తెలుగు ఇండస్ట్రీలో నందమూరి కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సీనియర్ ఎన్టీఆర్ నుండి జూనియర్ ఎన్టీఆర్ వరకు తెలుగు తెరపై స్టార్ హీరోలుగా వెలుగొందుతున్న వారే.. ఆ కుటుంబం నుంచి వచ్చిన మరో హీరో కళ్యాణ చక్రవర్తి అనే విషయం చాలా మందికి తెలియదు. 1980 దశకంలో ఎంతో మంది కథానాయకులు తెలుగు తెరకు పరిచయం అయ్యారు. సుమన్, రాజశేఖర్, నాగార్జున, వెంకటేష్, సురేష్, శ్రీకాంత్ లాంటి ఎంతో మంది హీరోలు తెలుగు తెరకు పరిచయమయ్యారు. అలా 1988లో అత్తగారు స్వాగతం అంటూ ఎన్టీ రామారావు సోదరుడు ఎన్ త్రివిక్రమరావు కొడుకు నందమూరి కళ్యాణ్ చక్రవర్తి వెండితెరకు పరిచయమయ్యారు.
1988 లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో భానుమతి రామకృష్ణ ప్రధానపాత్రలో వచ్చిన ‘అత్తగారు స్వాగతం’ చిత్రంలో అశ్విని తో జత కడుతూ హీరో కళ్యాణ్ చక్రవర్తి వెండితెరపై కనిపించారు. అయన తోలి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. ఆ తర్వాత హీరోయిన్ కల్పనతో ‘మామ కోడళ్ళ సవాల్’ లో చిందేశారు. తర్వాత కళ్యాణ్ చక్రవర్తి హీరోయిన్ ఊర్వశి తో ‘ఇంటి దొంగ’ చిత్రంలో నటించారు. ఖుష్బు హీరోయిన్ గా కళ్యాణ్ చక్రవర్తి ‘ప్రేమ కిరీటం’ సినిమాల్లో కనిపించారు. హీరోయిన్ అశ్వినితో రౌడీ బాబాయ్ అలాగే హీరోయిన్ రజిని తో మేనమామ అనే చిత్రంలో నటించారు.
ఆ తర్వాత 1989లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన లంకేశ్వరుడు చిత్రం లో మెగాస్టార్ చిరంజీవికి కి చెల్లెలి భర్తగా అంటే చిరంజీవికి బావ గా కళ్యాణ్ చక్రవర్తి నటించారు. ఇలా వరుసగా సినిమాలు చేస్తూ.. టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే 2003 లో చివరగా కబీర్ దాస్ అనే సినిమాలో నటించారు. ఆ తరువాత మరే సినిమాలోనూ కనిపించలేదు కళ్యాణ్ చక్రవర్తి.
అందుకు కారణం ఎవరికీ తెలియకపోగా ఆయన సన్నిహితులలో కొందరు కొన్ని విషయాలు తెలిపారు. కళ్యాణ్ చక్రవర్తి కుమారుడు పృథ్వి రోడ్డు ప్రమాదంలో చనిపోయారట. ఆ తరువాత కొద్దిరోజులకు అయన తమ్ముడు హరీన్ చక్రవర్తి కూడా మరణించడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యారట కళ్యాణ్ చక్రవర్తి.. అయితే ఇదే సమయంలో తన తండ్రి ఆరోగ్యం బాగా లేకపోవడంతో తనకు సినిమాలకంటే తండ్రి ఆరోగ్యమే ముఖ్యమని ఆయనకు సేవలు చేస్తూ మద్రాసులోనే ఉండిపోయారట. తర్వాత కొన్ని రోజులకు తండ్రి మరణించడంతో తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్లి పోయారు. ఇక అయన తండ్రి చనిపోయిన తరువాత హైదరాబాద్ తిరిగి రాకుండా అక్కడే అయన వ్యాపారాలు చూసుకుంటూ ఉండిపోయారట కళ్యాణ్ చక్రవర్తి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…