Featured

అసలు రాజీవ్ గాంధీ హత్యకు మురారి సినిమాకి సంబంధమేంటో తెలుసా.?!

డైరెక్టర్ కృష్ణవంశీ తాను తీసిన సినిమా తర్వాత జయాపజయాలతో నిమిత్తం లేకుండా గోదావరి నదిపై లాంచీలో ప్రయాణిస్తూ.. చుట్టూ ప్రకృతి అందాలను వీక్షిస్తూ తను ఇంతకుముందు పడిన కష్టం మొత్తం మర్చిపోతూ ఉంటాడు. ఆ క్రమంలో తన స్నేహితుల మధ్య రాజేవ్ గాంధీ హత్య గురించి సంభాషిస్తూ ఫిరోజ్ గాంధీ, సంజయ్ గాంధీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ఇలా ఏమిటి అని అడగగా అందులో ఉన్న ఆయుర్వేద డాక్టర్ ఆ కుటుంబానికి శాపం ఉందని చెప్పారు. శాపమా..? అని కృష్ణవంశీ ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత మరో స్నేహితుడు… ఆంధ్రాలో ఒక పేరున్న వ్యక్తి తన పాలేరును ఒకసారి కొట్టడం జరిగింది. ఆ బాధతో పాలేరు ఆ కుటుంబానికి శాపం పెట్టాడు. ఆ యజమాని పెద్ద కొడుకు పొలంలో ట్రాక్టర్ తిరగబడి చనిపోయాడు. అతని కర్మకాండలు పూర్తిచేసి వస్తూ రెండవ కొడుకు రైల్వే ట్రాక్ వద్ద యాక్సిడెంట్ లో చనిపోయాడు. ఇలా కృష్ణవంశీ మనసులో ఆ విషయాలన్నీ ఒక్కసారిగా మెదిలాయి.

అయితే నందిగాం రామలింగేశ్వర రావు సూపర్ స్టార్ కృష్ణ కి వీరాభిమాని ఆయనతో కంచు కాగడా, కిరాయి కోటిగాడు లాంటి హిట్ సినిమాలు తీయడం జరిగింది.మళ్లీ కృష్ణ గారి మీద ఉన్న అభిమానంతో మహేష్ బాబు తో కూడా ఒక సినిమా తీయాలనుకున్నారు. ఆ క్రమంలో ఆయన కృష్ణవంశీని కలిశారు. మహేష్ బాబు బృందావనం లో శ్రీ కృష్ణుని లా ఉంటాడు. అలాంటి ఆయనకి మురారి లాంటి కథ అయితే బాగుంటుందని కృష్ణవంశీ ఆలోచించాడు. బృందావనంలో కృష్ణుడు, ఓ కుటుంబానికి ఉన్న శాపం ఈ రెండింటితో ఒక అద్భుతమైన కథను కృష్ణవంశీ అళ్ళాడు. పద్మాలయ ఆఫీసులో కృష్ణ, మహేష్ బాబు, రామలింగేశ్వరరావుకు కృష్ణవంశీ ఆ కథ చెప్పాడు.

కృష్ణ గారు లేచి స్టోరీ బావుంది కానీ కన్ఫ్యూజన్ గా ఉంది. మహేష్ బాబు, కృష్ణవంశీ ఇష్టం అని ఆయన వెళ్లిపోయారు. మళ్లీ కథ విన్న రామలింగేశ్వరరావు వేరే ఏదైనా ప్రేమ కథ చిత్రం ఉంటే చెప్పండి అన్నారు ఇద్దరు హీరోయిన్లతో కూడిన ఒక మంచి ప్రేమ కథ చిత్రం ఉంది అని కృష్ణవంశీ చెప్పారు. కానీ మురారి కథ తో సినిమా తీస్తే ఇరవై సంవత్సరాలు సినిమాను గుర్తు చేసుకుంటారు. కానీ ప్రేమ కథతో సినిమా తీస్తే వెంబడే మర్చిపోతారని కృష్ణవంశీ చెప్పడం జరిగింది. చివరికి చేసేది లేక రామలింగేశ్వరరావు మురారి కథను ఓకే చేశారు. స్టోరీ డెవలప్ కోసం భాగవతం, భారతం అందులోని శ్రీ కృష్ణుడు, యశోద పాండవులు వీటన్నిటిని కృష్ణవంశీ కూలంకశంగా చదివాడు. కొన్ని సందేహాలు వస్తే తన గురువు సిరివెన్నెల సీతారామశాస్త్రి దగ్గరికి వెళ్లి నివృత్తి చేసుకున్నాడు.

మహేష్ బాబు సరసన హీరోయిన్ కోసం ముంబై వెళ్లారు. హేమమాలిని కూతురు ఈషాడియోల్ ను అడిగారు. హేమమాలిని డైరెక్టుగా రెమ్యూనరేషన్ ఎంతిస్తారని అడిగేశారు. తర్వాత హైదరాబాదులో లో ఒక పెళ్ళికి సోనాలి బింద్రే హాజరయ్యారు. అక్కడ ఆమెకు మురారి కథ చెప్పగా నచ్చడంతో ఈ సినిమాకి సోనాలి బింద్రే ను ఎంపిక చేసుకున్నారు. ముందుగా “ముకుంద కృష్ణ మురారి” అని టైటిల్ పెడదామనుకున్నారు. కానీ నిర్మాత సింపుల్ గా మురారి అని టైటిల్ పెడితే బాగుంటుందని ఆ టైటిల్ నే ఖరారు చేయడం జరిగింది. అలా మురారి సినిమా 2001 ఫిబ్రవరి 17న విడుదలై సూపర్ హిట్ అయ్యింది.

telugudesk

Recent Posts

తిరుమలలో వైద్య సేవలకు గోల్డెన్ ఛాన్స్… ఫ్రీ వసతి, భోజనం, ప్రొటోకాల్ దర్శనం!

తిరుమలలో వైద్య సేవ చేయాలనుకునే వారికి మంచి అవకాశం అందుబాటులోకి వచ్చింది. Tirumala Tirupati Devasthanams (టీటీడీ) ఆధ్వర్యంలో నడుస్తున్న…

6 minutes ago

“అమ్మాయిలూ… ఉదయం ఈ చిన్న అలవాటు పెంచుకుంటే జుట్టు వత్తుగా, బలంగా పెరుగుతుంది!”

అమ్మాయిల్లో చాలామందికి జుట్టు సరిగ్గా పెరగడం లేదనే ఆందోళన ఉంటుంది. పల్చగా, బలహీనంగా మారిన జుట్టు వల్ల చాలా మంది…

20 minutes ago

గుడిలో చెప్పులు పోతే మంచిదేనా? పెద్దలు చెప్పిన నమ్మకాల వెనుక నిజం ఇదే

గుడికి వెళ్లి దైవదర్శనం చేసుకుని బయటకు వస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. కానీ మెట్ల దగ్గర వదిలిన చెప్పులు కనిపించకపోతే…

1 hour ago

250 ఏళ్ల తర్వాత మళ్లీ కేరళ కుంభమేళా.. ‘మహా మాగం’కు వేలాదిమంది భక్తులు!

దేశంలో కుంభమేళా అంటే వెంటనే గుర్తుకొచ్చేది ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్. అక్కడ జరిగే మహాకుంభమే ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం. కానీ…

1 hour ago

తిరుమల శ్రీవారి సేవకు.. కృష్ణయ్య, పురాణపండలకు ఎన్ని జన్మల పుణ్యమిది..

హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…

13 hours ago

మార్చి 3 చంద్రగ్రహణ ప్రభావం.. జాగ్రత్తగా లేకపోతే ఇబ్బందులే!

2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…

16 hours ago