సుమన్ నాన్నగారు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో ఒక ఉద్యోగి, తల్లి ఓ కళాశాలకు ప్రిన్సిపాల్. వారింట్లో కనీసం ఒక సినిమా మ్యాగజిన్ చదివిన, కనబడిన సందర్భాలు లేవు.అసలు సినిమాల గురించి ఎటువంటి ప్రస్తావన కూడా ఆ ఇంట్లో ఉండదు. ఒక విధంగా చెప్పాలంటే సినిమా ఫ్యామిలీకి ఒక భిన్నమైనది వారి కుటుంబం.
అటువంటి వాతావరణంలో పెరిగిన సుమన్ సినిమాల్లోకి అడుగు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. నటించడం పక్కనపెడితే అసలు డైలాగ్ చెప్పడం కూడా తనకు రాదని సుమన్ చెప్పేవారు. కానీ దర్శక, నిర్మాతలు వినక సినిమాలలోకి రండి ఆ తర్వాత నటన దానంతటదే వస్తుందని బలవంతంగా ఆయన చేత తమిళ చిత్రాల్లో అవకాశాలు ఇచ్చారు. సుమన్ అమ్మ చాలా స్ట్రిక్ట్ ప్రిన్సిపాల్ అయినప్పటికీ.. ఏదో దైవ కృప లేకపోతే ఎంతోమంది మహామహులు ఎంతో కష్టపడితే గానీ సినీ పరిశ్రమలోకి రాలేకపోయారు. అలాంటిది దర్శక నిర్మాతలే నీ దగ్గరికి వచ్చి సినిమాల్లోకి రమ్మనడం నిజంగా దైవజ్ఞ గా భావిస్తున్నానని సుమన్ తల్లి అనడంతో సుమన్ తమిళ చిత్రాల్లో మొదటగా సినీ రంగ ప్రవేశం చేశారు.
అయితే షూటింగ్ ఫస్ట్ డే ఫస్ట్ షాట్ సుమన్ మీదే తీయడంతో కొంత నటన, సంభాషణ విషయంలో తటపటాయించాడం జరిగింది. ఆ తర్వాత యాక్షన్ సన్నివేశాలు తీయడంతో సుమన్ కి సినిమా బెరుకుపోవడంతో మెల్లిగా నటించడం మొదలు పెట్టాడు. భానుచందర్ పరిచయం అనంతరం ఆయన సలహా మేరకు తెలుగు తనకు రాదన్న కూడా బలవంతంగా తమ్మారెడ్డి భరద్వాజ నిర్మాణ సారథ్యం, రేలంగి నరసింహారావు దర్శకత్వంలో “ఇద్దరు కిలాడీలు” చిత్రంలో నటించారు. ఆ తరువాత తరంగిణి, నేటి భారతం, పండంటి కాపురానికి పన్నెండు సూత్రాలు, హిమబిందు, సితార లాంటి చిత్రాల్లో నటిస్తుండగా.. విధివెక్కిరించిందో ఏమో తెలియదు గాని, సుమన్ అనుకోకుండా ఒక కేసులో ఇరుక్కోవలిసివచ్చింది.
కొన్ని నెలల జైలు జీవితం అనంతరం తిరిగి సినిమాల్లో నటించడం మొదలు పెట్టారు. 1988 అన్నపూర్ణ సినీ చిత్ర బ్యానర్ లో టి.ఎల్.వి.ప్రసాద్ దర్శకత్వంలో విడుదలైన “బందిపోటు” చిత్రంలో సుమన్, పూర్ణిమ, కల్పన హీరో హీరోయిన్లుగా నటించారు. అభిమానులు తనపట్ల ఎలా ఉన్నారనే సందిగ్ధంలో ఉన్న సుమన్ కి ఈ సినిమా ఘన విజయం సాధించడంతో అటువంటి అనుమానాలు మొత్తం తేటతెల్లం అయ్యాయి.
ఆ తర్వాత 20వ శతాబ్దం, కొండపల్లి రాజా, చిన్నల్లుడు, దొంగల్లుడు, ఖైదీ ఇన్స్పెక్టర్, నాయుడుగారి కుటుంబం, బావ బావమరిది లాంటి హిట్ చిత్రాల్లో నటించి తిరిగి తన కెరీర్ కి సుమన్ పూలబాట వేసుకున్నారు. ఆ సంఘటన జరిగిన తర్వాత కూడా సుమన్ ఇంకా తన సినీ జీవిత యాత్ర కొనసాగిస్తూనే ఉన్నారు. ఆయన సినిమాల్లోకి అడుగుపెట్టి 42 సంవత్సరాలు పూర్తి కావడం గమనార్హం. తనకు దేవుడి అనుగ్రహం ఉండడం వల్లనే సినిమాల్లోకి రావడం జరిగిందని ఆయన తరచూ చెబుతుంటారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…