Categories: FeaturedMovie News

ఇర్ఫాన్ టీచర్ కావాలన్నది అయన తల్లి కోరిక.. – ఇర్ఫాన్ చిన్ననాటి స్నేహితుడు జైదీ

బాలీవుడ్ లోనే కాదు హాలీవుడ్ లో కూడా తనకంటూ ప్రత్యేకత సంపాదించుకున్న విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్. ఈయన బుధవారం ఉదయం కన్ను మూసిన సంగతి తెలిసిందే. అయితే ఇర్ఫాన్ అకాల మృతిపై అయన చిన్ననాటి స్నేహితుడు హైదర్ అలీ జైదీ స్పందించారు. ప్రస్తుతం భారత్ పూర్ ఎస్పీ గా సేవలందిస్తున్న జైదీ బాల్య మిత్రుడు ఇర్ఫాన్ మరణ వార్త తెలియగానే భావోద్వేగానికి లోనయ్యారు. ఈ క్రమంలో అయన చిన్నప్పుడు ఇర్ఫాన్ తో కలిసి తిరిగిన రోజులను గుర్తు చేస్తుకున్నారు.

ఇర్ఫాన్ టీచర్ కావాలని అయన తల్లి ఎప్పుడు కోరుకునేదని తెలిపారు జైదీ. ఇర్ఫాన్ ఖాన్ చాలా గొప్ప వ్యక్తి అని, ఇప్పటి వరకు ఇర్ఫాన్ ఫోన్ కోసం ఎదురుచూస్తున్నా అంటూనే కన్నీటి పర్యంతమయ్యారు. ఇటువంటి విషాదాన్ని తట్టుకోగలిగే శక్తి ఇర్ఫాన్ కుటుంబానికి ఇవ్వాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా అని తెలిపారు.

ప్రముఖ హిందీ నటుడు ఇర్ఫాన్ ఖాన్ తీవ్ర అనారోగ్యంతో కాసేపటి క్రితం మరణించారు. ఇటీవలే “న్యూరోఎండోక్రిన్ ట్యూమర్” అనే అరుదైన క్యాన్సర్ వ్యాధి నుంచి పోరాడి ఇండియా కు తిరిగివచ్చారు ఇర్ఫాన్ ఖాన్. ఏప్రిల్ 25 న ఇర్ఫాన్ ఖాన్ తల్లి సయీదా బేగం (95) జైపూర్‌లో కన్నుమూశారు. కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా కన్నతల్లిని కడసారి కూడా చూసుకోవడానికి నోచుకోలేకపోయాడు ఇర్ఫాన్ ఖాన్. తన తల్లి అంత్యక్రియలను వీడియో మాధ్యమంగా ద్వారా వీక్షించి తల్లడిల్లిపోయారు ఇర్ఫాన్. కన్నతల్లి మరణించి నాలుగైదు రోజులు కూడా కాలేదు… అపుడే ఇర్ఫాన్ ఖాన్ మరోసారి తీవ్ర అనారోగ్యంతో మరణించడం హృదయవిదారకం. ఇర్ఫాన్ అకాల మరణం బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు తీరని లోటు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

4 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago