటేంటి.. వారిద్దరి ప్రేమాయాణం అంటూ హల్ చల్ చేశాయి. కానీ అనూహ్యంగా జీనత్ అమన్ మజహర్ ఖాన్‌ను పెళ్లి చేసుకుంది. ఇమ్రాన్ ఖాన్ కూడా పెళ్లి చేసుకున్నారు. తర్వాత వీరిద్దరి గురించి ఎక్కడా ప్రస్తావన రాలేదు. వారిద్దరు కూడా ఏ కార్యక్రమంలో కూడా ప్రేమించుకుంటున్నట్లు ఎక్కడా చెప్పలేదు. దీని గురించి ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య రెహమ్ ఖాన్ ఓ పుస్తకంలో ఇమ్రాన్, జీనత్ అనుబంధం గురించి రాసింది.
అయితే కొన్ని రోజుల కిందట జీనత్ పాకిస్థాన్ లోని ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చినప్పుడు ఓ జర్నలిస్టు.. ఇమ్రాన్ ఖాన్ తో మీ ప్రేమ గురించి ప్రస్తావించగా.. తాము పెద్దవాళ్లం అయ్యాము.. పాత సంగతులు ఇప్పుడు అవసరమా అని చెప్పిందట. ఇటీవల జీనత్ పుట్టిన రోజు సందర్భంగా ఆమె పాక్ ప్రధాని శుభాకాంక్షలు చెప్పినట్లు తెలిసింది. ఆయన బాలీవుడ్ మేటి నటి రేఖతో కూడా ప్రేమలో పడ్డాడని నిజం లాంటి వదంతి ప్రచారంలో ఉంది. అంతేకాకుండా అతడు షబానా ఆజ్మీ, మున్‌మున్ సేన్‌లతోనూ ప్రేమ ప్రయాణం సాగిందనే వార్తలు చక్కెర్లు కొట్టాయి.
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…
ఒకప్పుడు వెన్నునొప్పి, మెడ నొప్పి, వెన్నెముక సమస్యలు అంటే 50 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపించేవి. వయసు పెరగడం,…
వైద్య శాస్త్రం రోజురోజుకూ కొత్త మైలురాళ్లు చేరుకుంటోంది. ఒకప్పుడు నయం చేయలేని వ్యాధులకు మందులు కనుగొన్న శాస్త్రవేత్తలు ఇప్పుడు వ్యాధులు…
ఈ రోజుల్లో చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. పని ఒత్తిడి,…
సినిమా అంటే అంకితభావం. పాత్ర అంటే బాధ్యత. ప్రేక్షకుల ముందు కనిపించే ప్రతి సన్నివేశం పరిపూర్ణంగా ఉండాలనే తపన. ఇవన్నీ…
నేటి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన కొద్దీ యోగా చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. శారీరక ఆరోగ్యంతో పాటు…